ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేసే థీమ్పై TGPCB స్కిట్ ప్రోగ్రామ్


 ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేసే థీమ్పై  TGPCB స్కిట్ ప్రోగ్రామ్


హైద్రాబాద్, (గూఢచారి): 

 తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి - టి జి పి సి బి ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేసే” థీమ్పై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి స్కిట్ ప్రోగ్రామ్ నిర్వహించింది.





“ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేసే” థీమ్పై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (స్కిట్ ప్రోగ్రామ్ నిర్వహించెను. ఈ కార్యక్రమంలో పిల్లలు ప్లాస్టిక్ వాడకం గురించి మరియు దాని దుష్ప్రభావాలను వివరించి, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు పరిష్కారాలను ప్రదర్శించారు.


ఈ స్కిట్లో విద్యార్థులు వివిధ పాత్రల్లో ప్రదర్శించి, ప్లాస్టిక్ కాలుష్యం మన ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వివరించారు. విద్యార్థులు తమ థీమ్లను ఉపయోగించి ప్లాస్టిక్తో పులిసిన సముద్రాలు, నదులు, మరియు జంతువుల ఆహారంలో ప్లాస్టిక్ భాగాలు చేరడం వంటి అంశాలను చూపించారు. విద్యార్థులు ప్లాస్టిక్ను తగ్గించే మార్గాలు, పునర్వినియోగం, పద్ధతులను ప్రదర్శించారు


స్కిట్ ప్రోగ్రామ్ ద్వారా, విద్యార్థులు ప్రేక్షకులకు ప్లాస్టిక్ కాలుష్యం ముఖ్యంగా, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిర్మూలన పై అవగాహన కలిపించారు.

 “చెట్ల రక్షణ మరియు ప్లాస్టిక్ రహిత సమాజం లాంటి కార్యక్రమాలు ద్వార కాలుష్యాన్ని నియంత్రించటానికి “ యువత ముందుండాలని జిల్లా సైన్స్ అధికారి అన్నారు.


ఈ కార్యక్రమంలో సంయుక్త ప్రధాన పర్యావరణ శాస్త్రవేత్త (జె సి ఇ ఎస్) డాక్టర్ ఎం.సత్యనారాయణరావు జిల్లా సైన్స్ అధికారి జి.ప్రభాకర్, ప్రాజెక్టు అధికారి బి.నాగేశ్వరరావు పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.


Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం