Skip to main content

దేశంలో అసమానతలకు కారణం మనుస్మృతే - సామాజిక ప్రజాసంఘాల నేతలు


      .



ఈ దేశంలో అసమానతలకు కారణం మనుస్మృతే.


మనువాదం ఆశాస్త్రీయమైనది .


ఆర్ఎస్ఎస్,సంఘ్ పరివారితోనే దేశానికి ప్రమాదం.


రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి.


సామాజిక ప్రజాసంఘాల నేతలు

నల్గొండ: 

ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భారత దేశంలో సామాజిక అసమానతలను సృష్టించి, వివక్షతలకు కారణమైనది మనుధర్మ శాస్త్రమేనని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున ఆశాస్త్రీయమైన మనుస్మృతిపై మండిపడ్డారు.


ఆశాస్త్రీయమైన మనుధర్మ శాస్త్రాన్ని నిషేధించాలని, ఈ దేశ బహజన సామాజిక వాదులంతా మనువాదాన్ని ఈ దేశ మట్టిలోనే పాతరేయాలని పిలుపునిస్తూ 1927 డిసెంబర్ 25న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మను ధర్మ శాస్త్రాన్ని మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో వేలాది మంది దళిత బహుజనలతో కలిసి దగ్ధం చేయడం జరిగింది. అదే సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం రోజున నల్లగొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు సామాజిక ప్రజా సంఘాల(కెవిపిఎస్, తెలంగాణ విద్యావంతుల వేదిక, ఎంఎస్పీ,తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం,ప్రగతిశీల యువజన సంఘం,మాల మహనాడు)ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్రానికి సంబంధించిన ప్రతులను దగ్ధం చేయడం జరిగింది.


ఈ సందర్భంగా కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున,తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు మాట్లాడుతూ

అసంబద్ధమైన,అనాగరికమైన ఆలోచనల ద్వారా వేయిల సంవత్సరాలుగా మనుషుల మధ్య సామాజిక అంతరాలు సృష్టించింది మనుస్మృతేనని వారన్నారు.భారతదేశంలో మెజార్టీ ప్రజలకు సహజ సిద్ధమైన ప్రకృతి వనరులను దూరం చేయడానికి దుర్మార్గమైన కర్మ సిద్దాంతాన్ని నమ్మించడానికి ప్రపంచంలో మరెక్కడలేని విధంగా ఈ దుర్మార్గపు సిద్ధాంతం మన దేశంలో బ్రాహ్మణీయ మనువాద శక్తులు అమలు చేస్తున్నాయన్నారు. దాని దుష్ఫలితాలు నేటికి అనేక అసమానతలకు మూలాలుగా కొనసాగుతున్నాయిన్నారు.చదువు భూమి ఆభరణాలు ఆయుధాలు అధికారాలు అన్ని కొద్దీ మంది చేతుల్లో ఉంచుతుంది మనుస్మృతే అన్నారు.. మెజార్టీ ప్రజలు నిషేదించిన మనుస్మృతి భావాలను తుదముట్టించకపోతే ఈ దేశ ప్రజలు వేల ఏండ్లుగా అనుభవిస్తున్న అన్ని రకాల వివక్షతలు అసమానతలు దోపిడీ వంశపారంపర్యంగా కొనసాగి కొందరు కోటీశ్వర్లుగా,కోట్లాది మంది బికార్లుగా శాశ్వతంగా నిలబెడే ప్రమాదం ఉందన్నారు.మనుధర్మశాస్త్రం భారతీయ సమాజాన్ని గతంలోను,ఇప్పుడు విస్తృతంగా ప్రభావంచేస్తుంధన్నారు.భారత,రామాయణ,వేద,ఉపనిషత్తుల అభివృద్ది,నిరోదక సారాలకు ప్రతినిదులుగా కొనసాగుతున్నాయన్నారు.

అంతిమంగా దోపిడి వర్గాలకు సైద్దాంతిక పునాదిగా నిలిసిందన్నారు. కాలక్రమంలో రూపాలలో తేడా వుండవచ్చు కాని 

సారం లో తేడా లేదా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కాపాడటానికి, దోపిడివ్యవస్థ రక్షణకై పుట్టిందే మనువాదం అన్నారు. 


బిజెపి,ఆర్.ఎస్.ఎస్ దేశానికి ప్రమాదం

పందుల సైదులు

తెలంగాణ విద్యావంతుల వేదిక

--------------------

1950 లో ప్రస్తుతమున్న రాజ్యాంగం అమలు లోకి వచ్చిందన్నారు. ఈ రాజ్యాంగానికి మనువాద మూలాలపై దాడి చేసే శక్తి వుందన్నారు. దీని ద్వారా ప్రజాస్వామ్య చట్టాలు అమలుకు వచ్చాయి.సామాజిక వర్గాలు కొన్ని ప్రయోజనాలుపొందాయి. ఈమాత్రం వెసులుబాటు ను కూడా అగ్రకుల సంపన్న వర్గాలు,అగ్రకుల సంపన్న వర్గాల ప్రతినిధిగా వ్యవహరిస్తున్న బిజెపి, ఆర్ఎస్ఎస్, సంఘపరివారమర్ శక్తులు భరించలేక పోతున్నాయన్నారు.ఏది ఏమైనా మళ్లి మనుధర్మాన్ని ప్రతిష్టించాలని మనువాద పాలకులు చూస్తున్నారు. 

మనకెందుకీ అంబెద్కర్ రాజ్యాంగం మనకున్నది మనుధర్మం ని అనంతకుమార్ హెగ్డే(బిజెపి ప్రముఖ నాయకులు మాజీ కేంద్రమంత్రి)అనడం 

(13-8-2019)గమనార్హం అన్నారు.జొన్నవిత్తుల రామలింగ శాస్త్రి,

చిన జియార్ స్వామి నిస్సిగ్గు గా,అనాగరిక పద్దతిలో బూజుపట్టిన,సనాతన మనుధర్మాన్ని, కుల వ్యవస్థ నుబహిరంగంగా సమర్థించడం చూస్తున్నామన్నారు..గోవాల్కర్ నుండి నేటి మోహన్ భగవత్ దాకా,శ్యాంప్రసాద్ ముఖర్జీ నుండి నేటి మోడి వరకు ఎవరు,ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మన ధర్మం అంటూ మాట్లాడుతున్నారన్నారు..మన ధర్మం అంటే మనుధర్మమే అనడమంటే ఇంతకంటే అనాగరికమైన చర్య మరొకటి ఉండదన్నారు.


రాజ్యాంగాన్ని రక్షించుకుందాం 

మనువాదాన్ని పాతరేద్దాం

బకరం శ్రీనివాస్

మహజన సోషలిస్టు పార్టీ

-------------

1950జనవరి26నుండి రాజ్యాంగం అమలులోకి రావడంతో నే చట్టం ముందు అందరూ సమానులే అనే భావం ఏర్పడింది.కానీ ఈ రాజ్యాంగాన్ని నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రద్దు చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తోందని రాజ్యాంగానికి మౌలిక పునాదులు గా ఉన్న ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం ,ఫెడరలిజం సామాజిక న్యాయం వంటి వాటిని పెకిలిస్తుందన్నారు.తిరిగి మధ్యయుగాల కాలం నాటి మనుస్మృతిని ఈ దేశ రాజ్యాంగంగా ప్రవేశపెట్టజూస్తుందన్నారు.దీనివల్ల దేశం ఏమి సాధిస్తుంది మత వైషమ్యాలు పెరగడం,కులఘర్షణలు పెరగడం తప్ప సాటి మనిషిని పశువు కంటే నీచంగా చూడడం మినహా మరేమీ సాధించలేముఅన్నారు. రాజ్యాంగ రక్షణ ద్వారా దేశాన్ని కులం మతం ప్రాంతం బాషా లింగ బేధం లేకుండా ఐక్యంగా ఉంచగలం అన్నారు.కానీ ఆర్ ఎస్ ఎస్ వధలబోయే మనుస్మృతి రాజ్యాంగం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంధన్నారు.. ప్రజల ఐక్యతను దెబ్బతీస్తుంధన్నారు.మతోన్మాద మారణహోమాలు సృష్టిస్తున్నాయన్నారు. కాబట్టి బహుజన లోకమంతా జాగ్రత్త గా నిలబడాలన్నారు.మనుస్మృతి ని మట్టిలో పాతరేయాలన్నారు.రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నారు.


ఈ కార్యక్రమంలో పుచ్చకాయల నర్సిరెడ్డి(సిపిఐ(ఎం)), ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరి సాగర్,తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షమయ్య,కోట్ల ఆశోక్ రెడ్డి(డివైఎఫ్ ఐ)తెలంగాణ మాల మహనాడు రాష్ట్ర అధికార ప్రతినిధి గోలి సైదులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ ,కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శులు గాదె నరసింహ,, సిఐటియు జిల్లా సహయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య,తదితరులు పాల్గొన్నారు.



Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్