నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ అంతా గందరగోళం - జిల్లా కిసాన్ మోర్ఛ అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి



 నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ అంతా గందరగోళం - జిల్లా కిసాన్ మోర్ఛ అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి 


నల్గొండ: నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ అంతా గందరగోళంగా తయారు అయ్యిందని మా ప్రతినిధికి తెలుపుతూ రాష్ట్ర జిల్లా ఉన్నత అధికారులు దృష్టి పెట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన కిసాన్ మోర్ఛ అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి.


కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతు తెచ్చిన ధాన్యం కంటే ట్రక్ షీట్స్ తక్కువ రాసి మిల్లర్లకు లాభం చేకూరుస్తున్నారని, ఒక్క మిల్ కు పోవలసిన ధాన్యం ఇంకో మిల్లు కు పంపుతున్నారని ఆయన విమర్శించారు.


క్వింటాలుకు 2 రూపాయలు రైతుల దగ్గర వసూలు చేస్తున్నారనీ, గన్ని బ్యాగ్స్ కు కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.


ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడానికి దూరపు మిల్లులకు టాగ్ చేస్తు ప్రభుత్వానికి నష్టం చేకూర్చడమే కాకుండా, క్వింటాలుకు 5 కిలోలు కన్నా ఎక్కువ కట్ చేసి సెంటర్ నిర్వాహకులు మిల్లర్లు పంచుకుంటూ రైతులకు నష్టం చేస్తున్నారని, అధికారులు ఉద్యోగులు ప్యాడ్ అల్టిమెంట్ కు కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆలాట్ మెంట్ చూస్తే అర్ధం అవుతుందనీ అన్నారు.


ప్రతి ట్రక్ చిట్ రివైజ్ చేసి ప్యాడి తగ్గించి వ్రాసి రైతులకు నష్టం చేస్తున్నారనీ. ఆ విషయం రైతుకు డబ్బులు పడే వరకు తెలవదని, ఒక్కో రైతుకు 20 వేల నుండి 75వేల వరకు నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయిని, కాంట్రాక్టర్ లు ప్యాడి ట్యాగ్ లేని మిల్లులకు కూడా దించుతున్నారని విమర్శించారు.


జిల్లా లో ధ్యానం కొనుగోలు అంత గందర గోళం గా తయారు అయ్యి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మరియు కార్పొరేషన్ కంట్రోల్ లేకుండా అయ్యిందనీ వెంటనే జిల్లా రాష్ట్ర ఉన్నత అధికారులు చర్యలు తీసుకొని, రైతులకు న్యాయం చేయాలని, ప్రభుత్వానికి నష్టం రాకుండా చూడాలని డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్