సరస్వతి నది పుష్కరాలు- 2025 పోస్టర్ విడుదల చేసిన మంత్రి శ్రీమతి కొండా సురేఖ
సరస్వతి నది పుష్కరాలు- 2025 పోస్టర్ విడుదల చేసిన మంత్రి శ్రీమతి కొండా సురేఖ
తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మే 15 నుండి 26- వరకు జరగనున్న సరస్వతి నది పుష్కరాలు కోసం తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారిక పోస్టర్ను అటవీ, పర్యావరణ & దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ విడుదల చేశారు.
ఈ సందర్భంగా పర్యవరణ పరిరక్షణ ఆవశక్యతని సూచిస్తూ తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారిక పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భం గా మాట్లాడుతూ, నదులను పరిరక్షించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు (SUP) నిషేదించడం, బట్టలు ఉతకడం, వ్యర్థాలను సరిగ్గా నిర్వహణ నీటి కాలుష్యం నుండి చర్మ వ్యాధులను నివారించడానికి పరిసరాలను శుభ్రంగా ఉంచడం అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రజా రవాణాను ఉపయోగించడం వల్ల వాహన కాలుష్యం మరియు రద్దీ తగ్గుతుంది అని తెలిపారు.
మనం సమిష్టి బాధ్యత తీసుకొని మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పుష్కరాల పవిత్రతను కాపాడుకోవడానికి చేతులు కలపాలని మంత్రి కొండా సురేఖ అన్నారు.
Comments
Post a Comment