మాస్కులు ధరించని 20 మందిపై కేసులు నమోదు : డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి

 


*మాస్కులు ధరించని 20 మందిపై కేసులు నమోదు : డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి*

- - ప్రజారోగ్యం కోసమే మాస్కులపై కఠిన వైఖరి

- - కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

- - మాస్కులు ధరించడంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు


నల్లగొండ : మాస్కులు ధరించని 20 మందిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్ది తెలిపారు.


శుక్రవారం సబ్ డివిజన్ పరిధిలోని నల్లగొండ, చండూర్, నల్లగొండ రూరల్, చిట్యాల, నకిరేకల్ తదితర ప్రాంతాలలో మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్న వారిని గుర్తించి కోవిడ్ నిబంధనల ప్రకారం జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేశామన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రించడం లక్ష్యంగా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండడం కోసమే మాస్కుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని ఆయన తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పరిధిలోని గ్రామాలలో మాస్కుల ఆవశ్యకతను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నామని వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్