*ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం అన్ని ఆర్యవైశ్య సంస్థలు ఒక్కటై "వైశ్య గర్జన"*


 

*ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం అన్ని ఆర్యవైశ్య సంస్థలు ఒక్కటై "వైశ్య గర్జన"*


*ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జాతీయ అధ్యక్షులు ప్రేమ్ గాంధీ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ లో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని అశించాము ..కానీ ఆర్య వైశ్యులకు సరైన న్యాయం జరగ నందున ఆర్యవైశ్య సంస్థలన్నీ ఒక్క దాటిపై గర్జనకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది ఆర్యవైశ్యులు ఉన్నారు.. కానీ ఆర్థికoగా ఆర్యవైశ్యులకు న్యాయం జరగటo లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో 150% శాతం పెరిగిన మా ఆర్యవైశ్యుల్లో పేదరికానికి దగ్గర గా రాజరీకానికి దూరమై పోతున్నాం.. ఇప్పుడున్న అధికార పార్టీ బి.ఆర్.ఎస్ ఒకే ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మాకు పూర్తిగా అన్యాయం చేసింది... కాని రాజకీయ పార్టీలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించాలన్నా ఆర్యవైశ్యులు ఆర్థికంగా , విద్యాపరంగా, రాజకీయంగా పూర్తిగా అణిచివేయబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి అధ్వర్యంలో గత 12 సంవత్సరాల నుండి ఆర్యవైశ్యుల్ని చైతన్య పరుస్తూ 1500 వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసామని.. 24 జిల్లాలలో ధర్నాలు, అసెంబ్లీ ముట్టడి ,ఇలా అనేక ఉద్యమాలు చేసినా ప్రభుత్వం కనీస స్పందన కూడా లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్యవైశ్యుల పాత్ర చాలా కీలకంగా ఆర్థిక భరోసా ఇస్తూ ఉద్యమాల్లో ఊపిరి నిలబడ్డటువంటి ఎంతోమంది ఉన్నారని గుర్తు చేశారు. ఆర్యవైశ్యుల్లోని ఉద్యమకారులకు కూడా సరైన న్యాయం జరగలేదని తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు శ్రీ కాచం సత్యనారాయణ తో కలిసి ఇప్పుడు గర్జనకి పిలుపునిచ్చామని తెలిపారు. ఇంకెన్నాళ్లీ బానిసత్వం కలిసి ముందుకు రండి ...మన ఆర్యవైశ్యుల్లోని పేదరికం నిర్మూలిద్దాం ...వైశ్య గర్జన విజయవంతం చేద్దాం మని పిలుపు నిచ్చారు.


*వైశ్య గర్జన -డిమాండ్స్*


*1000 ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి*

*E.W.S. లో వర్గీకరణ తేవాలి*

*విదేశీ విద్యా ,సహాయ నిధిని ఏర్పాటు చేసి ఆర్యవైశ్యుల విద్యార్థులకు తోడ్పాటు అందించాలి*

 *ఆర్యవైశ్య బంధును ప్రారంభించాలి*

 *రాష్ట్ర వ్యాప్తంగా ఇండస్ట్రియల్ కారిడార్లలో ఆర్యవైశ్య పారిశ్రామిక వేత్తలకు 25% కేటాయించాలి*

*అక్టోబర్ 1, 2023, ఆదివారం మ॥ 3 గం॥ లకు వేదిక: సరూర్ నగర్ స్టేడియం. L.B. నగర్, హైదరా

బాద్*


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్