ఏసీబీకి చెక్కిన కాకతీయ యూనివర్సిటీ ఎస్ఐ
ఏసీబీకి చెక్కిన కాకతీయ యూనివర్సిటీ ఎస్ఐ
హన్మకొండ, గూఢచారి, జనవరి 8:
హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శ్రీకాంత్ రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పేకాట కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోకుండా.. కేసును తేలిక చేసి, అతనికి అనుకూలంగా వ్యవహరించేందుకు ఎస్సై శ్రీకాంత్ రూ. 15వేల నగదును డిమాండ్ చేశారు. బాధితుడిని పదేపదే వేధిస్తూ డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో చేసేదేం లేక సదరు వ్యక్తి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్ని గురువారం బాధితుడి నుంచి ఎస్సై శ్రీకాంత్ 15 వేల లంచం తీసుకుంటున్న సమయంలో దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. కేయూ ఎస్సై శ్రీకాంత్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం జిల్లాలో చర్చనీయాంశమైంది. కాగా 2026 సంవత్సరంలో ఏసీబీ అధికారులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసు నమోదు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Comments
Post a Comment