కొవాగ్జిన్‌ టీకాను వేయించుకున్న మోదీ

 


దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా  60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్థులకు ఈ రోజు నుంచి టీకా ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని తొలి డోసు టీకాను తీసుకున్నారు.


తాను తొలి డోసు టీకా తీసుకున్నట్లు మోదీ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. కొవిడ్‌కి వ్యతిరేకంగా మన దేశ వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. అర్హులందరూ కొవిడ్‌ టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మనమందరం కలిసి భారత్‌ను కొవిడ్‌ రహిత దేశంగా తీర్చిదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు.


కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న మోదీ..


భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాను మోదీ తీసుకున్నారు. మోదీకి సిరంజీ ద్వారా ఎయిమ్స్‌ సిస్టర్‌ పి.నివేదా టీకా ఇచ్చారు


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్