తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఓటర్ల లిస్టు పై అభ్యంతరాల స్వీకరణకు పబ్లిక్ నోటీస్ ప్రకటించిన అడ్వకేట్ కమిషనర్ పి. బాల గోపేంద్రనాథ్
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఓటర్ల లిస్టు పై అభ్యంతరాల స్వీకరణకు పబ్లిక్ నోటీస్ ప్రకటించిన అడ్వకేట్ కమిషనర్ పి. బాల గోపేంద్రనాథ్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ కార్యాలయానికి ఎన్నికలు నిర్వహించడానికి తనను కమిషనర్‌గా నియమింప బడినట్లు పి. బాల గోపేంద్రనాథ్ (అడ్వకేట్ కమిషనర్) పబ్లిక్ నోటీస్ ను దిన పత్రికలో ప్రకటించారు. ఖైరతాబాద్ లోని చింతల్‌బస్తీ నంబర్ 6-2-648లో రిజిస్టర్డ్ కార్యాలయం ఉంది. దీనిని సాధారణంగా "వైశ్య భవన్" అని పిలుస్తారని , ప్రస్తుత ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఈ నోటీసు ప్రచురించబడిన తేదీ నుండి మూడు రోజుల్లోపు అంటే 03-03-2026 నుండి 05-03-2026 వరకు నాకు లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చునని, తాను స్వయంగా ఈ మూడు రోజులు అంటే మంగళవారం, బుధవారం, గురువారం మధ్యాహ్నం 1-00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు హైదరాబాద్‌లోని వైశ్య భవన్ చింతల్‌బస్తీలో అందుబాటులో ఉంటాననీ, ఆ తర్వాత వచ్చే అభ్యంతరాలను స్వీకరించరని పబ్లిక్ నోటీస్ లో పేర్కొన్నారు. ఓటర్ల లిస్టులో పేర్లు కోల్పోయినవారికి ఇది మంచి అవకాశము. తమ హక్కును నిరంకుశ ధోరణిలో తొలిగిపబడ్డ వారు వారి అభ్యంతరాలు సమర...