పాలదర్శక పాలనకు RTI act పాశుపతాస్త్రం - ఇన్చార్జి డిఆర్ఓ ,నల్గొండ ఆర్డీవో వై.అశోక్ రెడ్డి
పాలదర్శక పాలనకు సమాచార హక్కు చట్టం పాశుపతాస్త్రం అని ఇన్చార్జి డిఆర్ఓ ,నల్గొండ ఆర్డీవో వై.అశోక్ రెడ్డి అన్నారు.
ఈ నెల 5 నుండి 12 వరకు నిర్వహిస్తున్న సమాచార హక్కు చట్టం వారోత్సవాలు భాగంగా శుక్రవారం డిఆర్ఓ ఛాంబర్ లో నిర్వహించిన సమాచార హక్కు చట్టం వారోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార యంత్రాంగాలలో బాధ్యతను, పారదర్శకత్వం పెంచేందుకు సమాచార హక్కు చట్టం బాగా ఉపయోగపడుతుందని అన్నారు. పౌరులు వారికి అవసరమైన సమాచారాన్ని 30 రోజుల్లో సమాచార హక్కు చట్టం కింద పొందవచ్చు అని తెలిపారు. జిల్లాలోని అధికారులు అందరూ సమాచార చట్టం నియమ నిబంధనల ప్రకారం పౌరులు కోరిన సమాచారాన్ని ఇచ్చి పౌరులకు సహకరించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా , తహసిల్దార్లు, సమాచార హక్కు చట్టం సంస్థలు ,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment