8న హాలియాలో మహిళా రణభేరి - సాగర్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి కంకణాల నివేదిత



8న హాలియాలో మహిళా రణభేరి - సాగర్  నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి కంకణాల నివేదిత

మార్చ్ 8 అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంనగా నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ ము లోని హాలియా పట్టణం లొ మద్యాహ్నం 2 గంటలకు మహిళా రణ భేరి ని నిర్వహిస్తున్నట్లు నాగార్జున సాగర్  నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి కంకణాల నివేదిత తెలిపారు. నల్గొండ  జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ రణభేరి కి   బీజేపీ జాతీయ వైస్ ప్రెసిడెంట్ డి కె అరుణ మాజీ మంత్రివర్యులు ముఖ్య అతిధిగా విచేస్తున్నటు ఆమె  తెలుపారు.  ముఖ్యమంత్రి కేసీఆర్  మహిళల ను కుక్కలతో పోల్చడం సిగ్గుచేటు అని, మహిళలను గౌరవించని టిఆర్ఎస్ కు మహిళలు బుద్ధి చెప్పాలని  ఆమె కోరారు. ఈ ప్రభుత్వం నిజాం రజాకర్లను తలపించే విదంగా ఉందిని,  సమత, దిశ లాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.మహిళలకు ఈ ప్రభుత్వం లో రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. సాగర్ బహిరంగ సభలో మహిళలను కించపరిచిన కేసీఆర్ కు ఈ గడ్డ నుండే బుద్ది చెబుతామని,  రాణి రుద్రమదేవి, చాకలి ఐలమ్మ ల స్ఫూర్తిని నింపుకొని కేసీఆర్ ను తరమడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారు.అందుకు మొదటి అడుగు సాగర్ గడ్డ నుండే మొదలౌతుందని ఆమె తెలిపారు. ఈ రణభేరి మహిళలు, ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మహిళ జిల్లా అధ్యక్షురాలు కొండేటి సరిగా పట్టణ అధ్యక్షులు నేవార్సు నీరజ, నాయకురాలు కూతురు విజయలక్ష్మి, రావెళ్ళ కాశమ్మ  తదితరులు ఉన్నారు


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్