భారత ఆహార సంస్థ లో స్వచ్ఛతయే సేవ కార్యక్రమం




భారత ఆహార సంస్థ లో స్వచ్ఛతయే సేవ కార్యక్రమం 

నల్గొండ, గూఢచారి:


భారత ప్రభుత్వ ఆహార, వినియోగ దారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు భారత ఆహార సంస్థ ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ వారి ఆదేశాల మేరకు, భారత ఆహార సంస్థ నల్గొండ డివిజనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 17 తేదీ నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు స్వచ్ఛతయే సేవ కార్యక్రమం నిర్వహించబడుతుందని సంస్థ ఇన్చార్జి డివిజనల్ మేనేజర్ హీరా సింగ్ రావత్ ఒక ప్రకటనలో తెలిపారు. 

ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉద్యోగులచే స్వచ్ఛత ప్రతిజ్ఞ, సంస్థ కార్యాలయాలు మరియు డిపొలలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమం , స్వచ్చత పరుగు & సఫాయి కార్మికులను గౌరవించడం వంటి కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. 

అంతేకాకుండా, సఫాయి కార్మికుల ఆర్థిక ప్రగతి, సామాజిక భద్రతకి తోడ్పడే వివిధ కార్యక్రమాలు కూడా సంబంధిత శాఖల వారి సమన్వయంతో నిర్వహిస్తామని ఆయన వివరించారు. అదే విధంగా, మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు స్వచ్ఛత కోసం వివిధ ప్రదేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సంస్థ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్