Posts

Showing posts from March, 2026

ప్రాక్టికల్ ఫీల్డ్ ఎక్స్పోజర్లో భాగంగా పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థుల TGPCB సనత్నగర్ సందర్శన

Image
  ప్రాక్టికల్ ఫీల్డ్ ఎక్స్పోజర్లో భాగంగా పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థుల TGPCB సనత్నగర్ సందర్శన హైద్రాబాద్:  నాగర్కర్నూల్ జిల్లా పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థులు తమ పర్యావరణ శాస్త్రం మరియు విపత్తు నిర్వహణ) కోర్సు ప్రాక్టికల్ ఫీల్డ్ ఎక్స్పోజర్లో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సనత్నగర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా  పి. శరత్, పర్యావరణ శాస్త్రవేత్త, విద్యార్థులతో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ప్లాస్టిక్ కాలుష్యం, బయోమెడికల్ వ్యర్థాల కాలుష్యం, మురుగునీటి శుద్ధి విధానాలు వంటి వివిధ కాలుష్య రకాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అలాగే పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు విధించే జరిమానాలు మరియు శిక్షలు గురించి వివరించి, పరిశ్రమలు మరియు సంస్థలు పర్యావరణ ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. ప్రాక్టికల్ ఎక్స్పోజర్లో భాగంగా విద్యార్థులను TGPCB ప్రయోగశాల సౌకర్యాలను చూపించి, వాయు మరియు నీటి కాలుష్య స్థాయులను కొలిచే పరికరాలు, శాస్త్రీయ పద్ధతులు గురించి వివరించారు. ఈ సందర్శన ద్వారా విద్యార్థులకు కాలుష్య పర్యవేక్షణ వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ పద్ధతులు, పర్యావరణ పర...

Nirmal District SI ACB trap

Image
  Nirmal District SI ACB trap  నిర్మల్: నిర్మ ల్ జిల్లా మామడలో నిశ్శబ్దంగా సాగుతు న్న ఒక అవినీతి కథకు ఈరోజు థ్రిల్లింగ్ క్లైమాక్స్ కు చేరింది. ప్రజలకు రక్షణ గా నిలవాల్సిన ఒక పో లీస్ అధికారి అదే అధికారాన్ని ఆ యుధంగా మార్చుకుని లంచాల వల వేస్తూ చివరకు రెడ్ హ్యాండెడ్‌ గా చిక్కడంతో కథ కంచికి చేరింది. ఇప్పటివరకు గుట్టుగా నడిచిన ఈ వ్యవహారం ఒక్కసారిగా బహిర్గతమై, ప్రజల్లో షాక్‌తో పాటు ఆగ్రహా న్ని రేపుతోంది. “రక్షకుడే భక్షకు డైతే ఎలా అన్న ప్రశ్న ఇప్పుడు అందరి నోట వినిపిస్తోంది. ఏసీబీ దాడుల పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.. నిర్మల్ జి ల్లా మామడ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తు న్న తీగల అశోక్ ఒక భూ వివాదం కేసులో ఫిర్యాదుదా రు కు సహాయం చేస్తానని చెప్పి, “మోసం కేసు నమోదు చేయ కుండా చూస్తాను” అంటూ రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అ ధికారులకు తెలియజేయడంతో వారు జాగ్రత్తగా పన్నిన ఉచ్చులో అశో క్ చిక్కుకున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో అశోక్ లంచం స్వీకరి స్తుండగానే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకు న్నారు. అతని వద్ద నుంచి రూ. 20 వేల నగదు స్వాధీనం చేసుకున్న...

ఏసీబీ నెట్‌లో టీజీఎస్‌పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్

Image
 టీజీఎస్‌పీడీసీఎల్, మసబ్ ట్యాంక్ సెక్షన్, హైదరాబాద్‌కు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ (ఆపరేషన్స్) ఏసీబీ నెట్‌లో ఉన్నారు. 24.02.2026న, హైదరాబాద్, TGSPDCL, మసబ్ ట్యాంక్ సెక్షన్, ఆపరేషన్స్ అసిస్టెంట్ ఇంజనీర్ (AO)  మామిడిశెట్టి శ్రీనివాసరావు, ఫిర్యాదిదారుడికి చెందిన స్వాధీనం చేసుకున్న విద్యుత్ మీటరుపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఉండేందుకు అధికారికంగా సహాయం చేస్తానని చెప్పి, తన కార్యాలయంలో ఫిర్యాదిదారుడి నుండి రూ. 16,000/- లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా సిటీ రేంజ్-II యూనిట్ ACBకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అతని సూచన మేరకు ఏఓ స్వాధీనంలో ఉన్న రూ. 16,000/- కలుషితమైన లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.  అందువల్ల, ఏఓను అరెస్టు చేసి, జ్యుడిషియల్ రిమాండ్ కోసం నాంపల్లిలోని ఎస్పీఈ & ఏసీబీ కేసుల గౌరవనీయ మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరచడం జరుగుతోంది. కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుని వివరాలు గోప్యంగా ఉంచబడ్డాయి.

No.1 CLIA ఆయన సందర్భంగా కౌటికె విఠల్ బహిరంగ లేఖ

Image
  No.1 CLIA ఆయన సందర్భంగా కౌటికె విఠల్  బహిరంగ లేఖ చదవండి ఆయన మాటల్లో *ఈ గర్వకారణమైన, స్మరణీయమైన సందర్భంగా* *నా గౌరవనీయ పాలసీదారులు, శ్రేయోభిలాషులు, ప్రియ మిత్రులు మరియు నా సహచర ఏజెంట్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.* *ఈ విజయాన్ని నేను ఒంటరిగా సాధించలేదు—* *మీ అచంచల విశ్వాసం, నిరంతర ప్రోత్సాహం,మనం కలసి నిర్మించిన ఆత్మీయ బంధం ఈ స్థాయికి నన్ను చేర్చాయి.* *మీరు నాపై ఉంచిన నమ్మకం నా ప్రతి అడుగుకి దారిదీపంగా, నా ప్రతి విజయానికి మూలాధారంగా నిలిచింది.* *క్రమశిక్షణ(Discipline)* *దృఢ సంకల్పం (Determination)* *గౌరవం (Dignity)* *సమర్పణ (Delivery)* *ఈ నాలుగు విలువలు నా జీవన తత్వానికి ఆధారం.* *ఇవే నన్ను నేడు మీ ముందున్న స్థాయికి తీసుకువచ్చిన శక్తి.* *మీ ఆశీస్సులు, ఆదరణ, సహకారం ఇదే విధంగా కొనసాగాలని వినమ్రంగా కోరుకుంటూ, ఇంకా ఉన్నత* *శిఖరాలను అధిరోహించేందుకు మరింత నిబద్ధతతో, విశ్వసనీయతతో, అత్యుత్తమ సేవలతో ముందుకు సాగుతాను.* *ఎల్లప్పుడూ మీ సేవలో,* *కృతజ్ఞతాభివందనాలతో 🙏* *కౌటికె విఠల్* *చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్* *📞 98490 23530* *📞 70988 99999*

పరుగెత్తి..పట్టుకుని హోటళ్ల లో డొమెస్టిక్ సిలిండర్ ల స్వాధీనం

Image
 పరుగెత్తి..పట్టుకుని  హోటళ్ల లో డొమెస్టిక్ సిలిండర్ ల స్వాధీనం పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ  మాచన రఘునందన్  నల్గొండ:  డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ల ను హోటళ్ల లో వాడితే చట్ట పరంగా శిక్షించడం తధ్యం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు.బుధవారం నాడు నల్గొండ పట్టణం లో పలు హోటళ్ల లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..ఇళ్లలో వాడాల్సిన సిలిండర్లను హోటల్లో వాడటం నేరం అని స్పష్టం చేశారు.నల్గొండ లోని పలు ప్రాంతాల్లో వాణిజ్య అవసరాలకు వాడుతున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నట్లు రఘునందన్ వివరించారు.ఇకనైనా హోటళ్ల లో డొమెస్టిక్ సిలిండర్ ల ను వాడటం కు స్వస్తి పలకాలని రఘునందన్ సూచించారు.హోటళ్ల వారు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ల ను మాత్రమే వాడాలన్నారు.

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

Image
  అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి  అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం  * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ * ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం * వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తాం * శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం విజయవంతం  * వాసవీ పారాయణానికి గిన్నీస్ రికార్డు  హైదరాబాద్: వాసవీ కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ, జయంతి దినోత్సవాలను అధికారికంగా నిర్వహించే విషయంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోగానే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్య వైశ్య సామాజిక వర్గానికి తమ ప్రభుత్వంలో సముచిత గౌరవం ఉంటుందని ఆయన తెలిపారు. వైశ్యులు ఊరికొక్కరు ఉన్నా ఊరందరూ వారితో ఉంటారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వారి సహకారంతోనే రైతులు వ్యవసాయం చేసుకుంటారు న్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వారు వెన్నెముకగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్ర నిర్మాణంలో వైశ్యులది ముఖ్య పాత్ర అని కొనియాడారు.  రాజకీయంగా గుర్తింపు దక్కినా, దక్కకున్నా క్రమ శిక్షణ తప్పకుండా తమ పాత్ర పోషిస్త...

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్

Image
  తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి  * ఏపీ మంత్రి టీజీ భరత్  హైదరాబాద్: తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరుతానని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు.  2014 నుంచి తెలంగాణలో వైశ్యులకు మంత్రి పదవి దక్కలేదని గుర్తు చేశారు. జనాభా లో దాదాపు 5 శాతం ఉన్న ఆర్య వైశ్యులకు తగిన ప్రాతినిధ్యం దక్కాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  వైశ్యులు ఐకమత్యంతో ఉండి శక్తి చాటితేనే గౌరవం దక్కుతుందన్నారు. క్షేత్ర స్థాయి వాస్తవాలు తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్యులకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందన్నారు. అందరు వైశ్యులు కూడా పేరు చివరన గుప్త అని పెట్టుకోవాలని సూచించారు. ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ఆదుకునేది ఆర్య వైశ్యులేనన్నారు.  అందరూ గోసేవ కూడా చేయాలని  ఆయన పిలుపునిచ్చారు. గోసేవ చేసిన ఫలితం గానే తాను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానని చెప్పారు. వాసవీ పారాయణ మహోత్సవాన్ని తలపెట్టిన కల్వ సుజాత గుప్తను ఆయన అభినందించారు.

పేదింటి ఆడపిల్ల పెళ్లి కి పూస్తే మట్టెలు అందజేసిన ఉప్పల

Image
 *పేదింటి ఆడపిల్ల పెళ్లి కి పూస్తే మట్టెలు అందజేసిన ఉప్పల* Hyderabad, Gudachari:  నాగోల్ లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల్ శ్రీనివాస్ గుప్త బీసీ ( చారి) కుటుంబానికి చెందిన జవహర్ నగర్ నివాసి ప్రమీల అనే దివ్యాంగురాలు వారి కుమార్తె జ్యోతి & వెంకట్ పెళ్లికి దంపతులకు పూస్తే మట్టెలు చీర అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ ఉప్పల ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం అని దానిలో భాగంగానే పేదింటి ఆడపిల్ల వివాహానికి అండగా నిలవాలని ఎంతో మందికి పూస్తే మట్టెలు చీర అందజేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు. ఈ సందర్భగా వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివ కృష్ణ గారు మాట్లాడుతూ ఎంతోమంది దివ్యాంగులకు పేదవాళ్లకు అండగా నిలుస్తున్న ఉప్పల అందరికీ ఆదర్శం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న , IVF నాయకులు పబ్బా చంద్రశేఖర్ గుప్త , కటకం శ్రీనివాస్ గుప్త, Raghu Gangishett...

మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్లాలి-మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి.

Image
  మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్లాలి-మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి.                 ఘనంగా ఐవిఎఫ్ మహిళా దినోత్సవం.                          ప్రజా ప్రతినిధులకు సన్మానం  నల్లగొండ మార్చి 21, గూఢచారి :                  మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్లాలని పురుషులతో సమానంగా ఎదగాలని నల్లగొండ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం స్థానికంగా జరిగిన ఐవీఎఫ్ మహిళా దినోత్సవం ప్రజాప్రతినిధులకు సన్మాన ఉత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వ్యాపార పరంగా ఎదగాలన్నారు. మహిళలకు ఓర్పు సహనం ఎక్కువ అని కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకువస్తుందన్నారు. మహిళలు నేడు అన్ని రంగాలలో రాణిస్తున్నారని మహిళలను గౌరవించడం వారిని సన్మానించడం మంచి సంప్రదాయమన్నారు. మహిళలు లేని సమాజం లేదని మహిళలు గౌరవించినచోట శుభాలు క...

వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ గా మేడా నరేష్

Image
  వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ గా మేడా నరేష్ హైద్రాబాద్: వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ యొక్క గ్లోబల్ ప్రెసిడెంట్ 2026-2028) గా ఉదయం 10:00 లకు లక్ష్మీ కన్వెన్షన్, ఖర్మాన్‌ఘాట్, హైదరాబాద్ లో మేడా నరేష్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ అధికారిక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ఈ రోజు స్త్రీత్వ స్ఫూర్తిని గౌరవించడానికి కూడా అంకితం చేయబడిందనీ మేడా నరేష్ తెలిపారు. ఈ నాయకత్వ మార్పునకు మరియు సాధికారతను మనం అందరం సమిష్టిగా జరుపుకుంటున్న ఈ వేడుకకు మీ రాక ఎంతో శోభను చేకూరుస్తుందని తెలిపారు.

అంగ‌రంగ వైభ‌వంగా శ్రీ వాస‌వీ మ‌హాశ‌క్తి మ‌హోత్స‌వం

Image
 అంగ‌రంగ వైభ‌వంగా శ్రీ వాస‌వీ మ‌హాశ‌క్తి మ‌హోత్స‌వం  * 22న హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హ‌ణ‌  * ప్ర‌పంచ రికార్డు సృష్టించ‌నున్న ఘ‌ట్టం * స్వ‌చ్ఛందంగా త‌ర‌లి వ‌స్తున్న ఆర్య‌వైశ్యులు  * విజ‌య‌వంతం చేయాల‌ని కల్వ సుజాత గుప్త పిలుపు  హైద‌రాబాద్‌:  హైద‌రాబాద్‌ ఎల్ బీ స్టేడియం మ‌రో అద్భుత చారిత్ర‌క ఘ‌ట్టానికి వేదిక కాబోతోంది.  ఈ నెల 22న ఆదివారం ఆర్య‌వైశ్య వెల్ఫేర్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్టు సౌజ‌న్యంతో తెలంగాణ ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో శ్రీ వాస‌వీ మ‌హాశ‌క్తి మ‌హోత్స‌వం అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది.  దాదాపు 30 వేల మంది వైశ్యులు ప్ర‌ముఖ క‌వి చింత‌ల శ్రీ‌నివాస్ రచించిన 102 చ‌ర‌ణాల‌తో కూడిన వాస‌వీ పారాయ‌ణాన్ని సామూహికంగా ఆల‌పించ‌నున్నారు. ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన ఇన్ని వేల మంది ఒకే స్వ‌రంతో పారాయ‌ణం చేయ‌డం ప్ర‌పంచ‌రికార్డు కానుంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు.  ఈ ఘ‌న‌త‌ను రికార్డు చేయ‌డానికి గిన్నీస్ ప్ర‌తినిధులు వ‌స్తున్నార‌ని పేర్కొన్నారు.  ఆధ్యాత్మిక , సేవా కార్యక్ర‌మాల్లో ముందుండే ఆర్య‌వైశ్యులంద‌రినీ ఒక్క‌తాటిపైకి తేవ‌డ‌మే ఈ కార...

ఐ వి ఎఫ్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

Image
 ఐ వి ఎఫ్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నల్గొండ:   ఐ వి ఎఫ్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 21-03-2026 శనివారం రోజు ఉదయం 10.30 లకు నల్గొండ క్లాక్ టవర్ సమీపంలోని డైన్ ఇన్ హోటల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మరియు నల్గొండ జిల్లాలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన ఆర్యవైశ్య ప్రజా ప్రతినిధుల తో పాటు నల్గొండ పట్టణ ప్రముఖులు అనగా మేయర్ డిప్యూటీ మేయర్ తదితరులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మహిళలకు తంబోలా ఇతర ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇవ్వబడును ఎర్లీ బర్డ్ బహుమతి ప్రధానం కూడా చేస్తారు.  అనంతరం భోజన సౌకర్యం ఏర్పాటు చేయబడినదనీ, భోజన విరామం తర్వాత ప్రజా ప్రతినిధులకు సన్మానం, చివరిగా ఐ వి ఎఫ్ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసామని నిర్వాహకులు తెలిపారు.   ఐ వి ఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రేపాల భద్రాద్రి రాములు మహిళ విభాగ్ అధ్యక్షురాలు కొమిరిశెట్టి రమ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ఐపీఎఫ్ తెలంగాణ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పబ్బా చంద్రశేఖర్ గుప్తా, మహిళా న...

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు రసవత్తరం

Image
ఎవరి ధీమా వారధి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు రసవత్తరం *ముందంజ లో శ్యామ్ సుందర్*   *అపవాదు ముటగట్టు కున్న అమరవాది.* హైద్రాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తరువాత తెలంగాణ మహాసభ కు మొదటి సారి ఎన్నికల పోలింగ్ మంగళవారం లక్డికపూల్ వాసవి సేవ కేంద్రమంలో జరగనుంది.  మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మిడిదొడ్డి శ్యామ్ సుందర్, రంగారెడ్డి జిల్లాకి చెందిన అమరవాది లక్ష్మీనారాయణ, కరీంనగర్ కు చెందిన బుస్సా శ్రీనివాస్ లు ఈ ఎన్నికల్లో పోటీపడు తున్నారు. అయితే ఉపసంహరణ అనంతరం బుస్సా శ్రీనివాస్ విరమించుకున్నట్లు సోషల్ మీడియాలో ఆయన ప్రకటించారు.  గత 12 ఏండ్ల నుండి ఎన్నికలు అమరవాది జరపలేదని అక్రమంగా ఉన్నాడని, శ్యాంసుందర్ వర్గం కోర్టుకు పోయి అమరవాది అక్రమాలను ప్రశ్నించడం తో కోర్టు అడ్వకేటు కమీషనర్ చే ఎన్నికలు కొనసాగించడానికి ఆర్డర్ ఇచ్చింది.  గత సంవత్సరం ఎన్నికలు ప్రకటించిన అమరవాది బైలా కు విరుద్ధంగా నోటిఫికేషన్ ఇవ్వడం, అక్రమంగా శ్యాంసుందర్ నామినేషన్ ను తిరస్కరించడం తో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అమరవాదిని ముద్దాయిగా ఆర్యవైశ్య...

దుండిగల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సస్పెన్షన్

Image
 BREAKING: దుండిగల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సస్పెన్షన్  కుత్బుల్లాపూర్ జోన్ దుంగిడల్ సర్కిల్లో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ (TPS) సంజనను అవినీతి ఆరోపణలతో సస్పెండ్ చేశారు. జోనల్ కమిషనర్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 19న ACB అధికారులు దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనధికారిక నగదు లావాదేవీలు ఆమె భర్తకు చెందిన సంస్థకు మళ్లించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో భాగంగా చర్యలు తీసుకున్నారు.

మిడిదొడ్డి శ్యాంసుందర్ని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం - తేడ్ల జవహర్ బాబు, నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడు

Image
 జై వాసవి జై జై వాసవి  మిడిదొడ్డి శ్యాంసుందర్ని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం - తేడ్ల జవహర్ బాబు, నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడి బహిరంగ ప్రకటన చదవండి.  తెలంగాణ రాష్ట్ర మహాసభ కౌన్సిల్ మెంబర్ లందరికీ నమస్కారం, ఈనెల 17వ తారీఖున రాష్ట్ర మహాసభ ఎన్నికలలో ఓటు వేసేటప్పుడు కింది విషయాలను గమనించి ఓటు వేయగలరని మనవి,  *తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నాయకత్వ మార్పు కోసం పోరాటం చేస్తున్న మిడిదొడ్డి శ్యాంసుందర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం, ఏ మంచి పని అయినా మారుపుతోనే సాధ్యం.*   ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో అమరవాది లక్ష్మీనారాయణ గారు నైతికంగా ఓడిపోయారు.  అమరవాది లక్ష్మీనారాయణ గత 13 సంవత్సరాలుగా రాష్ట్ర మహాసభ అధ్యక్షుడిగా కొనసాగారు, మళ్లీ అతనికి అధ్యక్ష పదవి కట్టబెడదామా??  తెలంగాణ రాష్ట్రంలో అమరవాది లక్ష్మీనారాయణ గారు తప్ప వైశ్య కులంలో ఎవరు తెలివిగల వాళ్ళు, సమర్ధులు, నాయకత్వ లక్షణం గల వాళ్ళు లేరు అనుకోని ఎప్పటికీ తానే శాశ్వతంగా నియంత మాదిరిగా అధ్యక్షుడిగా ఉండాలనుకుంటారు, అతనిని సమర్థిద్దామా??  రాష్ట్రంలో ఆర్యవైశ్య...

సూర్యాపేటలో మిరుదొడ్డి శ్యామ్ కి బ్రహ్మరథం

Image
 *ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అద్యక్షులు గా మిరుదొడ్డి శ్యామ్ సుందర్ ని అత్యదిక మెజారిటీతో గెలిపించాలి* *మీలా వంశి ఆద్వర్యంలో జరిగిన సమావేశంలో మద్దతు పలికిన రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు* సూర్యాపేట పట్టణం లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు శుక్రవారం సాయంత్రం ఆర్యవైశ్య యువజన సంఘం మాజీ అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మీలా వంశీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ అద్యక్షులుగా పోటి చేస్తున్న మిరుదొడ్డి శ్యామ్ సుందర్ కు మద్దతుగా జరిగిన సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బచ్చు రామకృష్ణ మాట్లాడుతూ అమరావది లక్ష్మి నారాయణ గత 12 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేకుండా తానే చైర్మన్ గా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతిస్తున్నారని అన్నారు. రాష్ట్ర మహాసభకు ఎన్నికలు నిర్వహించాలని మిరుదొడ్డి శ్యామ్ సుందర్ పోరాటం చేసి ఎన్నికలు తీసుకుని రావడం జరిగిందని అన్నారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందరూమిరుదొడ్డి శ్యాంసుందర్ కు అత్యదికంగా ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శ్యామ్ సుందర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్యవైశ్య భవన్ నిర్మాణం చేయడంతో పాటు, కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు...

ఆర్యవైశ్యుల శక్తి అపారం - మంత్రి వాకిటి శ్రీహరి

Image
  ఆర్యవైశ్యుల శక్తి అపారం - మంత్రి వాకిటి శ్రీహరి * జయాపజయాలను ప్రభావితం చేయగలరు * వాసవీ పారాయణం ప్రపంచ రికార్డు సృష్టించాలి హైదరాబాద్:  ఆర్యవైశ్యుల శక్తి అపారం..వారు తలచుకుంటే రాజకీయాలను , జయాపజయాలను ప్రభావితం చేయగలరని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. వారు రాజకీయాల్లో ఎదగాలన్నారు.ప్రపంచ రికార్డు సృష్టించే స్థాయిలో ఆర్యవైశ్యులు వాసవి మాత పారాయణం చేయ తలపెట్టడం హర్షణీయమని అన్నారు. ఎల్బీ స్టేడియం దద్దరిల్లేలా నలభై వేల మందితో... భవిష్యత్తులో ఎవరూ చేయలేని విధంగా వాసవీమాత పారాయణం చేయాలన్నారు. ఆ రికార్డు కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని తెలిపారు  శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం పేరిట ఈనెల 22న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సామూహిక పారాయణానికి సంబంధించి  గురువారం బంజారా హిల్స్ పార్క్ హోటల్ కర్టెన్ రెయిజర్ కార్యక్రమం జరిగింది.‌ తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.‌ ఆయన మాట్లాడుతూ కల్వ సుజాత సంకల్పాన్ని కొనియాడారు. . శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం విజయవంతం కావాలని ఐ అండ్ పీ ఆర...

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవిపోటీలో ముగ్గురు అభ్యర్థులు

Image
 *రాష్ట్ర మహాసభ అధ్యక్ష పదవిపోటీలో ముగ్గురు అభ్యర్థులు.* గూఢచారి, హైదరాబాద్ మార్చి 12: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో ఉపసంహరణల అనంతరం ముగ్గురు అభ్యర్థులు పోటీలో వున్నారు.* *1.అమరవాది లక్ష్మీనారాయణ.* *2. బుస్స శ్రీనివాస్.* *3.మిడిదొడ్డి శ్యామ్ సుందర్ లు పోటీలో వున్నారు.* *ఈనెల మార్చి 17 మంగళవారం రోజున ఎన్నికలు నిర్వహించబడతాయి. మొత్తం 1109 మంది ఓటర్లు వున్నారు.*

2026-2028 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహా సభ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులు

Image
 2026-2028 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహా సభ స్క్రూటినీ తరువాత అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్థుల వివరాలు తేదీ: 11-03-2026 1. అమరవాది లక్ష్మీ నారాయణ 2. ఎ.వి. మల్లికార్జున్ 3. బస్సు శ్రీనివాస్ 4. DOSAPATI VENKATESHWARA RAO 5. ఎరుకుళ్ల రామకృష్ణ 6. కోలేటి రమేష్ 7. కొండేల్ మోడల్ బేర్ 8. KOTHA SRINIVASULU GUPTA 9. ఎల్.వి. కుమార్ 10. మిద్దొద్ది శ్యామ్ సుందర్ 11. NETHI RAMULU 12. పార్సీ ప్రకాష్ గుప్తా 13. రేణికుంట్ల గణేష్ గుప్తా 14. THATIPALLY RAJANNA 15. వంగేటి అశోక్ _ అడ్వకేట్ కమీషనర్

నామినేషన్ దాఖలు చేసిన మిడిదొడ్డి శ్యామ్ సుందర్

Image
 హైదరాబాదులోని చింతల బస్తి మహాసభ కార్యాలయంలో బుధవారం వివిధ జిల్లాల నాయకులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నిక ల నామినేషన్ దాఖలు చేసిన మిడిదొడ్డి శ్యామ్ సుందర్ 

శ్రీ వాసవి సామూహిక పారాయణ ఉత్సవానికి సంబంధించి కర్టెన్ రైజర్ ప్రోగ్రాంకు మంత్రులను ఆహ్వానించిన కార్పొరేషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త

Image
శ్రీ వాసవి సామూహిక పారాయణ ఉత్సవానికి సంబంధించి  కర్టెన్ రైజర్ ప్రోగ్రాంకు మంత్రులను ఆహ్వానించిన కార్పొరేషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త హైదరాబాద్:   తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త ఆధ్వర్యంలో ఈనెల 22న జరగనున్న శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవం-సామూహిక పారాయణ ఉత్సవానికి సంబంధించి రేపు  గురువారం సాయంత్రం 6 గంటలకు బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరగనున్న కర్టెన్ రైజర్ ప్రోగ్రాంకు మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్క లను ఆహ్వానిస్తున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కల్వ సుజాత, బెల్ది శ్రీధర్ లు.   కొణిజేటి శివ సుబ్బారావు (కీ.శే. శ్రీ రోశయ్య గారి తనయుడు) కి ఆహ్వాన పత్రిక ను అందచేశారు. 

18,000/- #లంచం

Image
 కూకట్‌పల్లి జోన్, మూసాపేట్ సర్కిల్-53 కమ్యూనిటీ ఆర్గనైజర్ కె. మురళి, ఒక మహిళా పొదుపు సంఘానికి మంజూరైన రూ. 20 లక్షల రుణాన్ని ప్రాసెస్ చేసినందుకు గాను, ప్రతి లక్షకు వెయ్యి రూపాయల చొప్పున మొత్తం రూ. 18,000/- #లంచం డిమాండ్ చేశారు.  బాధితుడి నుండి కె. మురళి ఈ మొత్తాన్ని స్వీకరిస్తుండగా తెలంగాణ #అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు పట్టుకున్నారు.

*తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్ష (2026-28) ఎన్నికల షెడ్యూలు విడుదల*

Image
*తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్ష (2026-28) ఎన్నికల షెడ్యూలు విడుదల* *తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్ష (2026-28) ఎన్నికల షెడ్యూలు ఈ రోజు అడ్వకేట్ కమీషనర్ పి. బాలగోపేంద్రనాథ్ విడుదల చేశారు.  అడ్వకేట్ కమీషనర్ పి. బాలగోపేంద్రనాథ్ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ లో 2026-2028 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహా సభ అధ్యక్షుడి ఎన్నికల (రిజిస్టర్ నం. 363/2015) ఎన్నికల షెడ్యూల్ క్రింది విధంగా ఉంది. 11-03-2026 ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 03.00 గంటల వరకు నామినేషన్ జారీ & స్వీకరణ. సాయంత్రం 04.00 గంటలకు పరిశీలన, సాయంత్రం 05.00 గంటలకు పోటీ అభ్యర్థుల జాబితా ప్రకటన. 12-03-2026 ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 04.00 గంటల వరకు ఉపసంహరణలు, తుది పోటీ అభ్యర్థుల జాబితా ప్రకటన. పైన పేర్కొన్న ప్రక్రియ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోని చింతల్‌బస్తీలోని వైశ్య భవన్‌లో జరుగుతుందనీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.   17-03-2026 ఉదయం 09.00 గంటల నుండి సాయంత్రం 05.00 గంటల వరకు పోలింగ్, సాయంత్రం 06.00 గంటలకు లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన. ఈ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ :Vasavi Kalyana Mandapam...

హిమాయత్‌సాగర్ పరిసరాల్లో అక్రమ మైనింగ్ – ‘మరో KGF’లా ప్రకృతి వనరుల దోపిడీ: ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్

Image
హిమాయత్‌సాగర్ పరిసరాల్లో అక్రమ మైనింగ్ – ‘మరో KGF’లా ప్రకృతి వనరుల దోపిడీ: ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ హిమాయత్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్, క్రషర్ యూనిట్ల కార్యకలాపాలపై బీఆర్‌ఎస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పరిశీలన నిర్వహించినట్లు ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తెలిపారు. హిమాయత్‌సాగర్ ప్రాంతంలోని సర్వే నంబర్లు 66, 67, 68, 69లో నడుస్తున్న క్రషర్ యూనిట్లను బృందం ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ బృందంలో ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్‌తో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, రాజేంద్రనగర్ పార్టీ ఇన్‌చార్జ్ పట్లొళ్ల కార్తీక్ రెడ్డి, ఎస్సీ–ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేషన్ మాజీ ఛైర్మన్లు డా. క్రిశాంక్, డా. వాసుదేవ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉపేంద్రాచారి, కే. కిషోర్ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకుడు అభిలాష్ రంగినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, అక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే KGF సినిమా గుర్తుకు వచ్చిందన్నారు. భూమాతను చెరబట్టి ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ...

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు

Image
  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత  ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని  అడ్వకేట్  కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు హైద్రాబాద్: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ  ఓటర్ల లిస్టు లో అర్హత లేని వారు నల్లగొండ జిల్లా ఓటర్ల ను తయారు చేశారని అట్టి ఓటర్ లిస్టు చెల్లదని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ, ఎన్నికల కొరకు కోర్టు నియమించిన అడ్వకేటు కమీషనర్ పి. బాల గోపేంద్రనాథ్ కు అభ్యంతరాలు వ్యక్త పరుస్తూ భూపతి రాజు ఫిర్యాదు అందచేశారు. ఆ ఫిర్యాదు లో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు నిర్వహించుటకు తమరిని కోర్టు అడ్వకేటు కమీషనర్ గా నియమించారని ప్రస్తుతము ఉన్న ఓటర్స్టు పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 2026 మార్చి 3.4,5 తేదీలలో తెలపవలసిందిగా కోరుతూ ఈనాడు దిన పత్రికలో పబ్లిక్ నోటీసు ను తమరు ప్రకటించారని, నల్లగొండ ఓటర్ లిస్టు చెల్లదని వివరాలు తెలిపారు. నేను అనగా భూపతి రాజు (తండ్రి భద్రాద్రి) రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ జీవిత సభ్యుడననీ, ( జీవిత సభ్యునిగా నా సభ్యత్వ నంబరు 56924), ప్రస్తుతము జిల్లా ఉపాధ్యక్షులు గా ఉన్నానని , నా అడ్రసు: 6-2-1061/2 , వీటి కాలని, నల్గొండ 508001 . సెల్: 9848490545 ని తమరికి చ...

ఎంజీయూ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ ఉత్సవాలు..

Image
 ఎంజీయూ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ ఉత్సవాలు.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం శాఖ ఏబీవీపీ ఆధ్వర్యంలో హోలీ ఉత్సవాలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడ్డాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పరం రంగులు చల్లుకుంటూ సాంప్రదాయబద్ధంగా హోలీ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షులు హనుమాన్ మాట్లాడుతూ... హోలీ పండుగ ఐక్యత,స్నేహభావానికి ప్రతీక అని తెలిపారు.భేదాభిప్రాయాలను పక్కనబెట్టి విద్యార్థులంతా కలిసిమెలిసి ముందుకు సాగాలని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మోహన్,అజయ్,మౌనేష్ సతీష్,విజయ్,సంపత్,వెంకటేష్ సుధీర్,నగేష్,శంకర్,సాయి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఓటర్ల లిస్టు పై అభ్యంతరాల స్వీకరణకు పబ్లిక్ నోటీస్ ప్రకటించిన అడ్వకేట్ కమిషనర్ పి. బాల గోపేంద్రనాథ్‌

Image
 తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఓటర్ల లిస్టు పై అభ్యంతరాల స్వీకరణకు పబ్లిక్ నోటీస్ ప్రకటించిన అడ్వకేట్ కమిషనర్ పి. బాల గోపేంద్రనాథ్‌ హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ కార్యాలయానికి ఎన్నికలు నిర్వహించడానికి తనను కమిషనర్‌గా నియమింప బడినట్లు  పి. బాల గోపేంద్రనాథ్‌ (అడ్వకేట్ కమిషనర్) పబ్లిక్ నోటీస్ ను దిన పత్రికలో ప్రకటించారు. ఖైరతాబాద్ లోని చింతల్‌బస్తీ నంబర్ 6-2-648లో రిజిస్టర్డ్ కార్యాలయం ఉంది. దీనిని సాధారణంగా "వైశ్య భవన్" అని పిలుస్తారని , ప్రస్తుత ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఈ నోటీసు ప్రచురించబడిన తేదీ నుండి మూడు రోజుల్లోపు అంటే 03-03-2026 నుండి 05-03-2026 వరకు నాకు లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చునని, తాను స్వయంగా ఈ మూడు రోజులు అంటే మంగళవారం, బుధవారం, గురువారం మధ్యాహ్నం 1-00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు హైదరాబాద్‌లోని వైశ్య భవన్ చింతల్‌బస్తీలో అందుబాటులో ఉంటాననీ, ఆ తర్వాత వచ్చే అభ్యంతరాలను స్వీకరించరని పబ్లిక్ నోటీస్ లో పేర్కొన్నారు. ఓటర్ల లిస్టులో పేర్లు కోల్పోయినవారికి ఇది మంచి అవకాశము. తమ హక్కును నిరంకుశ ధోరణిలో తొలిగిపబడ్డ వారు వారి అభ్యంతరాలు సమర...