మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన బిజెవైయం నల్గొండ జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖి


 మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన బిజెవైయం నల్గొండ జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖి


బిజెపి ఎమ్మెల్యేలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బిజెవైయం జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ఎమ్మెల్యేలు 8 మంది వెంకట్ రెడ్డి గారితో మరియు కాంగ్రెస్ అధిష్టానంతో అందుబాటులో ఉన్నారని చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో డబ్బు అహంకారం చూపిస్తే నల్లగొండ అసెంబ్లీ ప్రజలు గతంలో ఓడించారు. మళ్లీ దొంగ హామీలను ఇచ్చి ఇప్పుడు ఆరు దొంగ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను మళ్లీ మభ్యపెట్టి అధికారాన్ని తెచ్చుకున్నారు. మరియు ఇప్పుడు అధికార అహంతో భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఆ వ్యాఖ్యలు సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులతోని అందుబాటులో ఉండి రాజగోపాల్ రెడ్డి గారికి సహకరించింది వాస్తవమా కాదా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భారతీయ జనతా పార్టీకి ఒక కోవర్ట్ గా మరియు హోంగార్డుగా అభివర్ణిచారు. మరియు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడుస్తున్నాడని మునుగోడు లో జరిగిన సభలో ఘాటుగా విమర్శించాడు. ఇట్టి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులతో అందుబాటులో ఉంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బలం బలగాన్ని తీసుకొని భారతీయ జనతా పార్టీలో చేరానని జాతీయ నాయకులకు హామీ ఇచ్చింది. వాస్తవమా కాదా. ఈరోజు తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు పక్కనపెట్టి నిరుద్యోగుల సమస్య పక్కనపెట్టి విద్యార్థుల సమస్యల పక్కనపెట్టి మరియు రైతుల సమస్యలు పక్కనపెట్టి ఈరోజు ఇతర పార్టీల మీద మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అందుబాటులో ఉన్నారని విమర్శ చేయడం తగదు. ఏవైతే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు పథకాలు నల్గొండ జిల్లా ప్రజలకు అందే విధంగా సహకారం చేయాలి లేకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భారతీయ జనతా యువ మోర్చా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తిరగనియ్యకుంట అడ్డుకుంటామని తెలియజేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి బస్మాసురుడుగా వివరిస్తున్నాడని అన్నారు. మరియు ఇలాంటి అర్ధంలేని వ్యాఖ్యలు చేసే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని బిజెవైయం జిల్లా కమిటీ హెచ్చరిస్తున్నది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా జిల్లా కార్యదర్శి రేవెల్లి కిరణ్ మాట్లాడుతూ బిజెపి, బిజెవైయం కార్యకర్తలు ఒక ఎమ్మెల్యే, మంత్రి తో సమానమని మా కార్యకర్తలను కొనే దమ్ము నీకాడ లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక జాతీయ భావాలతో దేశభక్తితో కలిగి ఉంటారు కోమటిరెడ్డి లాగా పదవి వ్యామోహంతో ఉండరు అని విమర్శించారు. రానున్న రోజులో పద్దతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెవైయం సెక్రటరీ శాంతి స్వరూప్, బుడుగ భరత్, నగర అధ్యక్షులు దుబ్బాక సాయి, నరేష్ బిజెపి మీడియా కన్వీనర్ గడ్డం మహేష్ పాల్గొనడం జరిగింది..

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్