కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్‌ను పదవి నుండి టెర్మినేట్ చేసిన PCB మెంబర్ సెక్రటరీ


కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్‌ను పదవి నుండి టెర్మినేట్ చేసిన PCB మెంబర్ సెక్రటరీ

*నియకమే జీవో ప్రకారం లేదంటున్న పలువురు*


*పలు ఆరోపణలు రావడంతో తొలగింపు?*


హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ పదవి కాలం ఇంకా ఉన్నప్పటికీ  ముందుగానే పరిపాలన కారణాలతో  సుమంత్‌ను తొలగిస్తూ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ రఘు గగులోతు ప్రొసీడింగ్ Procds. No. 242/TGPCB/ Estt./2025-819 ఇచ్చారు.




కొండా సురేఖ అటవీ శాఖలో డిప్యుటేషన్లు, బదిలీలు అంతా సుమంత్ చెప్పినట్టే జరిగేవి అంటూ పలు ఆరోపణలు రావడం తో సుమంత్ ను తొలిగించినట్లు సమాచారం.


తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మంత్రి కొండా సురేఖ ఇచ్చిన నోట్  ద్వారా టెంపరరీ బేసిస్ గా సుమంత్‌ను ఒక ఏడాది కొరకు నియమించి మంత్రి పేషీ కి డిప్యూటీ చేసింది.

 మంత్రి కొండా సురేఖ ఇచ్చిన నోట్ నంబర్ మరో Note  ద్వారా మరో ఏడాది పొడిగించారు. 

ఈ పొడిగింపు డిసెంబర్ 16, 2025 వరకు ఉన్నప్పటికీ ముందుగానే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ ను చూపిస్తూ సుమంత్‌ను తొలగిస్తూ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ రఘు గగులోతు ప్రొసీడింగ్ Procds. No. 242/TGPCB/ Estt./2025-819 ఇచ్చారు.


మరీ ఈ తొలగింపు మంత్రి దృష్టి కి తెచ్చి తొలగించారా? లేక ప్రభుత్వం నుండి ఏమైనా ఆదేశాలు వచ్చాయా? మెంబర్ సెక్రటరీ స్వయంగా తొలగించారా? అనే విషయం చర్చ జరుగుతుంది. ప్రోసీడింగ్ లో నియమించినప్పుడు మరియు పొడిగించినప్పుడు మంత్రి నోట్ ద్వారా చేసినట్లు పేర్కొన్నారు కాని తొలగింపు మాత్రం మంత్రి నుండి ఎలాంటి నోట్ ను అయితే ప్రొసీడింగ్స్ లో పేర్కొనలేదు.

అయితే ఈ నియామకం జీవో ప్రకారం జరగలేదని, క్యాబినెట్ మినిష్టర్ పేషీలో ఓయస్డీ గా నియామకం జి.ఓ. 522 ప్రకారం ప్రభుత్వం రెగ్యులర్ గెజిటెడ్ ఉద్యోగిని మాత్రమే నియమిస్తారనీ, గెజిటెడ్ ఆఫీసర్ గా కనీసం ఐదేళ్లపాటు పని చేసి ఉండాలనీ జిఎడి నుండి పోస్టింగ్ ఉత్తర్వులు పొందాలనీ ఉన్నదని పలువురు చర్చించుకుంటున్నారు.

అసలు పిసిబి వారు నేరుగా మినిష్టర్ పేషికి ఉద్యోగిని పోస్టింగ్ ఇవ్వడం అనేది జి.ఓ.522 ఉల్లంఘన. ఒక వేళ ప్రభుత్వానికి నష్టం జరిగితే రెగ్యులర్ ఉద్యోగి పైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. భయంతో పనిచేస్తారు.




Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం