"మాచన" కు సైన్టెక్ కితాబు


 "మాచన" కు సైన్టెక్ కితాబు


సాధారణంగా ఎవరైనా ఏదైనా విజయం సాధిస్తే స్థానిక మీడియా లో..తోచిన తీరులో వార్త లు, వార్తా కథనాలు రావడం సహజం.ఇక అరుదైన ఘనత ఏదైనా సాధిస్తే..జాతీయ మీడియా కూడా న్యూస్ లేదా స్టోరీ క్యారీ చేస్తుంది. సాధించిన విజయం మరికొంత మంది కి స్ఫూర్తి దాయకం కావాలని ప్రత్యక్ష/ ప్రత్యేక ఇంటర్యూ లు ప్రసారం చేస్తారు..కానీ ఓ తెలుగు వ్యక్తి గురించి ఆస్కడెక్కడో అమెరికా లో .. ఓ పత్రిక ప్రత్యేకంగా రాయడం. నిజంగా గర్వకారణమే.ఎవరైనా వైద్యులు రోగికి చికిత్స చేస్తారు.కానీ..చికిత్స కంటే నివారణ ముఖ్యం అని చాటి చెప్తూ..ఏదో..తపస్సు చేస్తున్న ఋషి మాదిరి గా.. సమాజ హితం కోసం తపన పడే ఓ అరుదైన వ్యక్తి గురించి..రాశారు, అమెరికా లో వెలువడే శాస్త్ర, విజ్ఞాన మాస పత్రిక సైన్టెక్ లో.


పొగాకు నియంత్రణ లో అసాధారణ కృషి చేస్తున్న మాచన రఘునందన్ అసామాన్యుడని,ఆ.. అంతర్జాతీయ శాస్త్ర, విజ్ఞాన పరిశోధన మాస పత్రిక సైన్టెక్నాల్ శ్లాఘించింది. గూగుల్ లో ఈ విషయాన్ని విదితం చేసింది.ప్రపంచ దేశాల వైద్యుల పరిశోధనలు ప్రచురించే పల్మనరీ మెడిసిన్ పత్రిక,పొగాకు నియంత్రణ కేన్సర్ నివారణ, క్యాన్సర్ చికిత్స కోసం చేస్తున్న పరిశోధనల ను ప్రచురిస్తోంది.ఈ కోవ లో నే..పల్మనరీ మెడిసిన్ పత్రిక ప్రచురించిన..

"మాచన రఘునందన్ ద టుబాకో కంట్రోల్ మిషన్" అనే అంశం సైన్టెక్ (scintech) ను ప్రధానంగా ఆకర్షించింది.ఒక వ్యక్తి పొగాకు నియంత్రణ కోసం ఓ ఋషి లా మారాడని,యజ్ఞం చేస్తున్నాడని ప్రస్తుతించింది.పొగాకు నియంత్రణ కు ఈ విధంగా అలుపెరుగని, నిర్విరామ కృషి చేయడం అద్వితీయం,అమోఘం అని సైన్టెక్ కొనియాడింది.ఈ విషయం తెలియాలని గూగుల్ లో నూ పొందుపరచింది.ఇలా ఓ సామాన్యుడి అసామాన్య కృషి ని గూగుల్ వేదిక గా జన బాహుళ్యానికి చేరడం..ఓ సామాన్యుడి అసామాన్య విజయం.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం