**ప్రధాని ఇంటికి మార్చ్​..***

ప్రధాని ఇంటికి మార్చ్​..


జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 


దిల్లీలోని జామా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. 


పౌర చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 


మసీదు వద్ద ఆందోళనల నేపథ్యంలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఇటీవల హింసాత్మక ఘటనలు పెద్ద ఎత్తున చెలరేగిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. 


భీమ్​ ఆర్మీ అధినేత చంద్రశేఖర్​ ఆజాద్​ను​ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది నిరసనకారులు ప్రధాని ఇంటికి మార్చ్​ నిర్వహించారు. 


మధ్యలోనే పోలీసులు అడ్డుకుని వారిని నిలిపివేశారు. 


మార్చ్​లో భాగంగా చేతులను కట్టేసుకున్న నిరసనకారులు.. తాము హింసకు కారణం కాదంటూ నినదించారు. 


అటు ఆందోళనల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో కూడా భద్రతను పటిష్టం చేశారు. 


ఘజియాబాద్, బులంద్ షెహర్, మీరట్, ముజఫర్ నగర్, షామ్లీ ప్రాంతాల్లో అంతర్జాల సేవలను మళ్లీ నిలిపేశారు. 


ఈ రోజు సాయంత్రం వరకు అంతర్జాల సేవలను నిలిపేశామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. 


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్