జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి


 


జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి 

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డైరీని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి


హైదరాబాద్ :

తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ( టి జే యు) 2024 డైరీ ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పౌర సంబంధాల శాఖ, రెవిన్యూ శాఖ మంత్రి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ 2024 డైరీ ని ఆవిష్కరించారు. ప్రభుత్వానికి ప్రజలకు జర్నలిస్టులు వారధిగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు పెద్దపీట  వేస్తుంది అన్నారు. జర్నలిస్టుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం లోనే తీరాయని ఇప్పటి ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులు అందరికీ న్యాయం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అనతంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి జర్నలిస్టుల సమస్యలు వివరించగా ప్రభుత్వము లో చర్చిస్తా మన్నారు.

తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు  మాట్లాడుతూ 2012న ఏర్పాటు అయినా జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణ ఏర్పాటు కోసం అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేసిందని 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎక్కువగా నష్టపోయింది జర్నలిస్టులన్నారు. కెసిఆర్ కు అనుకూలంగా ఉండే మీడియా సంస్థలకు యూనియన్ లకు తప్ప ప్రజా సమస్యల పై పోరాటం చేసే అనేక మంది జర్నలిస్టులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఈ ప్రజా ప్రభుత్వంలో నైనా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరగా మంత్రి దానికి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ డబ్ల్యూ జె పెద్దాపురం నరసింహ, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్, దాసన్న రాష్ట్ర కార్యదర్శి బర్ల శ్రీనివాస్, దశరథ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి బాపూరావు, ఎబి న్యూస్ చైర్మన్ బ్రహ్మం , సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డి అశోక్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా, సిద్దిపేట జిల్లా కార్యదర్శి మరాటి కృష్ణమూర్తి, కామారెడ్డి జిల్లా కార్యదర్శి ప్రసాద్, స్వామి, రాజేందర్,సాయి శరత్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్