ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో 2 వ స్థానంలో నల్గొండ జిల్లా.


 ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో 2 వ స్థానంలో నల్గొండ జిల్లా.


 జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ పి. గౌతమ్ .


 గృహనిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ కు ల్యాప్ టాప్ ,ప్రశంసా పత్రం బహుకరణ. 


 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, గ్రౌండింగ్, చెల్లింపులు, ఇండ్ల పురోగతిలో నల్గొండ జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచింది. నల్గొండ జిల్లా రెండో స్థానంలో నిలిచినందుకుగాను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ పి. గౌతమ్ జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు .అంతేకాక బుధవారం హైదరాబాద్ లోని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో నల్గొండ జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజక్టు డైరెక్టర్ రాజకుమార్ ను అభినందించడమే కాక, ల్యాప్ టాప్ ను, ప్రశంసా పత్రాన్ని అందజేశారు.


 కాగా, నల్గొండ జిల్లాకు ఇందిరమ్మండ్ల పథకం కింద మొత్తం 19625 గృహాలు కేటాయించగా, జిల్లా యంత్రాంగం 17247 గృహాలను మంజూరు చేసింది. ఇప్పటివరకు 13581 గృహాలు గ్రౌండ్ కాగా, వాటిలో 10116 గృహాలు వివిధ దశలలో ఉన్నాయి వీటిలో కొన్ని గృహాలు పూర్తయ్యాయి. ఒక్కసెప్టెంబర్ మాసంలోనే జిల్లాలో 5919 గృహాలు గ్రౌండ్ అయ్యాయి.అంతేకాక, సెప్టెంబర్ నెలలో జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు 80 కోట్ల రూపాయల చెల్లింపులను చేయడం జరిగింది.ఇందిరమ్మ ఇండ్ల పై రాష్ట్ర వ్యాప్త సమీక్ష సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ అంశాలను పరిశీలించగా, నల్గొండ జిల్లా గ్రామీణ, పట్టణ ప్రాంత సర్వే ,ఇందిరమ్మ ఇండ్ల ఫిజికల్, ఫైనాన్షియల్ పురోగతి,ఎల్ 1,ఎల్2,ఎల్3 దరఖాస్తుల పరిశీలన, మోడల్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం తదితర అన్ని రంగాలతో పాటు, చెల్లింపులలో కూడా నల్గొండ జిల్లా 2 వ స్థానంలో నిలిచింది. కాగా మొదటి స్థానంలో నారాయణపేట జిల్లా ఉంది.


 ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నల్గొండ జిల్లా రెండో స్థానంలో నిలిచినందుకు గాను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం తన క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ ను శాలువాతో సన్మానించారు .ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు జిల్లా యంత్రాంగానికి, గృహ నిర్మాణ శాఖ పి డి కి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం