పాతబస్తీలో హైడ్రా కూల్చివేతలు: అక్బర్ నగర్‌లో ఉద్రిక్తత
*పాతబస్తీలో హైడ్రా కూల్చివేతలు: అక్బర్ నగర్‌లో ఉద్రిక్తత*
హైదరాబాద్, మే 8: పాతబస్తీ చాంద్రాయణగుట్టలోని అక్బర్ నగర్ ప్రాంతంలో నగరపాలక అధికారులు చేపట్టిన కూల్చివేత చర్యలు ఉద్రిక్తతకు దారి తీసాయి. భారీ పోలీసు బందోబస్తు నడుమ, హైడ్రా సహాయంతో అనధికారంగా నిర్మించబడిన షాపులను అధికారులు కూల్చివేశారు.
ఈ క్రమంలో స్థానికులు ప్రతిఘటిస్తూ హైడ్రా జేసీబీకి ఎదురు నిలిచారు. కొంతమంది జేసీబీ ముందు పడుకొని కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు మరియు స్థానికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.
ఈ చర్యలకు వ్యతిరేకంగా AIMIM పార్టీకి చెందిన కార్పొరేటర్లు హైడ్రా మరియు మున్సిపల్ అధికారులపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పాతబస్తీ ప్రజలను దేనినీ ముందుగా తెలియజేయకుండా అకస్మాత్తుగా కూల్చివేతలు చేపట్టడం అన్యాయం అంటూ విమర్శించారు.
Comments
Post a Comment