మొక్కలు నాటిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, టి-సాట్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ఎస్.కె.జోషీ


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, టి-సాట్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్  ఎస్.కె.జోషీ గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని టి-సాట్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. టి-సాట్ జనరల్ బాడీ సమావేశానికి హాజరైన జోషీ తొలుత టి-సాట్ సీఈవో కార్యాలయంలో సీఈవో ఆర్.శైలేష్ రెడ్డితో టి-సాట్ నిర్వహణ గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జోషీ మాట్లాడుతూ టి-సాట్ భవనం చుట్టూ ఆహ్లాదకర వాతావరం ఉందని అందుకు అనుగుణంగా విరివిగా చెట్లు పెంచాలని సూచించారు.నాటిన మొక్కలు పెరిగి పెద్దవయ్యే వరకు సంరక్షించాలని, అప్పుడే ఫలితాలు వస్తాయన్నారు.సీఎస్ వెంట డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.మొక్కలు నాటే కార్యక్రమం ముగిసాక జోషీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం టి-సాట్ కార్యాలయ ఆవరణలో ఉన్న వి.హబ్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం