పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !


పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !


పిల్లల  పిల్లల అక్రమ రవాణా కేసులో బెంగాల్ పోలీసులు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలిని అరెస్టు చేశారు. భారతీయ మహిళా మోర్చా బెంగాల్ ప్రధాన కార్యదర్శి జూహీ చౌదరి ని భారత్ నేపాల్ బార్డర్ లో సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. పిల్లల అక్రమ రవాణా కేసులో ఆమె పేరు రావడంతో ఆమె అఙాతంలోకి వెళ్ళింది. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమెను గుర్త్ంచి అరెస్టు చేసిన పోలీసులు జల్పాయ్ గురి జిల్లా కోర్టులో హాజరు పర్చారు.  విమల శిశు గ్రుహ అనే ఎన్ జీ ఓ నడుపుతూ దాని ముసుగులో పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆ సంస్థ చైర్మెన్ చందనా చక్రవర్తి, సంస్థ అధికారి సోనాలీ మండల్, చందన సోదరుడు మానసా బౌమిక్ లను పోలీసులు పోయిన వారం అరెస్టు చేశారు. వీళ్ళు 17 మంది పిల్లలను అక్రమంగా అమ్మేశారని పోలీసుల ఆరోపణ.  అయితే తమకు బీజేపీ నాయకురాలు జూహీ చౌదరీ అన్ని విధాలా సహకరించారని, ఆమె సహాయంతో బిజెపి నాయకులు కైలాష్ విజయవర్గియా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు రూప గంగూలీతో కూడా మాట్లాడామని ఆ సంస్థ చైర్మెన్ చందనా చక్రవర్తి చెప్పడంతో పోలీసులు జూహీ చౌదరిని అరెస్టు చేశారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన