ఆర్య వైశ్యులు అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందాలి - ఉప్పల శ్రీనివాస్ గుప్త
ఆర్య వైశ్యులు అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందాలి*
-*TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం తాడేపల్లిగూడెంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా IVF సెంట్రల్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ IVF అధ్యక్షుడు, TPCC ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో 33 లక్షల మంది ఆర్య వైశ్యులకు సంక్షేమ పథకాలు వచ్చే విధంగా అలాగే నామినేటెడ్ పోస్టలు వచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అలాగే జగ్గయ్య పేట ఎమ్మెల్యే తాతయ్య అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మెన్ దుంది రాజేష్ తో కలిసి ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని మంత్రి లోకేష్ గారిని కలవడం జరుగుతుంది అని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో అలాగే మంత్రి శ్రీధర్ బాబు తో మాట్లాడి వారితో పరిశ్రమలు ఏర్పాటు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ లో ఎలాంటి సహాయ సహకారాలు కావాలంటే నేను ముందు వుంటాను అని తెలంగాణలో ఫిలిమ్స్ కి ఎంపికైన వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తానని ఇప్పటికే 40 మందికి అందజేయడం జరిగిందని అలాగే ఏపీలో కూడా వారికి అందజేస్తారని హామీ ఇచ్చారు.
తన దృష్టికి వచ్చిన ఆర్య వైశ్యుల కోసం కృషి చేస్తానని ఆయన చెప్పారు.
దేశంలో అంబానీ నుండి అదాని వరకు 70% ఆర్య వైశ్యులు కడుతున్నారు అని ఆయన అన్నారు.
వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం, వంద కార్లు–బైకులతో నిర్వహించిన ర్యాలీతో కమ్మ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. వేదికపై హెల్త్ క్యాంపు, రక్తదాన శిబిరాలు ప్రారంభించి, జ్యోతిప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోన శ్రీనివాస్ గారు IVF ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇతర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. IVF సేవా కార్యక్రమాలు, మహిళా దినోత్సవ వేడుకలు, విద్యార్థులు–పేదల సంక్షేమంపై నేతలు ప్రసంగించారు.
4000 మందికి భోజన ఏర్పాట్లు చేయగా, ల్యాప్టాప్‌లు, కుట్టు మిషన్లు, గ్రైండర్లు పంపిణీ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Comments
Post a Comment