అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
#మహిళల జీవితాలలో వెలుగులు నింపడం ప్రభుత్వ సంకల్పం
#మహిళలను సుసంపన్నం చేసేందుకే వడ్డీ లేని రుణాలు
#ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు నిరంతర కృషి
#విద్యార్థి యువతకు ఉపాధి కల్పనకై ఐ. టి.ఐ,అడ్వాన్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు
#12 కోట్లతో జూనియర్, డిగ్రీ కళాశాలల కొత్త భవనాల నిర్మాణం
#వేల కోట్లతో ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు
#చివరి అంచు వరకు సాగు నీరు అందించేందుకు చర్యలు
#వందల కోట్లతో మారు మూల గ్రామాలకు రహదారుల నిర్మాణాలు
#ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పారదర్శకంగా ఉంటుంది
#అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షలు
#సన్న బియ్యం పంపిణీ ఇక్కడ ప్రారంభం కావడం చారిత్రాత్మక సందర్భం
*-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*
హుజుర్నగర్ లో కళ్యాణాలక్ష్మి/షాధి ముబారక్ చెక్కుల పంపిణీ
#231 మంది లబ్ధిదారులకు 2 కోట్ల 30 లక్షల పంపిణీ
హుజర్నగర్:
కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరుగుతున్న అభివృద్ధిలో ప్రతీ ఒక్కరు విధిగా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
హుజుర్నగర్, కోదాడ నియోజకవర్గాలకు చెందిన ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తన జీవితాన్ని ప్రజా జీవితానికి అంకితం చేసి నిబద్ధత, నిజాయితీతో పారదర్శకంగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పదుతున్నానని ఆయన అన్నారు.
ఆదివారం ఉదయం హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలోని 231 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ/షాధి ముబారక్ పధకంలో భాగంగా రెండు కోట్ల ముప్పయి లక్షల రూపాయల చెక్ లను ఆయన లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
మహిళల జీవితాలలో వెలుగులు నింపడం ప్రభుత్వ సంకల్పమని ఆయన పేర్కొన్నారు.
మహిళలను సుసంపన్నం చేసేందుకే వడ్డీలేని రుణాలు అందజేసినట్లు ఆయన తెలిపారు. సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు
ఈ ప్రాంత విద్యార్థి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు వీలుగా ఇక్కడ ఐ.టి.ఐ తో పాటు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ను నెలకొల్పినట్లు ఆయన వివరించారు.
అంతే గాకుండా ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గాను హుజుర్నగర్ లో 7.50 కోట్ల వ్యయంతో జూనియర్ కళాశాల భవనం,4.50 కోట్లతో డిగ్రీ కళాశాల భవనాలను నిర్మిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు
హుజుర్నగర్, కోదాడ ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకే వేల కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పధకాలను నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అందుకు గాను త్వరితగతిన భూసేకరణ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
చివరి అంచు వరకు సాగు నీరు అందించాలని నీటిపారుదల రంగంపై పెట్టె ప్రతి పైసా రైతాంగానికి ఉపయోగ పడాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
పెరుగుతున్న రవాణాకు తగిన రీతిలో మారుమూల గ్రామాలలో వందల కోట్లు వెచ్చించి రహదారుల నిర్మాణం చేపట్టామని ఆయన గుర్తు చేశారు
హుజుర్నగర్ పట్టణంలోనీ రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన 2,000 ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని అధికారులను ఆయన ఆదేశించారు
లబ్ధిదారులు మొత్తానికి మొత్తంగా హుజుర్నగర్ పట్టణంతో పాటు హుజుర్నగర్ మండలానికి చెందిన వారై ఉండాలని ఆయన సూచించారు.
అయితే ఇళ్ల కేటాయింపులలో ఎటువంటి వత్తిడికి లొంగొద్దని పూర్తిగా పారదర్శకంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు
మిగిలిన మండలాల్లో ఇళ్లు లేని నిరుపేదలకు ఐదు లక్షల రూపాయలు అందించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అవుతుందని ఆయన ప్రకటించారు
అర్హులైన నిరుపేదలకు ఉచితంగా అందించే సన్న బియ్యం పంపిణీ హుజుర్నగర్ లో ఉగాది పర్వదినం రోజున ప్రారంభించడం ముమ్మాటికీ ఒక చారిత్రాత్మకమైన సందర్భంగా ఆయన అభివర్ణించారు
అటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి తాను మంత్రిగా విధులు నిర్వర్తించడం తన పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నాన్నారు.
రాష్ట్ర జనాభాలో 84 శాతానికి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేసి పేదోళ్ల జీవితాల్లో వెలుగులు నింపడం మించిన సంక్షేమ పథకం మరోటి ఉండదన్నారు.
యావత్ భారతదేశంలో ఈ తరహా కార్యక్రమం ఒక్క తెలంగాణా రాష్ట్రంలో అదీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభం కావడం విశేషమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు
Comments
Post a Comment