రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


 *రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు  తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*


“చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండగ” అని ప్రజలకు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో పదేండ్ల చీకటిని పారద్రోలి ప్రజలు వెలుగుల రేఖలను సృష్టించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రజాపాలనపై విషం చిమ్ముతున్న అజ్ఞానులకు.. జ్ఞానదీపం వెలగేలా లక్ష్మీదేవి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మంత్రి కోరుకున్నారు. 

ఈ దీపావళి పండగ ప్రజల జీవితాల్లో వెలుగురేఖలను ఇనుమడింపచేయాలని ఆ భగవంతుడిని కోరుకున్నారు. చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకొని వెలుగుల పండగను సంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు