Posts

జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో లెక్కల్లో లేని నగదు 25లక్షలు స్వాధీనం చేసుకున్న SST బృందం

Image
 25 లక్షలు స్వాధీనం చేసుకున్న SST బృందం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లెక్కల్లో లేని నగదు హైదరాబాద్, అక్టోబర్ 13, 2025: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు జరుగుతున్న ఎన్నికల నిఘా కార్యకలాపాలలో భాగంగా, స్టాటిక్ సర్వైలెన్స్ టీం (SST) -11B ఒక వాహనాన్ని అడ్డగించి 25,00,000 (ఇరవై ఐదు లక్షలు) నగదును స్వాధీనం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని సీతమ్మధార (NE లేఅవుట్) ఫ్లాట్ నంబర్ 194 నివాసి శ్రీ జైరామ్ తలసియా నుండి ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు. అతను TS09FF 6111 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన కారులో యూసుఫ్‌గూడ వైపు ప్రయాణిస్తున్న సమయం లో సారధి స్టూడియో సమీపంలోని మైత్రీవనం ఎక్స్ రోడ్ల వద్ద సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు SST బృందం, వాహనాన్ని ఆపి, తనిఖీ చేయగా, నగదు కనిపించింది. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, స్వాధీనం చేసుకున్న నగదును తదుపరి దర్యాప్తు మరియు అవసరమైన చర్యల కోసం వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్, మధురానార్‌కు అప్పగించారు.

ఇసుక తవ్వకాల నివేదికలపై సందేహాలు ,సలహాలు అభ్యంతరాలు పరిశీలనకు పంపండి - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Image
  ఇసుక తవ్వకాల నివేదికలపై సందేహాలు ,సలహాలు అభ్యంతరాలు పరిశీలనకు పంపండి - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ:  ఇసుక తవ్వకాలకు సంబంధించి వివిధ శాఖలు సమర్పించిన నివేదికలను క్రోడీకరించి నల్గొండ జిల్లాకు సంబంధించి రూపొందించిన జిల్లా సమగ్ర నివేదికను (DSR) వెబ్సైట్ https://nalgonda.telangana.gov.in లో పొందుపరిచినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు .                 జిల్లాలోని ఇసుక తవ్వకాలకు సంబంధించి సాంకేతిక శాఖలైన నీటిపారుదల,గనులు, భూగర్భ జల వనరులు ,టీఎస్ ఎంఐడిసి, అటవీ, రెవెన్యూ, ముఖ్య ప్రణాళిక అధికారి శాఖల నుండి ఇసుక తవ్వకాలపై నివేదికలను కోరడం జరిగిందని ఈ మేరకు ఆయా శాఖలు సమర్పించిన నివేదికలన్నింటిని పూర్తిస్థాయి జిల్లా సమగ్ర నివేదికగా (DSR)గా మార్చి పైన పేర్కొన్న వెబ్సైట్లో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు.వెబ్ సైట్ లో ఉంచిన జిల్లా సమగ్ర నివేదికపై ఏవైనా సందేహాలు ,సలహాలు అభ్యంతరాలు ఉంటే తేదీ 25.10.2025 లోగా admgnlg@gmail.com మెయిల్ కు పరిశీలనకు పంపవలసిందిగా కలెక్టర్ కోరారు.

బోడా నాగేశ్వరరావు సోషల్ వర్క్ మరియు పర్యావరణ రంగాలలో హానరరీ పీహెచ్.డి. అవార్డు

Image
 బోడా నాగేశ్వరరావు సోషల్ వర్క్ మరియు పర్యావరణ రంగాలలో హానరరీ పీహెచ్.డి. అవార్డు Hydrabad:  బోడా నాగేశ్వరరావు కి సోషల్ వర్క్ మరియు పర్యావరణ రంగాలలో చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా హానరరీ పీహెచ్.డి. అవార్డు ప్రదానం చేయబడింది. బోడా నాగేశ్వరరావు  తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) లో ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పనిచేస్తూ, గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ, పుదుచ్చెరి ద్వారా 2025 అక్టోబర్ 11న ఈ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు, ఆయన చేసిన పర్యావరణ విద్య, అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాల్లో విశిష్టమైన కృషి, అలాగే ప్రజా సంబంధాలలో అంకితభావం కోసం ప్రదానం చేయబడింది. గత 15 సంవత్సరాలుగా, ఆయన వివిధ స్వచ్ఛంద సంస్థల (NGOs) తో కలిసి పనిచేసి, పర్యావరణ సదస్సులు, వర్క్‌షాపులు, అవగాహన కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించడం, అలాగే తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన జాతీయ మరియు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాలు మరియు కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించారు.అయన యొక్క పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక సంక్షేమ పట్ల అసాధారణ అంకితభావం అనేకులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

భూపతి టైమ్స్ 12th అక్టోబర్ 2025

Image
 

తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ జిల్లాల కన్వీనర్ & కమిటీల ఎంపిక సమావేశం

Image
  తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ జిల్లాల కన్వీనర్ & కమిటీల ఎంపిక సమావేశం హైద్రాబాద్:  తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ మీడిదొడ్డి శ్యామ్  ఆధ్వర్యంలో ఉపేందర్ మొగుళ్లపల్లి చైర్మన్ గా సమావేశం అక్టోబర్ 12, ఆదివారం ఉదయం హైద్రాబాద్ లోని ఖర్మన్ ఘాట్ వేడుక ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైశ్య మహాసభ పూర్వ అధ్యక్షులు గంజి రాజమౌళి గుప్తా, ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వల సుజాత, కార్పొరేన్ మాజీ చైర్మన్లు కోలేటి దామోదర్, ఉప్పల శ్రీనివాస్, బొల్లం సంపత్ లు,  యాదా నాగేశ్వరరావు లు హాజరు అవుతారని నిర్వాహకులు సోషల్ మీడియాలో తెలిపారు.  వివిధ జిల్లా ల పోరాట యోధులు మహాసభ అభివృద్ధి కాంక్షించే వారు అన్యాయం ను ఎదురించే వారు కాబోయే జిల్లా కన్వీనర్ లు ఇతర పదవులు పొందే వారు మహాసభ ప్రక్షాళన కోసం ఎన్నికల నిర్వహణ కోసం బైలా రక్షణ కోసం ఆస్తుల పరిరక్షణ కోసం అన్యాయం ను ఎదురుకొనుట కోసం అన్నిటికి అన్నివిధాలా సిద్ధంగా ఉంటే నాయకుల తొలి సమావేశం కు అందరు హాజరై జయప్రదం చేయగలరనీ ...

పాలదర్శక పాలనకు RTI act పాశుపతాస్త్రం - ఇన్చార్జి డిఆర్ఓ ,నల్గొండ ఆర్డీవో వై.అశోక్ రెడ్డి

Image
 పాలదర్శక పాలనకు సమాచార హక్కు చట్టం పాశుపతాస్త్రం అని ఇన్చార్జి డిఆర్ఓ ,నల్గొండ ఆర్డీవో వై.అశోక్ రెడ్డి అన్నారు.        ఈ నెల 5 నుండి 12 వరకు నిర్వహిస్తున్న సమాచార హక్కు చట్టం వారోత్సవాలు భాగంగా శుక్రవారం డిఆర్ఓ ఛాంబర్ లో నిర్వహించిన సమాచార హక్కు చట్టం వారోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.          ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార యంత్రాంగాలలో బాధ్యతను, పారదర్శకత్వం పెంచేందుకు సమాచార హక్కు చట్టం బాగా ఉపయోగపడుతుందని అన్నారు. పౌరులు వారికి అవసరమైన సమాచారాన్ని 30 రోజుల్లో సమాచార హక్కు చట్టం కింద పొందవచ్చు అని తెలిపారు. జిల్లాలోని అధికారులు అందరూ సమాచార చట్టం నియమ నిబంధనల ప్రకారం పౌరులు కోరిన సమాచారాన్ని ఇచ్చి పౌరులకు సహకరించాలని చెప్పారు.      ఈ కార్యక్రమంలో జిల్లా , తహసిల్దార్లు, సమాచార హక్కు చట్టం సంస్థలు ,తదితరులు పాల్గొన్నారు.