Skip to main content

ఐటీ రైడ్స్ లో సీజ్ చేసిన అమౌంట్


ఐటీ రైడ్స్ లో సీజ్  చేసిన అమౌంట్ 

Seized amount total : (Approx) ₹10.74 Cr

Mallareddy residence : 

Mahender reddy residence : 12 lakhs

Badra reddy residence : 6lakhs

Rajashekar reddy residence : ₹3 cr

Sudheer reddy residence : ₹2.50 cr

Raghunandan Residence : ₹2 cr

Praveen reddy residence : ₹1 cr

Trishul reddy residence : ₹2 cr

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి  ఇంటిలో ఐటీ సోదాలు  ముగిశాయి. రెండు రోజుల పాటూ 65 ఐటీ టీమ్‌లు.. 400మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఈ సోదాల్లో రూ.10కోట్ల 50 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సోదాలు ముగిసిన తర్వాత సోమవారం ఐటీ విచారణకు రావాలని మల్లారెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఈ తనిఖీల తర్వాత ఐటీ అధికారులు పంచనామాపై సంతకాలు తీసుకునేందుకు మూడు గంటల పాటూ అక్కడే ఉన్నారని సమాచారం. చివరికి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి సంతకాలు తీసుకున్నారు. ఇంటి నుంచి ఆస్పత్రికి వెళ్లిన కుమారుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తన కుమారుడితో బలవంతంగా సంతకం చేయించుకునే ప్రయత్నం చేశారని మంత్రి ఆరోపించారు.

ఆ తర్వాత ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిన మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. వారిలో రత్నాకర్ అనే అధికారిని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రత్నాకర్‌ను అక్కడే ఉంచారు. ఆ తర్వాత ఐటీ అధికారులు పీఎస్‌కు వెళ్లారు. మల్లారెడ్డిపై దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఐటీ అధికారులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇలా కొద్దిసేపు అక్కడ హైడ్రామా కనిపించగా.. తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. ఇటు మంత్రి మల్లారెడ్డితో పాటూ బంధువుల ఇళ్లలో సోదాలు ముగిసినా.. మంత్రి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లో మాత్రం ఐటీ తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. మరోవైపు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇవాళ హైదరాబాద్‌ రానున్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్