ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం ఎఫ్‌డీసీ డివిజనల్ మేనేజర్....


 ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం ఎఫ్‌డీసీ డివిజనల్ మేనేజర్.... విశాఖపట్నంలో అదుపులోకి తీసుకున్న ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ టీమ్ 


కొత్తగూడెం ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణిని ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ టీమ్ విశాఖపట్నంలో అదుపులోకి తీసుకున్నారు.

రూ.28 లక్షలు డిమాండ్ చేసి, రేంజర్ రాజేందర్, మధ్యవర్తి గోపాలకృష్ణ ద్వారా రూ.3.50లక్షలు తీసుకుంటున్న సందర్భంగా అన్నపురెడ్డిపల్లి మండలం సీతాయిగూడెంలో ఏసీబీ అధికారులు జనవరి 3న రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు.

టన్నుకు 90 రూపాయల చొప్పున మొత్తం రూ.28 లక్షలు డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

రేంజర్ ను ఏసీబీ అధికారులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుండి డివిజనల్ అధికారిణి శ్రావణి పరారిలో ఉన్నారు.

ఏసీబీ ఆమె పై నిఘా పెట్టి విశాఖపట్నంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమె ముందస్తు బెయిల్ కు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

శ్రావణిని ఏసీబీ కోర్టు ముందు హాజరు పరచనున్నారు. ఈ కేసు అటవీ అభివృద్ధి సంస్థలో సంచలనం సృష్టించింది.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*