తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలను 2 నెలలో నిర్వహించాలని న్యాయవాది పి. గోపి మానవేంద్రనాథ్ ను నియమించిన కోర్టు
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలను 2 నెలలో నిర్వహించాలని న్యాయవాది పి. గోపి మానవేంద్రనాథ్ ను నియమించిన కోర్టు
గూఢచారి, హైదరాబాద్, 29 జనవరి: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల పై ఆగీర్ వెంకటేశం వేసిన కేసుకు కోర్టు పిటిషనర్ యొక్క ప్రస్తుత పిటిషన్ ను ఈ రోజు కోర్టు అనుమతిస్తు, 24-02-2025న మెమో నెం.6395/Regn.II/2025 ద్వారా తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్నికల అధికారి స్థానంలో న్యాయవాది పి. గోపి మానవేంద్రనాథ్ ను నియమిస్త ఉత్తర్వులు జారీ చేసినది. ఈ తేదీ నుండి రెండు నెలల వ్యవధిలో ప్రతివాది నెం.1 సొసైటీ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ యొక్క బై-లాస్ ప్రకారం ఎన్నికలను నిర్వహించడానికి మరియు ఓట్లను లెక్కించి, తదనుగుణంగా తగిన భద్రతతో ఫలితాలను ప్రకటించి, కోర్టు ముందు సమ్మతి నివేదికను దాఖలు చేయాలని ఆర్డర్ ఇచ్చింది. అడ్వకేట్ కమిషనర్ ఫీజు రూ.10,000/- గా నిర్ణయించబడిందనీ మరియు పిటిషనర్ అడ్వకేట్ కమిషనర్ ఫీజును అడ్వకేట్ కమిషనర్‌కు చెల్లించి, ఈ ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుండి (7) రోజులలోపు కోర్టు ముందు మెమోతో పాటు రసీదును దాఖలు చేయాలని ఆ ఆర్డర్ లో తెలిపింది.

Comments
Post a Comment