Skip to main content

Article by కందుకూరి రమేష్ బాబు విను తెలంగాణ - 22 ఇది ‘కామా’కాదు, ఫుల్ స్టాప్ పెట్టే నియోజకవర్గం!


 

Article by కందుకూరి రమేష్ బాబు
విను తెలంగాణ - 22
ఇది ‘కామా’కాదు, ఫుల్ స్టాప్ పెట్టే నియోజకవర్గం! 

కామారెడ్డి రాష్ట ఎన్నికల చరిత్రలో కీలకం కాబోతున్నది. అది ముఖ్యమంత్రి, బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ గారి గెలుపు
కు ‘కామా’ పెట్టడమే కాదు, ఏకంగా వారి రాజకీయ భవితకు ఈ దఫా ‘ఫుల్ స్టాఫ్’ పెట్టేలా ఉన్నదీ అంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చుగానీ రేపు అదే జరిగేలా ఉన్నది. 

కందుకూరి రమేష్ బాబు 

మూడోసారి ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షతో ఉన్న కెసిఆర్ గారు ఏనాడైతే గజ్వేల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారో అప్పుడే ఆయన నైతికంగా ఓడిపోయారని చెప్పాలి. ఇక భౌతికంగా కూడా ఆయన పరిస్థితి ఇక్కడ కష్టంగా ఉంది. ఓడిపోయే స్థితే ఉన్నది. కామారెడ్డిలో స్థానికులైన బిజెపి అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారు ఇక్కడ ప్రజాదరణ విషయంలో మంచి ఆధిక్యంలో ఉన్నారు. ఆయన గనుక కెసిఆర్ గారిని ఓడించారూ అంటే అది కెసిఆర్ గారి రాజకీయ భవితకు తాత్కాలికంగానైనా పెద్ద ఫుల్ స్టాప్ పెడుతుంది. ఆ పరిస్థితి ఉందనే ఈ వ్యాసకర్త క్షేత్ర పర్యటన స్పష్టం చేస్తోంది. ఈ మాటకు మరో ఆధారమూ ఉన్నది. అది రేవంత్ రెడ్డి గారి తాజా ఊపు. 

కెసిఆర్ గారు కామారెడ్డిలో పోటీకి దిగడంతో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెస్తోన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ పోటీకి దిగారు. ఆయన కూడా ప్రస్తుతం బిజెపి అభ్యర్థి తర్వాత కెసిఆర్ కి గట్టి పోటీ ఇస్తున్నారు. అవును. కెసిఆర్ ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నారు. కాగా, వీరిద్దరిలో ఎవరో ఒకరు కామారెడ్డిలో గెలవడం ఖాయంగా ఉన్న నేపథ్యంలో కెసిఆర్ ఓటమి అనివార్యమవుతోంది. అదే నిజమైతే రేపు కామారెడ్డి రాజకీయంగా చరిత్ర సృష్టించబోతోంది.  

ఐతే, రాష్ట వ్యాప్తంగా కాంగ్రెస్ వేవ్ ఒకటి ఉప్పెనగా మరుతున్నందున, ఇవ్వాల్టికి ఇవ్వాళ రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో ఈ వ్యాసం రాస్తున్న సమయానికి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఓడించి రేవంత్ రెడ్డి గనుక గెలిస్తే ఆ ప్రభావం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన నిలదోక్కుకోవడానికీ ఎనలేని ప్రతిష్ట తెస్తుంది. ఈ లెక్కన కూడా ఏ విధంగా చూసినా కామారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో బిఆర్ ఎస్ అధినేత ఆధిపత్యానికి ఫుల్ స్టాప్ పెట్టే స్థితిలోనే ఉన్నది. ఫలితంగా ఒక నియోజక వర్గంగా ‘కామారెడ్డి’ అనుకోకుండా ఒక చారిత్రక బాధ్యతను మోస్తోంది అసాధారణ తీర్పుకు మూలం కాబోతుంది.  

గతవారం దాకా ఇక్కడ వెంకట రమణా రెడ్డి బలమైన అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నప్పటికీ ఎన్నికలు దగ్గర పడుతుండగా రాష్ట్ర వ్యాప్త వేవ్ కాంగ్రెస్ కే అనుకూలంగా ఉన్న వైనం చూసి రేవంత్ రెడ్డి గారినే గెలిపించడం మంచిదా అనే దిశలో ప్రజాభిప్రాయం మెల్లగా రూపు కడుతోంది. అదే గనుక స్థిరపడితే బిఆర్ ఎస్ తో పాటు బిజెపి పార్టీని కాదని కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారిని వీరు గెలిపించవచ్చు. అప్పుడు ఆయన అటు కొడంగల్ తో పాటు ఇక్కడా గెలిచి చరిత్ర సృష్టించే అవకాశమూ ఉన్నది.  

వాస్తవానికి కామారెడ్డి ప్రజలు కెసిఆర్ పట్ల భయాందోళనతోనే ఉన్నారు. గజ్వేల్ తర్వాత ఇటు కెసిఆర్ కన్ను తమ భూములపై పడిందనే అభిప్రాయం ఇక్కడ బలంగా ఏర్పడింది. దాంతో వారు కెసిఆర్ కి రాజకీయ ఆశ్రమం ఇవ్వడం పట్ల ఎంతమాత్రం ఆసక్తిగా లేరు. అదే సమయంలో రాజకీయ క్రీడలో కెసిఆర్ గారిని ఓడించేందుకే వస్తున్న రేవంత్ రెడ్డి పట్ల కూడా అంత సుముఖంగా లేరు. తమ నియోజకవర్గం రాజకీయ క్రీడకు వేదికగా మారడం ప్రశాంతంగా ఉన్న కామారెడ్డి ప్రజానీకానికి నచ్చడం లేదు. అందుకే నిశ్శబ్దంగా తన మానన తాను పనిచేసుకుంటున్న వెంకట రమణారెడ్డి గారి వైపే వారు చూస్తున్నారు. 

కాగా, ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచినా తిరిగి కోడంగల్ స్థానం ఉంచుకుని ఈ నియోజక వర్గానికి రాజీనామా చేస్తారనే అభిప్రాయం వ్యాప్తిలో ఉన్నది. ఆ లెక్కన తమకు అన్ని విధాలా అండగా ఉండే వెంకట రమణా రెడ్డిని గెలిపించుకోవడమే మేలు అన్నది వీరి అభిప్రాయం. తమలో ఒకడిగా ఉంటూ ప్రజల్లో మంచి ఆదరాభిమానాలను చూరగొన్న వెంకట రామణా రెడ్డి గారి పట్లే వీరు అత్యధికంగా మొగ్గు చూపుతున్నారు. అందుకు వారికి చాలా కారాణాలూ ఉన్నాయి. అందులో ఒకటి అతడు కట్టర్ హిందుత్వ వాది కాకపోవవడం, బిజెపిలో ఉన్నా ఆయన మొదట కాంగ్రెస్ పార్టీ వ్యక్తే కావడం, మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్ గా అభివృద్ధికి చేపట్టిన చర్యలూ వారి సానుకూలతకు మరో కారణం. 

వీటన్నిటికన్నా మరో ముఖ్యాంశం, అతడు నూటా యాభై కోట్లతో స్వతంత్ర మ్యానిఫెస్టో ఒకటి ప్రకటించి ఇంటింటికీ వెళ్ళడం, గెలిచినా ఓడినా ఆ నిధులతో పనులు నేరేవేరుస్తానని, ముఖ్యంగా అందులో ఉచిత విద్య, ఆరోగ్యం కీలకంగా పెట్టుకుని ఆ దిశగా పనిచేయడం వారి బలం. ఆ పనులను సైతం వారు ఇదివరకే ప్రారంభించారు. తనది రాజకీయం కాదని విశ్వసనీయ ప్రజా ప్రతినిధిగా ఆయన ప్రజల్లోకి వెళుతున్నారు. అంతేకాదు, నియోజకవర్గం పొడవునా దళిత బహుజనులకోసం,ఎవరు తనను కలిసినా గుడుల నిర్మాణానికి ఆయన ఆర్ధిక సహాయం చేసిన పేరు ఉన్నది. ఇదే కాదు, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో నిర్వాసితులవుతున్న, దెబ్బ తింటున్న ఇరవై వేల రైతులకు ఆయన ఆప్తుడయ్యారు. నిజానికి ఆయన ఆధ్య్వర్యంలోనే ఈ పోరాటం ఊపందుకున్నది. వారితో కలిసి ఆయన పోరాటం చేపట్టారు. ఇవన్నీ ఆయన్ని తమ ప్రియతమ నాయకుడిగా చేశాయి. 

ఇట్లా ఆయన పేరుకు బిజెపి అభ్యర్థిగా ఉన్నప్పటికీ ఒక స్వతంత్ర అభ్యర్థి మాదిరిగా ప్రజాదరణ విశేషంగా పెంచుకుని ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ కెసిఆర్ రావడం, అతడి వల్ల రేవంత్ రెడ్డీ వచ్చి చేరడం, వీరిద్దరూ స్థానికులు కాకపోవడం, వారి రాకతో ఇతడు మొదట కాస్త డీలా పడటం గతవారం దాకా జరిగింది. కానీ మెల్లగా రాజకీయల కన్నా నియోజక వర్గ ప్రగతి ముఖ్యమని ప్రజలు గ్రహించడంతో మళ్ళీ అతడిపై అందరికీ గురి పెరిగింది.  

ఇక కెసిఆర్ గురించి చెప్పుకుందాం. ఆయన పదేళ్లుగా సారాయి కోసం తయారవుతుందనే పేరుతో నల్ల బెల్లం వ్యాపారాన్ని దెబ్బ తీశారు. మద్యం సిండికేట్ కు దారి పరిచారని అంటారు. అట్లా ఇటు రైతులను రైతులనూ ఆదుకోలేదు. గంజి వ్యపారులకూ మేలు చేయలేదు. అంతేకాదు, పసుపు రైతుల ఆదరణా పొందలేదు. బీడీ పరిశ్రమలో ఉన్న మహిళల డిమాండ్లనూ గౌరవించలేదు. అట్లా ఎక్కడికక్కడ వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. వారి పట్ల పద్మశాలీలూ నిరసనతోనే ఉన్నారు. ఇక ఉద్యోగ వర్గం, నిరుద్యోగ వర్గం గురించి చెప్పనక్కరలేదు. వీరంతా కెసిఆర్ ని గెలిపించే ఆలోచనలో ఎంతమాత్రం లేరు. ఇంకా అనేక కారణాలున్నాయి. అందులో వారి కుమార్తె, షబ్బీర్ అలీ గారి తాలూకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలూ నెగెటివ్ అంశాలే. వీటన్నిటి కారణంగా కామారెడ్డి ప్రజలకు కెసిఆర్ ని గెలిపించడం కన్నా ఓడించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పక తప్పదు. 

వాస్తవానికి కెసిఆర్ గారు ఆశించినట్లు ఆయన తల్లిగారిల్లు ఇదే నియోజకవర్గంలో ఉందన్న సెంటిమెంట్ కు కూడా ఇక్కడి ప్రజానీకం పొంగిపోలేదు.ఈ సాకుతో తమ దగ్గరకు వస్తున్నారు గానీ అదేమీ వారిని మెప్పించలేక పోయింది. ఇది కాకుండా ఇంకేదో రహస్య ఎజెండా తోనే వారు కామారెడ్డి ని తన రెండో స్థానంగా ఎంచుకున్నారని స్థానికులు భావిస్తున్నారు. అదేమిటో కాదు, ఇక్కడ భూములను కాజేయడమే అన్నది ప్రజల్లో బలంగా స్థిరపడింది. కాబట్టి వారిని ఆహ్వానించడం అంటే అది ఆత్మహత్యా శరణ్యమే అని అత్యధిక ఓటర్లు, ముఖ్యంగా రైతాంగం భావిస్తున్నారు. అదేగాక తప్పకుండ కెసిఆర్ అధికారంలోకి వస్తారనే నమ్మకమూ వారిలో లేదు. దాంతో వారు ఇంకా పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తున్నారు. తమకు ఎక్కువ లాభం చేకూర్చే అభ్యర్థి ఎవరు, దీర్ఘకాలికంగా ఎవరి అభ్యర్థిత్వం శ్రేయస్కరం అని వారు ఆలోచించి కెసిఆర్ గారిని వారు మొదటి రెండవ స్థానమో కాకుండా తృతీయ స్థానానికి పరిమితం చేయడం ఇక్కడ కానవస్తోంది.  

ఇక రేవంత్ రెడ్డి గురించి ఒక మాట. వారు ఈ రెండు మూడు రోజుల్లో బాగా పుంజుకున్నారు. ఇదే వేవ్ ఇంకా బలపదితే ప్రజలు వెంకట రామణా రెడ్డిని కాదని రేవంత్ రెడ్డిని గెలిపించవచ్చు. అందుకు వారికున్న ముఖ్య కారణం కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చనే భావన. అదీ గాక వారు గెలిస్తే, అదృష్టవశాత్తూ ముఖమంత్రి అవుతే, ఈ నియోజకవర్గం మరింత బాగా అభివృద్ధి కావోచ్చన్న నమ్మకం. ఈ రెండు విషయాలకు తోడు ఇక్కడున్న రెడ్డి కులస్థులు తమకు అధిక ప్రయోజనం పొందే అంశంలో వెంకట రమణా రెడ్డి గారికన్నా అధికారంలోకి వచ్చే రేవంత్ రెడ్డిని గెలిపించుకోవడం మంచిదనే భావనకు రావొచ్చు. అదే గనుక ఐతే, రేవంత్ రెడ్డి రేపటి కల్లా మరింత బలపడి ఎల్లుండి అత్యధిక ఓట్లను పొంది కెసిఆర్ ని ఓడించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బలపడవచ్చు. అట్లా కామారెడ్డి రాష్ట్రంలో కీలక నియోజకవర్గంగా మారనున్నది.

ఈ పరిణామాల్లో మరో విశేషం, ఒక వేళ పైన పేర్కొన్నట్టు, కెసిఆర్ గారు వెంకట రమణారెడ్డి గారి చేతుల్లో ఓడిపోయినట్లయితే ఇక్కడా గజ్వేల్ లో ఇద్దరూ బిజెపి అభ్యర్థుల చేతుల్లో ఓడిపోయినట్లే అవుతుంది; ఈటెల ఓడిస్తారూ అనుకుంటే.   

మొత్తానికి కామారెడ్డిలో ఎవరు గెలిచినా కెసిఆర్ గారు ఓడిపోవడమే గనుక ఖాయం అయితే, ఈ ఎన్నికల్లో కామారెడ్డి కెసిఆర్ ఆధిపత్యానికి కామా కాదు, ఫుల్ స్టాప్ పెట్టే అవకాశమే ఉన్నదని చెప్పాలి.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్