ఘనంగా టీజేయు ప్రధాన కార్యదర్శి రాజేష్ జన్మదిన వేడుకలు
ఘనంగా టీజేయు ప్రధాన కార్యదర్శి రాజేష్ జన్మదిన వేడుకలు
ఉన్నత విలువలకు ప్రాధాన్యమిస్తూ మునుముందు జర్నలిజంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి
టీజేయు అధ్యక్షుడు భూస రమేష్ యాదవ్
జనగామ : జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, ఆదేశాలతో జిల్లా అధ్యక్షుడు భూస రమేష్ యాదవ్,ఆధ్వర్యంలో టీజేయు ప్రధాన కార్యదర్శి మంచి కట్ల రాజేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాజేష్, సమాజంలో ఉన్నత విలువలకు ప్రాధాన్యం ఇస్తూ మునుముందు జర్నలిజంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ప్రధాన కార్యదర్శి మంచి కట్ల రాజేష్, మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన తన సహచర జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు మునుముందు జర్నలిస్టుల అభివృద్ధికై పాటుపడతానని మా నినాదానమే జనం కోసమే జర్నలిస్ట్ సమాజంలో జర్నలిజం తరఫున ఉన్నత సేవలు అందించుటకై నేను ఎప్పుడు ముందుంటానని అన్నారు. కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు మంగ శంకర్, ప్రధాన కార్యదర్శి సుప్రీం, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం రమేష్ యాదవ్, ఉపాధ్యక్షులు సాంబయ్య కోశాధికారి నవీన్ చారి సహాయ కార్యదర్శులు అప్రోజు అర్జున్ కుమార్, మధు, పరశురాములు, తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment