Chief Minister Shri A.Revanth Reddy, along with Deputy CM Shri Bhatti Vikramarka Mallu called on Union Home Minister and Minister of Cooperation Shri Amit Shah in New Delhi today.
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్ హైద్రాబాద్: (గూఢచారి ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు నిర్వహించుటకు అమరవాది అంగీకరించి కార్యవర్గ సమావేశంలో తీర్మానించి నట్లు మిడిదొడ్డి శ్యామ్ సుందర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మహాసభ అధ్యక్ష మార్పు కొరకు కర్మన్ ఘాట్ వేడుక కన్వెన్షన్ లో జరిగిన సమావేశం లో శ్యామ్ సుందర్ మాట్లాడుతూ ఈ రోజు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ మీటింగ్ లో మహాసభ ఎన్నికలు నిర్వహించుటకు అమరవాది అంగీకరించి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానించి నట్లు శ్యామ్ సుందర్ తెలిపారు. రెండు, మూడు నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అయన అన్నారు. ఈ సమావేశం లో మలిపెద్ది శంకర్, కాచం సత్యనారాయణ, ప్రేమ్ గాంధీ, మొగుళ్లపల్లి ఉపేందర్, యాదా నాగేశ్వర రావు, మోటూరి శ్రీకాంత్, బొడ్ల మల్లిఖార్జున్, అర్థం శ్రీనివాస్, వందనపు వేణు, పుల్లూరు సత్యనారాయణ, బాలరాజు, కొండూరు గణేష్, కొండూరు రాజేశ్వరి మరియు పలు జిల్లాల నుండి సుమారు 300 మంది పాల్గొన్నారు.
మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష! . హైద్రాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుని ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల అధికారి తొడుపునూరి చంద్రపాల్ పేరుతో సోషల్ మీడియాలో ప్రకటించినట్లు వైరల్ అవుతుంది. ఆ షెడ్యూల్ లో ఉన్న వివరాలు చదవండి 17-2-2025 సోమవారం ఉ. 10:00 నుండి మ. 3:00 గం.ల వరకు వ్యక్తిగతముగా గాని, ఆథరైజేషన్ పొందిన వ్యక్తి ద్వారా గాని నామినేషన్ ఫారము తీసుకొనుట మరియు తిరిగి సమర్పించుట. 4:00గం.లకు స్క్యూటిని సా. 5:00 గం.లకు జాబితా ప్రకటన. 18-2-2025 మంగళవారం ఉ. 10:00 నుండి సా, 4:00గం.ల వరకు ఉపసంహరణలు.సా. 5:00 గం.లకు నిఖర జాబితా ప్రకటన. ఈ ప్రక్రియ హైదరాబాద్. : వైశ్య భవన్, చింతలబస్తీ, ఖైరతాబాద్, లో జరుగుతుంది. 4-2025 మంగళవారం రోజున ఉ. 9:00 నుండి సా. 5:00 గం. వరకు ఎన్నికల పోలింగ్. సా. 6:00 గం.లకు కౌంటింగ్ - అనంతరం ఫలితాల ప్రకటన. వాసవీ కళ్యాణ మండపము, వాసవీ సేవా కేంద్రము నందు పోలింగ్ జరుగును. 1) నామినేషన్ వేయు అభ్యర్థులు వారి వెంట మరో నలుగురిని మాత్రమే తీసుకొని రాగలరు. 2) నామినేషన్ వేసిన అభ్యర్థులకు మాత్రమే ఓటర్ లిస్టు ఇవ్వబడు...
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్ మహబూబ్నగర్: ఆర్యవైశ్యుల శ్రేయస్సు నా ఆశయం కొత్తవారికి అవకాశం కల్పించడం మా ఉద్యమం అంటూవనపర్తి జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు గద్వాల జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు నారాయణపేట జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు రాష్ట్ర నాయకులు మండల పట్టణ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసారు. ఆమరవాది లక్ష్మీనారాయణ మహాసభ నుండి దిగి కొత్త వారికి అవకాశం కల్పించాలని తీర్మానం చేశారు ఈ సమావేశానికి సుమారు 200 మంది ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ పట్టణం వైశ్య హాస్టల్ ల్లో ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు మండల నాయకులు పట్టణ నాయకులు ఆధ్వర్యంలో మిడిదొడ్డి శ్యామ్ సమక్షంలో సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంటనే దిగి మరియొక కొత్త వ్యక్తికి అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలని కోరిన నాయకులు. ఆర్యవైశ్య మ...
Comments
Post a Comment