**అత్యవసర సమయంలో   రక్తధానం చేసిన  కానిస్టేబుల్ ను అభినందించిన డిజిపి***

*అత్యవసర సమయంలో   రక్తధానం చేసిన  కానిస్టేబుల్ ను అభినందించిన డిజిపి*


పోలీసు ఉద్యోగం అంటే  సామాజిక సేవ అని,  ఈ విషయాన్ని మరోసారి నిరూపించిన సిద్దిపేట పోలీస్ కానిస్టేబుల్ శ్రీశైలం ను రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ ఎం. మహేందర్ రెడ్డి  అభినందించారు.  సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి సందర్భంగా ఒక గర్భిణికి అత్యవసరంగా A+  రక్తం కావాల్సిఉండగా  అక్కడే విధులు నిర్వహిస్తున్న   ఏ పాజిటివ్ రక్తం వున్న శ్రీశైలం అనే పోలీస్ కానిస్టేబుల్  ఆ మహిళకు  రక్తదానం చేశారు. దీంతో ఆ మహిళ కు ప్రమాదం తప్పింది.  ఈ విషయాన్ని తెలుసుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి కానిస్టేబుల్ శ్రీశైలం ను   అభినందించారు.  ఉద్యోగం అంటే సామాజిక సేవ అని పేర్కొంటూ,  ఈ విషయాన్ని శ్రీశైలం మరోసారి నిరూపించారని  డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు.  ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభినందించారు.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్