సింహంలా గర్జిద్దామా? గాడిదలా ఘి పెడదామా?


 సింహంలా గర్జిద్దామా?

 గాడిదలా ఘి పెడదామా?

ఆర్యవైశ్యులరా ఆలోచించి

అడుగు ముందుకు వేయండి.

ఆర్యవైశ్యుల హక్కుల కొరకు ఒకవైపు వైశ్య వికాస వేదిక సింహంలా గర్జిద్దాం అంటుంటే, ఇంకోవైపు రాష్ట్ర సంఘాన్ని ఆక్రమించిన నాయకులు గాడిదలా ఘి పెడదాం అంటున్నారు. ఈ నాయకులు తమ బాధ్యత ను ఎప్పుడూ నిర్వర్తించలేదు కానీ అధికారాన్ని మాత్రం చలాయిస్తూ పదవులతో కులుకుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులకు చేసింది ఏందో ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని చెప్పమనండి.

 సంఘాలు అంటే ఆ కమ్యూనిటీ మేలు చేసేలా ఆర్థికంగా చితికిన కమ్యూనిటీ వర్గానికి ఎంతో కొంత మేలు చేసేలా ప్రవర్తించాలి. ఆ కమ్యూనిటీకి రావలసిన రాజకీయ వాటాను సాధించేందుకు కృషి చేయాలి, చదువుకునే విద్యార్థులకు ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించేలా కృషి చేయాలి. ప్రభుత్వం ద్వారా ప్రకటించే సంక్షేమ కార్యక్రమాలు అందేలా చేయాలి. కానీ ఒక్కటి చేస్తే ఒట్టు.

 గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు వైశ్యుల అభ్యున్నతి పెంచే కార్యక్రమాలు విద్యార్థులకు ఆర్థిక సహాయం, రాజకీయంగా ఎదగడానికి అన్ని పార్టీలకు విజ్ఞప్తులు చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల నిర్వహించుకుంటూ రాష్ట్రంలో అన్ని కమ్యూనిటీలకు ఒక ఆదర్శ సంఘంగా ఉండేది.

 ఇప్పుడు రాజ్యం రాజులు పాలించేలా నిరంకుషత్వంగా అప్రజా స్వామ్య పద్ధతిలో ఎన్నికలు పెట్టుకోకుండానే మేమే అధ్యక్షులం కార్యవర్గం అంటూ దాదాపు తొమ్మిది సంవత్సరాలు దాటిన ఇంకా కొత్త కొత్త వారికి పదవుల పేరుతో బుట్టలో వేసుకొని తమ పబ్బం గ డుపుకుంటున్నారు. ఆక్రమించిన నాయకులు వారు వారి స్వలాభం కొరకు మాత్రమే సంఘాన్ని వాడుకుంటూ ఆర్యవైశ్యులకు రావలసిన హక్కులను ఏనాడు అడిగిన పాపాన పోలేదు. 

ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల వస్తున్న సందర్భంగా అధికార పార్టీ మరియు ప్రతిపక్ష అన్ని పార్టీలు ఆర్యవైశ్యులు అనే ఒక కమ్యూనిటీ ఉన్నదని వారికి కూడా అన్ని రకాల హక్కులు కల్పించాలని ఆలోచన కలిగే విధంగా పోరాటాన్ని ప్రారంభించిన వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ ఇచ్చిన పిలుపు వైశ్య గర్జన ను నిర్వీర్యం చేయాలని ఎప్పటికీ తమ పెత్తనంలో సంఘం ఉండాలని ఆలోచనతో ఒక్కరోజు ముందు, పాలలో ఒక్క విషపు చుక్కలా దీక్షలు చేస్తున్నామని ప్రకటించారు. ఇది ఎంతవరకు సబబు ఆర్యవైశ్యులు గమనించాలి. 

ఈ నాయకులు రాజకీయంలో ఉన్న సర్పంచులకు వార్డు మెంబర్లకు జడ్పిటిసి లకు ఎంపీడీసీలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ చైర్మన్ ల నాయకులకు సన్మానాలు చేస్తూ మేమేదో సాధించాం మా వైపు ఎవరు రావద్దు మేమే ఎల్లకాలం ఉంటాం ఎన్నికలు పెట్టం ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న పద్ధతిలో ప్రవర్తిస్తున్నారు. 

ఆర్యవైశ్యులారా ఇప్పటికైనా ఆలోచించండి జాతి మనుగడ కోసం హక్కుల కోసం జరుగుతున్న October 1 న జరుగుతున్న వైశ్య గర్జనను విజయవంతం చేసి మన ఉనికిని చాటుకుందాం గాడిదల ఘీ పెట్టే వారికి బుద్ధి చెబుదాం. 

ఇప్పటికైనా వైశ్య కమ్యూనిటీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల వారు, పెద్దలు ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది రాష్ట్ర సంఘాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో తేవడానికి ప్రయత్నించాలని కోరుకుంటున్న ఒక సామాన్య ఆర్య వైశ్యుడు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్