*ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి రాజగోపాల్ ను కలసిన, టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్-2843) నేతలు*

 


*ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి రాజగోపాల్ ను కలసిన, టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్-2843) నేతలు*


- జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశాన్ని జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి ద్వారా తెలుసుకున్న ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి


ఖమ్మం, జనవరి 09:


ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపుల అంశంలో నెలకొన్న అనిశ్చితిపై న్యాయ సహకారం అందించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ 

(టిడబ్ల్యూజేఎఫ్- హెచ్-2843) జిల్లా కమిటీ బృందం జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి.రాజగోపాల్‌ ను ఆయన చాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి. రాజగోపాల్ కు ముందస్తు శుభాకాంక్షలు తెలియ జేశారు.


ఈ భేటీలో జిల్లా అధ్యక్షులు టి. సంతోష్ చక్రవర్తి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు మంజూరైన ఇండ్ల స్థలాల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర అనిశ్చితిని సృష్టిస్తున్నాయని జడ్జి దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్‌లో న్యాయ నిపుణులు జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై చేసిన సూచనలు, సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఉన్న న్యాయపరమైన అంశాలను వివరించి, జర్నలిస్టులకు చట్టపరమైన పరిరక్షణ కల్పించాలని వినతిపత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు.

దీనికి స్పందించిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి రాజగోపాల్, సుప్రీంకోర్టు తీర్పులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని స్పష్టం చేశారు. జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు సమర్పించిన వినతిపత్రంలోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, చట్ట పరిధిలో సాధ్యమైన న్యాయ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని, కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రజల పక్షాన నిలబడి వారు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు.


ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, కోశాధికారి అర్వపల్లి నగేష్, టీబీజేఏ జిల్లా అధ్యక్షులు వందనపు సామ్రాట్ గుప్తా, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ అంతోటి శ్రీనివాస్, లీగల్ అడ్వైజర్ పసుపులేటి శ్రీనివాస రావు, కుంభం రవి కుమార్, కాసోజు శ్రీధర్, సుధాగాని కరుణాకర్, కప్పల మధు గౌడ్, సాపవత్ నాగరాజు, చిన్నంశెట్టి రాంబాబు, అమరబోయిన ఉపేందర్, కందరపోయిన నాగకృష్ణ, వంగ పుంగమ గౌడ్, కొండల్, ఎలుగోటి వెంకట్, కరాటే వేణు, నాయిని స్వాతి, తుమ్మలపల్లి శ్రీనివాస్, షేక్ సోందుమియా, మల్లెల శిల్ప, రమేష్, గంటేల కుమార్, మందడపు మనోహర్, సురేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం