మీడియా లో వస్తున్న రాజభవన్ లో చోరీ కి సంబంధించి ఏసిపి పంజాగుట్ట ఎస్. మోహన్ కుమార్ వివరణ:


  

మీడియా లో వస్తున్న రాజభవన్ లో చోరీ కి సంబంధించి ఏసిపి పంజాగుట్ట ఎస్. మోహన్ కుమార్ వివరణ: 

యధాతథంగా చదవండి

తేదీ 10/5/2025 నాడు రాజభవన్ లో పనిచేసే ఒక మహిళ ఉద్యోగి తన ఫోటోలను ఎవరో అసభ్యంగా మార్పింగ్ చేసారని, అట్టి మార్ఫింగ్ చేసిన ఫోటోలను శ్రీనివాస్ అనే సహోద్యోగికి పంపించారు, మరియు ఈ విషయం అదే శ్రీనివాస్ అనే సహోద్యోగి ద్వారానే తనకు తెలిసిందనే పిర్యాదు పై కేసు నమోదు చేసి, అట్టి మార్పింగ్ చేసినది ఆ కార్యాలయంలో పనిచేసే ఆమెయొక్క సహోద్యోగి శ్రీనివాస్ ,age:45 years,occ: ఐటీ హార్డ్వేర్, గా గుర్తించి తేదీ 12/05/2025 నాడు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించగా, అతను బెయిల్ పైన బయటకు వచ్చినాడు.


అట్టి నేరంలో పాల్పడ్డ ఉద్యోగిని రాజ్ భవన్ వారు చట్ట ప్రకారంగా సస్పెండ్ చేశారు. 


అట్టి ఉద్యోగి సస్పెన్శన్ లో ఉండగా, తను పనిచేసే రాజభవన్ కార్యాలయంలోకి వచ్చి తను ఉపయోగించే సిస్టం లో మార్పింగ్ ఫోటోలు ఉన్న హార్డ్ డిస్క్ ను తీసుకుని వెళ్ళిపోయాడు.

తేదీ14/05/2025 నాడు రాజ్ భవన్ IT manager గారు ఇచ్చిన పిర్యాదు పై, మరో కేసు నమోదు చేసి సస్పెన్షన్ లో ఉన్న ఆ ఉద్యోగిని విచారించి, అట్టి హార్డిస్క్ రికవరీ చేసి ,అట్టి ఉద్యోగిని మరల తేదీ 15/05/2025 నాడు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడమైనది.


 ఈ రోజు అనగా తేదీ 20/05/2025 వివిధ చానెళ్లలో బయటి వ్యక్తులు వచ్చి రాజ్ భవన్ లో దొంగతనం చేశారని; రాజ్ భవన్ కి సంబంధించిన కీలక విషయాలు ఉన్న డాక్యుమెంటులు కూడా పోయినాయని వస్తున్న వార్తలు అవాస్తవమని గమనించగలరు



Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం