ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

 

గూడచారి :   పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కారు. నల్లగొండ జిల్లా డిండి గ్రామపంచాయతీ కార్యదర్శి, ఇన్చార్జి ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్న శ్రావణ్ కుమార్ పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. శంకరాచారి అనే వ్యక్తి తన ఇంటి రికార్డులు ఇవ్వాలని కోరగా పదివేల లంచం డిమాండ్ చేశాడు. దీనిపై శంకరాచారి ఏసీబీని ఆశ్రయించారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో శ్రవణ్ కుమార్ పది వేల రూపాయలను శంకరాచారి నుండి తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
 

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్