ఈ సమాజానికి అర్బన్ నక్సల్స్ అవసరం లేదు. - న్యాలకొండ అనిల్ రావు దేశాయి
ఈ సమాజానికి అర్బన్ నక్సల్స్ అవసరం లేదు.
నాటి పరిస్థితులు వేరు నేటి పరిస్థితులు వేరు.
ఈ దశలో నాడు పేదవారికి నోరు లేని వారికి సోషలిజం మాటలతో నక్సలిజం కలగలుపుతో తమ తుపాకీ సిద్దాంతం అమలు పరిచి తొలిదశ ఉద్యమకారులు కొంత మేర సామాన్యులకు స్వాంతన చూపెట్టారు. వారిలో కొంత నమ్మకం కలిగించారు.
కాని రాను రాను ఉద్యమంలో ఉద్యమం ముసుగులో అక్కడ కూడా పందికొక్కులు చేరిపోయాయి. తుపాకీ అండన వేలాది కోట్లు వెనకేసుకున్నారు. రెండవ దశలో నక్సలిజం లో చేరిన వీరితో సామాన్యులకు ఒరిగిందేమీ లేదు.
పైగా సిద్దాంత ద్రోహులంటూ ఇన్ఫార్మర్ ల పేరిట అదే అడవి బిడ్డలను తమ స్వలాభం కోసం వారు అండగా చూపించిన తుపాకీ తోనే వేలాదిమందిని అంతమొంచి పాపం మూటగట్టుకున్నారు. అమాయకులైన అడవి బిడ్డల ఉసురు పోసుకున్నారు.
ఇక వీరికి దన్నుగా నిలిచి యువతను అడవి బాట పట్టేలా తుపాకీ చేతబట్టి నక్సలిజం ను భుజాన ఎత్తుకునేల పాటలు పాడి ( గద్దర్ , విమలక్క లాంటివారు ) కొంత మంది ఉపన్యాసాల పేరుతో ( వరవరరావు, గాదే ఇన్నయ్య లాంటి వారు ) నాట్యం డాన్సు లాంటి ఆటపాట కళాకారుల వాటితో కూడా ప్రయత్నించారు.
వీరి పాటలకు ఆటలకు ఉపన్యాసాల మూలంగా వేలాదిమంది యువత వీరి మాటలకు పాటలకు ఆకర్షితులై అడవి బాట పట్టి తుపాకీ చేత బట్టి ఉద్యమం నిర్వహించారు.
అయితే ఉద్యమం పేరిట తాత్కాలిక ఆవేశంతో అడవి బాట పట్టి తుపాకీ పట్టిన వీరెవరికి సిద్దాంతం అమలు పట్ల గాని అవగాహన గాని ఏ కోశానా లేదు.
దీంతో నక్సలిజం భావావేశం లో స్వార్థం పెచ్చుమీరి అక్కడ కూడా స్వలాభం అనే కోణంలో లోనే ఉద్యమం ( అది ఉద్యమం పేర అనుకోవడమె కాని ఉద్యమము కానే కాదు.) కొనసాగింది.
నక్సలిజం పేరు డబ్బులు వేట వ్యతిరేకంగా ఉండేవారిని అంతమొందించడం లాంటి వ్యవహారాలే ఎక్కువ అయ్యాయి. తన మన బేధం లేకుండా నక్సలిజం హత్యా కాండ కొనసాగించారు.
భారత దేశంలో నక్సలిజం ప్రారంభం తొలినాళ్ళు 1962 నుండి ఇప్పటి వరకు కనీసం అటు అనుకూల ఇటు వ్యతిరేక వర్గాల ప్రజలు 50 వేల హత్యలు జరిగాయి.
ఇందులో ఏ సిద్ధాంతానికి సంబంధం లేని అమాయక ప్రజలు దాదాపుగా 20 వేయిల పైచిలుకు ప్రాణాలు నక్సలైట్లు గాలిలో కలిపారు.
ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్న వాటిలో చాలా వరకు సత్యార్థం దాగి ఉంది. నక్సలిజం పేర అడవి బాట పట్టి తుపాకీ పట్టిన వీరు అడవిలో ఉండడంతో అక్కడ నివసించే కోయలు,గోండులు,చెంచులు ఎన్నో రకాల అడవి బిడ్డలు పట్టణీకరణ కు నోచుకోకుండా అభివృద్ధి కి నోచుకోకుండా ఇంకా అక్కడే ఉండి పోయారు.
ప్రాథమిక అవసరాలైన విద్య వైద్యం కూడా అందని పరిస్థితి. కనీసం వారి గూడెం లోకి పోవడానికి కనీసం కాలిబాటలు కూడా వేయనివ్వకుండా మావోయిస్టులు అడ్డుపడ్డారు. సెల్ ఫోన్ టవర్లు పెల్చివేసిన సంఘటనలు కోకొల్లలు.
ఇక ఇటువంటి మావో ఇజం పేర నక్సలిజం పేర సాగిన ఈ నరమేధానికి పైకి కనపడేది సిద్దాంతమైతె కనపడని శక్తులు ఈనాడు కేంద్రం చెబుతున్న ఈ అర్బన్ నక్సల్స్.
నీవు తుపాకీ పట్టు నేను దన్నుగా ఉంటాను అనే కోణంలో సాగుతున్న ఇలాంటి అర్బన్ నక్సల్స్ మేకవన్నే పులులు అన్నది నిర్వివాదాంశం.
నిజానికి యువత మెదల్లను కలుషితం చేస్తున్న ఇటువంటి అర్బన్ నక్సలిజాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.
దీనికి అనుగుణంగానే గతంలో వరవరరావును ఈరోజు గాదే ఇన్నయ్యను అరెస్టు చేయడం ఒకరకంగా స్వాగతించాల్సిన విషయమే.
న్యాలకొండ అనిల్ రావు దేశాయి
సామాజిక పరిశోధకులు
9542226669

Comments
Post a Comment