నల్లగొండ కార్పొరేషన్ మొదటి మేయర్ పీఠం తమ పార్టీకే-బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్


నల్లగొండ కార్పొరేషన్ మొదటి మేయర్ పీఠం తమ పార్టీకే-బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్



నల్గొండ: 

బీజేపీ రాజ్యసభ సభ్యుడు *డాక్టర్ కే లక్ష్మణ్* నల్లగొండ జిల్లా బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పాయింట్స్...


రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజల్లో మార్పు కోరుకునే భావన స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే.లక్ష్మణ్ అన్నారు...


గతంలో టీఆర్‌ఎస్ అవినీతి, కుటుంబ పాలనతో ప్రజలు విసిగి మార్పు కోసం కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని, అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్యానించారు...


కాంగ్రెస్ గ్యారెంటీలు, హామీలు అమలు కావడం లేదని, యువత, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు మోసపోయిన భావనలో ఉన్నారని తెలిపారు...


పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి 35 శాతం ఓట్లు ఇచ్చి 8 మంది ఎంపీలను గెలిపించడం ద్వారా స్పష్టమైన సంకేతం ఇచ్చారని అన్నారు...


నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, పేదల సంక్షేమ పథకాలు ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజలకు చేరుతున్నాయని చెప్పారు...


రాబోయే *మున్సిపల్ & కార్పొరేషన్* ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో నేరుగా నిధులు కార్పొరేషన్లకు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు...


కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్లు, స్మార్ట్ సిటీ, అమృత్, గృహ నిర్మాణం, డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి పథకాలకు వేగంగా నిధులు వస్తాయని వెల్లడించారు...


తెలంగాణ భవిష్యత్తు బీజేపీతోనే సురక్షితమని, పట్టణాభివృద్ధికి కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో బలమైన పాలన అందిస్తామని డాక్టర్ కే.లక్ష్మణ్ స్పష్టం చేశారు...


మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తే ప్రజల ఆశలు నెరవేరుస్తామని పిలుపునిచ్చారు...


నల్లగొండ కార్పొరేషన్ 48 స్థానాల్లో తమ అభ్యర్థులను ఖరారు చేశామని..  నల్లగొండ కార్పొరేషన్ మొదటి మేయర్ పీఠం తమ పార్టీకే లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు...



Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం