**పాకిస్థాన్ పై తీవ్రంగా ధ్వజమెత్తిన కేంద్ర రక్షణ మంత్రి**

పూణే : 


కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. 


సంప్రదాయ యుద్ధంలో గెలవలేకే, పాక్ ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపుతోందని తీవ్రంగా ఆరోపించారు. 


ప్రచ్ఛన్న యుద్ధం చివరికి పాక్ ఓటమికే దారి తీస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. 


పూణేలో శనివారం జరిగిన 137 బ్యాచ్ అవుట్ పాసింగ్ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 1965, 1971 మరియు 1999 లో జరిగిన సంప్రదాయిక, లేదా పరిమిత యుద్ధాల్లో పాక్ ఓడిపోయిందని, భారత్‌పై గెలవలేమని పాక్‌కు అప్పుడే కనువిప్పు కలిగిందని అన్నారు.


తీవ్రవాద మాధ్యమం ద్వారా పాక్ ప్రచ్చన్న యుద్ధానికి పాల్పడాలన్న మార్గాన్ని ఎంచుకుందని, దీని ద్వారా ఓటమి తప్ప పాక్‌కు ఏమీ రాదని ఘంటాపథంగా చెబుతున్నానని ఆయన అన్నారు. 


ఇరుగు పొరుగు దేశాలతో భారత్ ఎప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటుందని ఆయన ప్రకటించారు. 


ఇతర దేశాలపై దాడులు దిగడం కానీ, ఆక్రమించడానికి కానీ ప్రయత్నం చేయదని, కానీ ఎవరైనా రెచ్చగొడితే మాత్రం తగిన మూల్యం చెల్లించాల్సి వుంటుందని హెచ్చరించారు. 


భారతదేశ ప్రజల సార్వభౌమత్వానికి, భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని, కానీ ఎవరైనా దేశంలో ఉగ్రవాద శిబిరానలు నడుపుతుంటే లేదా, దాడికి పాల్పడితే మాత్రం సమాధానం ఎలా ఇవ్వాలో ప్రభుత్వానికి తెలుసునని రాజ్‌నాథ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్