వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను సందర్శించనున్న BJP' రెండు బృందాలు-ప్రేమేందర్ రెడ్డి


 వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను సందర్శించనున్న BJP' రెండు బృందాలు-ప్రేమేందర్ రెడ్డి

హైద్రాబాద్: 

గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఇంచార్జ్ నేడు తేదీ 4 సెప్టెంబర్ 2024న హైదరాబాదులో విడుదల చేసిన ప్రకటన 


భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి  జి కిషన్ రెడ్డి రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను సందర్శించడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు బృందాలు 6 సెప్టెంబర్ 2024న వరద బాధిత ప్రాంతాలలో పర్యటిస్తాయి. 


కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు  సంకినేని వెంకటేశ్వరరావు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, శాసనసభ్యులు  పైడి రాకేష్ రెడ్డి తదితరులు పర్యటిస్తారు. 


జాతీయ కార్యవర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు  ఈటల రాజేందర్ నేతృత్వంలో మహబూబాద్, ములుగు ప్రాంతాలలో బిజెపి శాసనసభ పక్ష నాయకులు  ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, శాసనసభ్యులు  రామారావు పాటిల్ తదితరులు పర్యటిస్తారు. 


భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం స్థానిక నాయకత్వం ఎక్కడికక్కడ వరద ప్రాంతాలలో పర్యటిస్తూ స్థానిక ప్రజలను రైతులకు ధైర్యం చెప్తూ సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. 


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్