తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి


 తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియమితులయ్యారు. ఇప్పటి వరకు సీఎస్‌గా వున్న సోమేశ్ కుమార్‌ను కేంద్రం తెలంగాణ నుంచి రిలీవ్ చేసి ఏపీ కేడర్‌కు అప్పగించడంతో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపిక అనివార్యమైంది. సీఎస్ రేసులో రామకృష్ణారావు, శాంతి కుమారిలు పోటీపడగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతికుమారి వైపు మొగ్గుచూపారు. దీంతో ఆమె తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. దీనిపై కాసేపట్లో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది. శాంతికుమారి 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో సీఎంవోలో పనిచేసిన అనుభవం ఆమెకు వుంది. 2025 ఏప్రిల్ వరకు శాంతికుమారి తెలంగాణ సీఎస్‌గా కొనసాగనున్నారు



Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు