తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ జిల్లాల కన్వీనర్ & కమిటీల ఎంపిక సమావేశం
తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ జిల్లాల కన్వీనర్ & కమిటీల ఎంపిక సమావేశం
హైద్రాబాద్:
తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ మీడిదొడ్డి శ్యామ్ ఆధ్వర్యంలో ఉపేందర్ మొగుళ్లపల్లి చైర్మన్ గా సమావేశం అక్టోబర్ 12, ఆదివారం ఉదయం హైద్రాబాద్ లోని ఖర్మన్ ఘాట్ వేడుక ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైశ్య మహాసభ పూర్వ అధ్యక్షులు గంజి రాజమౌళి గుప్తా, ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వల సుజాత, కార్పొరేన్ మాజీ చైర్మన్లు కోలేటి దామోదర్, ఉప్పల శ్రీనివాస్, బొల్లం సంపత్ లు, యాదా నాగేశ్వరరావు లు హాజరు అవుతారని నిర్వాహకులు సోషల్ మీడియాలో తెలిపారు.
వివిధ జిల్లా ల పోరాట యోధులు మహాసభ అభివృద్ధి కాంక్షించే వారు అన్యాయం ను ఎదురించే వారు కాబోయే జిల్లా కన్వీనర్ లు ఇతర పదవులు పొందే వారు మహాసభ ప్రక్షాళన కోసం ఎన్నికల నిర్వహణ కోసం బైలా రక్షణ కోసం ఆస్తుల పరిరక్షణ కోసం అన్యాయం ను ఎదురుకొనుట కోసం అన్నిటికి అన్నివిధాలా సిద్ధంగా ఉంటే నాయకుల తొలి సమావేశం కు అందరు హాజరై జయప్రదం చేయగలరనీ ఉపేందర్ మొగుళ్లపల్లి కోరారు.
Comments
Post a Comment