Skip to main content

**పోలీస్ శాఖ గౌరవం పెంచేలా సమజాభివృద్ధిలో బాగస్వామ్యులు కావాలి  : ఎస్పీ రంగనాధ్**

*పోలీస్ శాఖ గౌరవం పెంచేలా సమజాభివృద్ధిలో బాగస్వామ్యులు కావాలి  : ఎస్పీ రంగనాధ్*


నల్గొండ : పోలీస్ శాఖ ప్రతిష్ట, గౌరవం మరింత పెరిగే విధంగా పదవీ విరమణ పొందిన తర్వాత సమజాభివృద్ది కార్యక్రమాలలో బాగస్వాములవుతూ మంచి పేరు సంపాదించుకోవాలని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు.
గురువారం పోలీస్ శాఖలో పదవీ విరమణ పొందిన ఎస్.ఐ.లు ఏ.మధుసూధన్ రెడ్డి, జె. పెద్దులు, ఏ.ఎస్.ఐ. విజయపాల్ రెడ్డి, ఏ.ఆర్. ఎస్.ఐ. డి. వెంకట కిషన్ లను జిల్లా పోలీస్ కార్యాలయంలో శాలువాతో సత్కరించి వారి సేవలను ఎస్పీ అభినందించారు.


సమాజంలో ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరిస్తూ శాంతియుత వాతావరణంలో ప్రజలు జీవించే విధంగా సేవలందించే అవకాశం పోలీస్ ఉద్యోగం ద్వారా లభిస్తుందని, పోలీస్ ఉద్యోగం ఎంతో ఉన్నతమైనదని పదవీ విరమణ తర్వాత ప్రజలలో పోలీసుల గౌరవం పెరిగే విధంగా వారితో మమేకం కావాలని ఆయన సూచించారు. విధి నిర్వహణలో ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదురైనా నిత్యం ప్రజల కోసం పని చేయడంలో కలిగే సంతృప్తి అలాంటి వాటన్నింటిని మర్చిపోయేలా చేస్తుందని, పోలీస్ ఉద్యోగం లభించడం గర్వకారణమని అన్నారు.


*పదోన్నతి ద్వారా బాధ్యత పెరుగుతుంది*


- - విధి నిర్వహణలో రాజీ పడకుండా పని చేయాలి
- - పోలీస్ శాఖ గౌరవం పెరిగే విధంగా సేవలందించాలి


నల్గొండ : పదోన్నతి పొందిన పోలీస్ అధికారులు ప్రజా మన్ననలు పొందేలా పని చేస్తూ ప్రజలలో పోలీస్ శాఖ ప్రతిష్ట మరింత పెరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ అన్నారు.


గురువారం సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తూ ఏ.ఎస్.ఐ.గా పదోన్నతి పొంది నల్గొండ జిల్లాకు కేటాయించబడిన బలరాం రెడ్డిని ఎస్పీ అభినందించారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా ప్రజలు మెచ్చుకునేలా పనితీరు ఉండాలని సూచించారు.  ప్రజలే మనకు యజమానులనే విషయాన్ని గుర్తించుకొని ప్రజలతో మమేకం అవుతూ ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి బాధలు, సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు. ఏ ప్రాంతంలో పని చేసినా, ఏ బాధ్యతలతో ఉన్నా ప్రజాభిమానం పొందే విధంగా విధి నిర్వహణ చేయాలని. అప్పుడే పోలీసుల గౌరవం మరింత పెరుగుతుందని తెలిపారు. మన పనితీరుతోనే పోలీస్ శాఖ ప్రతిష్ట, గౌరవం ముడిపడి ఉన్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఎస్పీ రంగనాధ్ తెలిపారు.


కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీమతి సి.నర్మద, ట్రైనీ ఐపీఎస్ వైభవ్ గైక్వాడ్, పోలిస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాం చందర్ గౌడ్, సూర్యాపేట అధ్యక్షుడు అమర్ సింగ్, నాయకులు సోమయ్య, జయరాజ్ తదితరులు పాల్గొని పదవీ విరమణ పొందిన వారిని, పదోన్నతి పొందిన బలరాం రెడ్డిలను ఘనంగా సత్కరించి అభినందించారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్