నల్లగొండ కార్పొరేషన్ మొదటి మేయర్ పీఠం తమ పార్టీకే-బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్
నల్లగొండ కార్పొరేషన్ మొదటి మేయర్ పీఠం తమ పార్టీకే-బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ నల్గొండ: బీజేపీ రాజ్యసభ సభ్యుడు *డాక్టర్ కే లక్ష్మణ్* నల్లగొండ జిల్లా బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పాయింట్స్... రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజల్లో మార్పు కోరుకునే భావన స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే.లక్ష్మణ్ అన్నారు... గతంలో టీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనతో ప్రజలు విసిగి మార్పు కోసం కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారని, అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్యానించారు... కాంగ్రెస్ గ్యారెంటీలు, హామీలు అమలు కావడం లేదని, యువత, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు మోసపోయిన భావనలో ఉన్నారని తెలిపారు... పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి 35 శాతం ఓట్లు ఇచ్చి 8 మంది ఎంపీలను గెలిపించడం ద్వారా స్పష్టమైన సంకేతం ఇచ్చారని అన్నారు... నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, పేదల సంక్షేమ పథకాలు ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజలకు చేరుతున్నాయని చెప్పారు...