Posts

Showing posts from 2022

భేరి నరేష్ ను వెంటనే శిక్షించాలి.

Image
  భేరి నరేష్ ను వెంటనే శిక్షించాలి... అయ్యప్పస్వామి,  హిందూ దేవి దేవతలపై  అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని నల్లగొండ రామగిరి అయ్యప్ప దేవాలయం గురుస్వాములు నోముల శ్యామ్, కలేశన్ అశోక్ లు డిమాండ్ చేశారు.... నిన్న కొడంగల్ నియోజక వర్గంలోని రావులపల్లి గ్రామంలో జరిగిన నాస్తిక సభలో భేరి నరేష్ అనే వ్యక్తి మాట్లాడుతూ అయుప్ప స్వామి తో పాటు హిందూ దేవి దేవతలు అయిన శ్రీరాముడు, శివుడు తదితర దేవుల్లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు... దీనికి నిరసనగా సోషల్ మీడియాలో వచ్చిన వీడియో క్లిప్పింగ్ లతో నల్లగొండ టూ టౌన్  పోలీస్ స్టేషన్ లో అయ్యప్ప భక్తులతో కలసి ఫిర్యాదు చేశారు... ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు స్వీకరించి విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు...  ఈ సందర్భంగా  అశోక్ గురుస్వామి మాట్లాడుతూ... నాస్తిక సభలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో హిందూ దేవీదేవతల గురించి అసభ్యంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు... హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడిన నరేష్, తో పాటు ఆ సభ నిర్వాహకులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు... భవిష్యత్తులో ఎవరు కూడా హిందూ దేవి దేవతల గురించ

తెలంగాణ డిజిపి గా అంజనీ కుమార్

Image
  తెలంగాణ డిజిపి గా అంజనీ కుమార్ అంజనీ కుమార్ 1990 బ్యాచ్ ఐపిఎస్ అధికారి ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్నారు. 2021 డిసెంబరు 24న ఏసీబీ డీజీ అయ్యారు. అంతకుముందు హైదరాబాద్ నగర కమిషనర్ గా పని చేశారు ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్ (పీస్ మెడల్) రెండుసార్లు అందుకున్నారు.  ఐక్యరాజ్య సమితి తరపున 1998-99లో బోస్నియా దేశంలో పనిచేశారు. బిహార్ రాజధాని పట్నాలోని సెయింట్ జేవియర్ స్కూల్లో, దిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఐపిఎస్ ట్రైనింగ్ లో మంచి ప్రతిభ కనపబరిచి రెండు కప్పులు గెలుచుకున్నారు. గతంలో జనగామ ఏఎస్పీగా పనిచేశారు. కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ ఛీఫ్ గా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో గ్రేహౌండ్స్ ఛీఫ్ గా పనిచేశారు నిజామాబాద్ డీఐజీగా చేశారు వరంగల్ ఐజీగా చేశారు హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అదనపు కమిషనర్ గా చేశారు తెలంగాణ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా చేశారు. 2018 మార్చి 12న హైదరాబాద్ కమిషనర్ గా చేరారు. 2021 డిసెంబరు 25న ఏసీబీగా డీజీగా నియమితులయ్యారు. రాష్ట్రపతి పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, నక్సల్ ప్రాంతంలో పనితీరుకు గానూ, ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ అందుకున్నారు. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రపై విస్తృత పరిశోధన

అక్రమ ఫీజుల కొరకు వేధిస్తున్న వివేకవర్ధిని ఎయిడెడ్ స్కూల్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి - కట్టెల శివకుమార్

Image
   అక్రమ ఫీజుల కొరకు వేధిస్తున్న వివేకవర్ధిని ఎయిడెడ్ స్కూల్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి - కట్టెల శివకుమార్ నల్గొండ పట్టణంలోని షేర్ బంగ్లా లోగల వివేకవర్ధిని ఎయిడెడ్ స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఫీజుల కొరకు వేధిస్తున్న ప్రిన్సిపాల్ ముకముల ప్రమీల నరసింహ ను సస్పెండ్ చేసి కఠినమైన చర్యలు తీసుకొని అట్టి స్కూల్లో ఏడేడు ప్రభుత్వం స్వాధీన పరచుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన డిమాండ్ చేస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ తెలిపారు.బొజ్జ శంకర్ సుధీర్ విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది 

ఏమ్మెల్యేలకు ఎర కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే కు హైకోర్టు నిరాకరణ

Image
  ఏ మ్మెల్యేలకు ఎర కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే కు హైకోర్టు నిరాకరణ ఈడీ విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రోహిత్ రెడ్డి అభ్యర్థన తోసిపుచ్చిన హైకోర్టు ఈనెల 30న హాజరు కావాలన్న ఈడీ సమన్లలో జోక్యానికి నిరాకరించిన హైకోర్టు ఈడీ కేసు కొట్టివేయాలన్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ విచారణ రోహిత్‌రెడ్డి తరఫున వైకాపా ఎంపీ, సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు పార్టీ మారాలని తనకు వందకోట్లు ఆఫర్ ఇచ్చారన్న రోహిత్‌రెడ్డి ఆఫర్ మాత్రమే చేశారు కాని డబ్బు ఇవ్వలేదన్న రోహిత్‌రెడ్డి వాదనలు ఆర్థిక లావాదేవీలు జరగలేదు కనుక ఈడీకి విచారణ పరిధి లేదని రోహిత్ రెడ్డి వాదన ఈడీ ఈసీఐఆర్ మనీలాండరింగ్ చట్టానికి విరుద్ధమన్న రోహిత్‌రెడ్డి  వ్యక్తిగత వివరాల కోసం ఈడీ తనను వేధిస్తోందన్న రోహిత్‌రెడ్డి కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం, విచారణ జనవరి 5కు వాయిదా

Bhupathitimes 28th Dec. 2022

 

విద్య,రాజకీయ రంగాల్లో వైశ్యులు మరింత రాణించాలి : హరినాథ్ గుప్త బెలిదె

Image
  విద్య,రాజకీయ రంగాల్లో వైశ్యులు మరింత రాణించాలి : హరినాథ్ గుప్త బెలిదె హైదరాబాద్ : వ్యాపారంలో తిరుగులేని ఆధిక్యతను సాధించిన వైశ్యులు, విద్య, రాజకీయ రంగాల్లో మరింత రాణించాల్సిన అవసరం ఉందని, వాసవీ పొలిటికల్ ఫోరం చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె పేర్కొన్నారు. నేరేడ్ మెట్ మల్కాజ్ గిరి లోని శ్రీ వాసవీ ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో రూపొందించిన 2023 ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేరేడ్ మెట్ లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో, సేవా సమితి అధ్యక్షులు పోకల శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హరినాథ్ గుప్త మాట్లాడుతూ, వ్యాపార రంగంలో వైశ్యులకు సాటి ఎవరూ లేరన్నారు. అలాగే విద్య, రాజకీయ రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. సమాజంలోని నూతన ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడానికి ఉన్నత విద్య చాలా అవసరమన్నారు. అలాగే సమాజ శ్రేయస్సును ఆశించే వైశ్య సామాజిక వర్గం, రాజకీయంగా అగ్రస్థానంలో ఉంటే సమాజంలోని అన్ని వర్గాలు అభ్యున్నతిని సాధిస్తాయన్నారు. మల్కాజ్ గిరి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దూబగుంట అశోక్, శ్రీ కళ్యాణ వెంకటేశ్వ

బలహీనులపై ప్రతాపం చూపించే ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్!

Image
   బలహీనులపై ప్రతాపం చూపించే  ఐఏఎస్  అధికారి నవీన్ మిట్టల్! ఆయన నిర్ణయాలు ఎప్పుడు వివాదాస్పదమే! ఆయన ఏ డిపార్ట్మెంట్ లో చేసిన సంచలనమే? హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నుండి విద్యా శాఖ వరకు. అయిన respondent గా, కోర్టు ధిక్కార కేసులు కోకొల్లలు ఒక్కసారి హై కోర్టు వెబ్సైట్లో case staus ఇన్ఫర్మేషన్ లో నవీన్ మిట్టల్ respondent గా కేసులు చూడండి ముందు వచ్చిన చెవులు కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడిగా వుంటాయంటున్న నవీన్ మిట్టల్ హైదరాబాద్: మమ్ములని మా భార్యాపిల్లలను అన్యాయం చేయవద్దని  అంటూ ప్రాధేయపడుతున్న ఉద్యోగులు. హాత్మహత్య ప్రయత్నాలు చేసిన, మంత్రుల సిఫారసులను చేసిన కేర్ చేయని నవీన్ మిట్టల్. ముందు వచ్చిన చెవులు కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయని భావిస్తున్న సదరు అధికారి.   ఈ వార్త చూడండి ఆయన వ్యవహార శైలి పూర్తి తెలుస్తుంది https://youtu.be/-LIOB15p8Mo అయిన  పై వచ్చిన ఎన్నో వ్యతిరేకంగా న్యూస్  టచ్ చేసి చూడండి https://youtu.be/RsIR8TOLZvI https://youtu.be/GZplhr_uuDo https://youtu.be/FJe7GNgZflw https://youtu.be/vzkoZDgoMxc https://youtu.be/RwBDmXD9bBk https://youtu.be/SLRAiFu5aIw https://youtu.be

రైతు సమస్యలపై బీజేపీ ధర్నా - బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల

Image
రైతు సమస్యలపై బీజేపీ ధర్నా -  బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల నల్గొండ: రాష్ట్రంలో నెలకొన్న రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈనెల 27న మంగళ వారం రోజుఉదయం 10 గంటలకు  బీజేపీ అధ్వర్యంలో ధర్నా కార్యక్రమం  కంకణాల శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన  నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి ఓ ప్రకటన లో తెలిపారు. సీఎం కెసిఆర్ ఎన్నికల ముందు  ఇచ్చిన హామీల మేరకు లక్ష రూపాయల రుణ మాఫీ,రైతులకు ఉచితంగా ఎరువుల పంపిణీ,తప్పు తడకల దరణిని రద్దు చేయాలని,వ్యవసాయ పనిముట్లను రాయితీ పై పంపిణీ చెయ్యాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్  పిలుపు మేరకు ధర్నా  నిర్వహంచనున్నట్లు   ఆయన తెలిపారు.  నల్లగొండ జిల్లా లోని అన్ని మండల శాఖలు    మండలాలలో  ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Bhupathitimes 25th Dec. 2022

 

ఎసిబి చిక్కిన మత్స్యశాఖ ఉద్యోగి

Image
  ఎసిబి చిక్కిన మత్స్యశాఖ ఉద్యోగి ఖమ్మం:  వైరా మత్స్య శాఖలోపనిచేస్తున్న ఓ ఉద్యోగిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫోన్ పే ద్వారా 50,000 లంచం తీసుకున్న కేసులో వైరా మత్స్య శాఖ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఫిషరీస్ అసిస్టెంట్గాపని చేస్తున్న మార్కాపురం మురళిని ఏసీబీ అధికారులు అరెస్ట్చేసి శనివారం హైదరాబాద్ నాంపల్లి ఎసిబి కోర్టులో రిమాండ్ చేశారు. వైరా రిజర్వాయర్లో చేపల వేట కోసం లక్షరూపాయలు లంచాన్ని మురళి డిమాండ్ చేశాడని, అయితే తాను ఫోనే ద్వారా రూ.50 వేలను జులై 21న మురళికి చె ల్లించినట్లు పారిశ్రామిక శాఖ సహకార సంఘం అధ్యక్షుడు ఎస్.కె. రహీం జిల్లా కలెక్టర్ వీపీ గౌతంకు, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ డిఎస్పి సూర్యనారాయణ ఆధ్వర్యంలో సిఐలు శ్రీనివాస్, బాలకృష్ణ, సిబ్బందిశక్రవారం వైరా మస్త్యశాఖ కార్యాలయంతో పాటు, జిల్లా మస్త్య శాఖ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. వైరా మత్స్యశాఖలో అన్ని రికార్డులను తనిఖీ చేసి వాటి స్వాధీనం చేసుకున్నారు. జులై 1 నుంచి చేపల వేట నిలిపివేశారు. అయితే ఈ సమయంలో చేపల వేట  కొనసాగించేందుకు గాను లక్ష రూపాయలు ఇవ్వాలని తాను అధికారులతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తా

ఆర్య వైశ్యులు వ్యాపారం లోనే కాదు, సామాజిక సేవలోను ముందుంటారు - రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్

Image
  ఆర్య వైశ్యులు వ్యాపారం చేయడంలో మాత్రమే కాదు, సామాజిక సేవలోను ముందుంటారు - రాష్ట్ర టూరిజం  చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త హైదరాబాద్: ఆర్య వైశ్యులు వ్యాపారం చేయడంలో మాత్రమే కాదు, సామాజిక సేవలోను ముందుంటారని రాష్ట్ర టూరిజం  చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు.  హైదరాబాద్ లోని సికింద్రాబాద్ మినర్వా గ్రాండ్ హోటల్ లో  జరిగిన వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ GATE & RCTS - 2022, గవర్నర్స్ అకాడమీ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ ఎంపవర్‌మెంట్ & రీజియన్ చైర్‌పర్సన్ ట్రైనింగ్ సెమినార్ లో ముఖ్య అతిథిగా రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్  ఉప్పల శ్రీనివాస్   పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ. ఆర్య వైశ్యులు వ్యాపారం చేయడంలో మాత్రమే కాదు, సామాజిక సేవలోను ముందుంటారని,ఇకముందు కూడా ఉండాలని అన్నారు. IVF ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ప్రిలిమినరీ పాస్ అయి, IAS చదువుతున్న 23 మందికి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మరియు వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ

bhupathitimes 23rd, Dec. 2022

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఏఆర్ కానిస్టేబుల్ అరెస్టు

Image
  మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఏఆర్ కానిస్టేబుల్ అరెస్టు హైదరాబాద్:  మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఏఆర్ కానిస్టేబుల్ జింకల కిషోర్‌ను మైలార్దేవులపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల పాఠశాలలో అవగాహన శిబిరం నిర్వహించిన షీటీమ్స్ పోలీసులకు బాధిత బాలిక ఈ విషయాన్ని వెల్లడించింది.

తెలంగాణ సర్కారుకు ఎన్జీటీ భారీ జరిమానా

Image
  తెలంగాణ సర్కారుకు ఎన్జీటీ భారీ జరిమానా దిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) భారీ జరిమానా విధించింది. అనుమతుల్లేకుండా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను చేపడుతోందని ఈ జరిమానా వేసింది.  మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 1.5శాతం (సుమారు రూ.900 కోట్లు) జరిమానా విధిస్తూ ఎన్జీటీ చెన్నై ధర్మాసనం తీర్పు ఇచ్చింది.  అనుమతుల్లేని ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని గతంలోనే ఎన్జీటీ ఆదేశించింది.  అనుమతులు లేకుండా నిర్మించిన పట్టిసీమ, పురుషోత్తపట్నం వ్యవహారంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడా అమలు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

Bhupathi times 22, Dec. 2022

 

లంచం కొరకు ఫోన్లో డిమాండ్?

Image
 లంచం కొరకు ఫోన్లో డిమాండ్? నల్గొండ: నల్గొండ లోని  సంక్షేమ భవన్ కాంప్లెక్స్ లోని ఓ ఇంజనీరింగ్ అధికారిని కాంట్రాక్టర్ నుండి నేరుగా ఫోన్ ద్వారా డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  నల్గొండ లోని  సంక్షేమ భవన్ కాంప్లెక్స్  లో ఒక ఇంజనీరింగ్ సెక్షన్ లో ఇంజనీర్ గా  పనిచేసిన ఓ  అధికారిణి  లంచం కొరకు ఫోన్ ద్వారా కాంట్రాక్టర్ ను డిమాండ్ చేయడం తో ఆ కాంట్రాక్టర్  సాక్ష్యాలతో అధికారుల కు ఫిర్యాదు. చేసినట్లు ప్రచారం.  దీనితో అధికారిని ని బదిలీ చేసినట్లు తెలుస్తుంది. లంచం డిమాండ్ చేసిన అధికారిణి కి పోస్టింగ్ కూడా  యివ్వలేదని సమాచారం.  ఈ అధికారిణి నల్గొండ లో పని చేస్తున్న సమయం లో  ఈ ఆఫీసులో పనిచేస్తున్న (రిటైర్డ్ ఉద్యోగి)  ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి  సహకారం తో    భారిగానే కుడబెట్టుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో భారీ అవినీతి

Image
 సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో  భారీ అవినీతి *నెల్లూరు జిల్లా :*  *రాష్ట్రంలో పెను సంచలనం..అవినీతి కేసులో సూళ్లూరుపేట ఆర్డీవో అరెస్ట్* *సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో జరిగిన భారీ అవినీతి కేసులో ప్రమేయం ఉన్నట్టు తేలడంతో సూళ్లూరుపేట ఆర్డీవో గా పని చేస్తున్న రోజ్మాండ్ ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.* *కోట్ల రూపాయల సివిల్ సప్లైస్ కుంభకోణం కేసులో రోజ్మండ్ కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు.*  *తవ్వే కొద్ది బయటపడుతున్న భారీ తిమింగలాలు.* *అంతులేని అవినీతి కేసును  కొలిక్కితేస్తున్న ఏసీబీ.* *ప్రధాన నిందితుడు శివకుమార్ ప్రియురాలికి రెండు కేజీ బంగారం ఇచ్చినట్టు, రోజమండ్ కుటుంబానికి సంబంధించి ఆమె కుటుంబంలో జరిగిన ఒక వివాహానికి రెండు కోట్ల రూపాయల వరకు ఇచ్చినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం* ఉమ్మడి నెల్లూరు జిల్లా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో గతంలో ఎండిగా పనిచేసి ,ప్రస్తుతం సూళ్లూరుపేట ఆర్డీవో గా పని చేస్తున్న రోజ్మండ్ కూడా అవినీతికి పాల్పడినట్లు పూర్తి ఆధారాలు దొరకడంతో ఆర్డీఓ గా పనిచేస్తున్న ఈమె అరెస్టుకు రాష్ట్ర సిఎస్ పర్మిషన్ కోరిన  ఏసీబీ అధికారులు అనుమతుల

Bhupathi Times 18th Dec.2022

 

ఏసీబీ కేసులో జైలు శిక్ష

Image
 ఏసీబీ కేసులో జైలు శిక్ష వరంగల్ జిల్లా కమలాపూర్ గ్రామం, గ్రామ రెవెన్యూ అధికారి జూపాక మొగిలి ని  ఏసీబీ కేసులో కరీంనగర్  SPE & ACB కేసుల కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి దోషిగా తేల్చి తీర్పును వెల్లడించారు. నిందితుడు జూపాక మొగిలి, గ్రామ రెవెన్యూ అధికారి, వరంగల్ జిల్లా కమలాపూర్ గ్రామంలో  ఫిర్యాదు దారుని  పేరుమీదే ముటేషన్ చేసి పట్టాదార్ పాసుపుస్తకం జారీ చేయుటకు రూ. 10,000/-  రూ. మొత్తాన్ని డిమాండ్ చేసి    2,000/- లంచం తీసుకుంటూ ఎసిబి దొరికిన కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. అవినీతి నిరోధక చట్టం 1988లోని u/s 7 & 13 (1) (d) r/w 13 (2). దీని ప్రకారం, నిందితుడు కి   రెండు (2) సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా కూడా చెల్లించాలి రూ.10,000/- అవినీతిని నిరోధించడంలో U/s 7 శిక్షార్హమైన నేరానికి చట్టం, 1988, జరిమానా మొత్తం చెల్లించడంలో డిఫాల్ట్ అయితే, నిందితుడు ఎ మూడు (3) నెలల కాలానికి సాధారణ జైలు శిక్ష మరియు అతను తదుపరి రెండు (2) సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష విధించబడింది మరియు U/s 13(1) (d) r/w శిక్షార్హమైన నేరానికి రూ.10,000/- జరిమానా కూడా చెల్లించాలి అవినీతి నిరోధక చట్టం, 1

గంజాయి బీరు తాగి యువతి హల్చల్

Image
 విశాఖ...  *గంజాయి బీరు తాగి యువతి హల్చల్*  విశాఖపట్నం ఆర్కే బీచ్ వై ఎం సి వద్ద యువతి హల్చల్ గంజాయి మత్తులో త్రీ టౌన్ ఏఎస్ఐ పై గంజాయి మత్తులో దాడి.... యువత పేరు అమూల్యాన్ని గుర్తించిన పోలీసులు.... నా బాయ్ ఫ్రెండ్ ఏటీఎం కి చెప్పి మిమ్మల్ని లేపించేస్తానన్న అమూల్య... రేపు నుంచి పోలీసులు ఎవరు రోడ్డుమీద తిరగకుండా చేస్తానని సవాల్ ఇచ్చిన అమూల్య.. ఆర్కే బీచ్ వయంసి వద్ద బహిరంగంగా బండి మీద కూర్చొని బీరు తాగుతుండగా నైట్ రన్స్ ఏఎస్ఐ చూసి వెళ్లి అడుగుతే బీర్ బాటిల్ తో పోలీస్ అధికారిపై దాడి చేసింది... వీరు బాటిల్తో దాడి చేసింది కాకుండా త్రీ టౌన్ ఎస్ఐ సత్యనారాయణ పై దుర్భాష మాట్లాడి అతన్ని కాలుతో తన్ని మీ పోలీసులు నన్ను ఏమీ పీకలేరని రోడ్డుపై హల్చల్ చేసింది... త్రీ టౌన్ ASI పై దాడి చేస్తుండగా బీర్ బాటిల్తో దాడి చేస్తుండగా అక్కడ ఉన్న యువకుడు మూర్తి అనే వ్యక్తి మధ్యలో అడ్డురావడంతో మూర్తి కన్నుపై వీరు బాటిల్ తగిలి మూర్తి కన్నుకి గాయం అయినది...  త్రీ టౌన్ ASI సత్యనారాయణ యూనిఫామ్ పై ఉన్న పోలీస్ స్టార్ల్ని లాగేసి యూనిఫామ్ చింపివేసింది... పోలీసులు అమూల్యకి బ్రీతింగ్ అనలైజర్ తో చెక్ చేస్తే 149 వచ్చింది... వైఎం
Image
 వి బి జి బిసినెస్ గ్రూప్ (ఓ పత్రికలో వచ్చిన వార్త దగుల్బాజీ)   తో మాకు సంబంధం లేదు - విబిజి ఫౌండేషన్ ఛైర్మెన్ మడుపడుగ రాము హైదరాబాద్:  ఇటీవల ఓ పత్రికలో విబిజి బిజినెస్ గ్రూప్ పై దగుల్బాజీ గ్రూప్ అని వార్తలు వచ్చాయని,ఆ గ్రూప్ తో మాకు సంబంధం లేదని విభిజి ఫౌండేషన్ ఛైర్మెన్ మరిపడుగ రాము తెలిపారు. హైదరాబాద్ లో ఫౌండేషన్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ మా ఫౌండేషన్ ఎలాంటి వ్యాపారాలు చేయడం లేదని, మా ఫౌండేషన్ కేవలం సేవా కార్యక్రమాల చేస్తుందని తెలిపారు.  విభిజి బిసినెస్ గ్రూప్ (దగుల్బాజీ) అనే వార్తను చూసి చాలామంది మిత్రులు నన్ను వివరణ అడిగారని అందుకే ఈ ప్రెస్స్ మీట్ ఏర్పాటు చేశామని తెలిపారు.  VBG ఫౌండేషన్ వేరు.. Vasavi Business Group వేరు అయితే VBG పేరుతో వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రసాద్,  రాజు, శ్రీహరి లు VBG ఫౌండేషన్ నిర్వాహక కమిటీలో ముఖ్య సభ్యులు అని, VBG ఫౌండేషన్లోని 22 మంది కమిటీలో ఆ ముగ్గురు కూడా కీలక పాత్ర పోషిస్తున్నవారే నని, కానీ వారి వ్యాపార కార్యక్రమాలకు పాండేషన్ కు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధమూ లేదని గ్రహించాలని తెలిపారు. ఫౌండేషన్ ద్వారా సేవా క

4,500 లంచం తీసుకుంటూ ఎసిబి కి దొరికిన GHMC ఆరోగ్య సహాయకుడు

Image
 GHMC, హైదరాబాద్ ఖైర్తాబాద్, సర్కిల్-17,  ఆరోగ్య సహాయకుడు (అవుట్ సోర్సింగ్), దోసి సురేష్ 4,500 రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి కి దొరికారు. ఫిర్యాదుదారు  ఓదెల  యొక్క బావ మరిది మరణ ధృవీకరణ పత్రంలో ఇంటిపేరును సరిదిద్దడం కొరకు లంచం డిమాండ్ చేసి  తీసుకుంటుండుగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. నిందితుని నుండి 4500 లు స్వాధీనం చేసుకున్నారు. పరీక్షలో నిందితుడి రెండు చేతుల వేళ్ళు లంచాల తీసుకున్నట్లు గా రంగు మారాయి. నిందిత అధికారిని అరెస్టు చేసి ఎసిబి న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తున్నారు.

అసభ్య పదజాలంతో దూషించిందని చిట్టా ప్రసాద్ ఫిర్యాదు తో మంచి ప్రసన్న అలియాస్ సత్యవతి ప్రసన్న పై కేసు నమోదు

Image
అసభ్య పదజాలంతో దూషించిందని చిట్టా ప్రసాద్  ఫిర్యాదు తో మంచి ప్రసన్న అలియాస్ సత్యవతి ప్రసన్న పై  కేసు నమోదు హైదరాబాద్: ( గూఢచారి) మంచి ప్రసన్న అలియాస్ సత్యవతి ప్రసన్న అసభ్య పదజాలంతో  దూషించిందని చిట్టా ప్రసాద్     ఫిర్యాదు చేయడం తో   ఐపిసి 504, 506 సెక్షన్ ల  ప్రకారం సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.  నేను కలం కౌంటర్ తెలుగు దినపత్రిక కు హైదరాబాద్ రిపోర్టర్ గా పని చేస్తున్నానని. నేను ఒక పేపరులో మరియు వాట్సాప్ లో  లో వచ్చిన పోస్టును నేను తిరిగి పోస్టు చేశానని, అందుకు నేను తప్పు వార్త ప్రచురించాను అని ఒక మహిళ మంచి ప్రసన్న అలియాస్ సత్యవతి ప్రసన్న  తనకు ఇష్టం వచ్చినట్లు బూతు మాటలతో చాలా అసభ్యకరంగా  మాటల తో ఫోన్ ద్వారా దూషించిందని, దీనితో నా మనస్సు తీవ్ర క్షోభ ను అనుభవించే విధంగా, సమాజంలో నాకు ఉన్న పరువుప్రతిష్టలను మంట కలిపేలా బెదిరిస్తూ మాట్లాడిందని. మరియు వాట్సాప్  లో తెలుగులో సందేశంను కూడా పంపిందని చిట్టా ప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. . నాకు కలిగిన మానసిక క్షోభకి కారణమై న వారిపై చర్య తీసుకోవలసిందిగా, అలాగే ఒక పత్రికా రిపోర్టర్ను ఇష్టం వచ్చినట్లు అసభ్యంగా బూతు మాటలు మాట్లా

రాజకీయ ఉద్యోగాలు పంపిణీ చేయనున్న కేసీఆర్ - బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ వి సుభాష్

Image
 రాజకీయ ఉద్యోగాలు పంపిణీ చేయనున్న కేసీఆర్ - బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ వి సుభాష్               హైదరాబాద్, డిసెంబర్ 13 :: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన కొత్త రాజకీయ సంస్థ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో కొంతమంది నేతలకు ఉపాధి కల్పించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్  ఎద్దేవా చేశారు.   తెలంగాణ రాష్ట్రంలో విద్యావంతులైన యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు.  అయితే ఇప్పుడు కొందరు నేతలకు రాజకీయ ఉద్యోగాలు పంచేందుకు సిద్ధమవుతున్నారని సుభాష్ ఆరోపించారు.  కేసీఆర్ నేతృత్వంలోని ఈ అవినీతి రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలంగాణ ప్రజలు సంకల్పించగా, ఆయన తన కుటుంబంతో కలిసి అవినీతిలో కూరుకుపోయిన డబ్బుతో తాను కొత్తగా ప్రారంభించిన పార్టీని ప్రమోట్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని            వివిధ రాష్ట్రాల్లో తమ పార్టీలచే వదిలివేయబడిన లేదా పక్కనపెట్టబడిన కొంతమంది రాజకీయ నాయకులకు BRS పునరావాస నిలయంగా ఉంటుందని, టిఆర్‌ఎస్ ఆవిర్భవించినప్పుడు రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, తెలంగాణ ప్రజల మనోభావాలను ఉపయోగ

పానగల్లు విద్యా భారతి పాఠశాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృత దేహం

Image
  పానగల్లు విద్యా భారతి పాఠశాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృత దేహం నల్గొండ పట్టణ శివారులోని పానగల్లు విద్యా భారతి పాఠశాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు హత్య చేసి కాలనీటిలో పడేసినట్టుగా పోలీసులు అనుమానం మృతుని గుర్తించాల్సి ఉంది.

మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి అనారోగ్యంతో మృతి

Image
 మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి అనారోగ్యంతో మృతి *నల్లగొండలోని రామగిరిలో ఉన్న నివాసంలో పార్థివ దేహం ఉంచిన బంధువులు నల్గొండ :  మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి (65) అనారోగ్యంతో మృతి... 1983 లో నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎన్టీ రామారావు రాజీనామా అనంతరం.. ఆ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించిన రుద్రమాదేవి... అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే గా విజయం సాధించిన రుద్రమదేవి... టిడిపిలో చాలాకాలం పాటు పనిచేసిన రుద్రమదేవి..  సంతాపం తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి,ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి,పలువురు రాజకీయ ప్రముఖులు... రుద్రమదేవి కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించిన ఏపి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు..

Bhupathi Times - 13th Dec. 2022

 

బస్సు బోల్తా - 15 మందికి గాయాలు

Image
 బస్సు బోల్తా  -  15 మందికి గాయాలు  హైదరాబాద్ -విజయవాడ 65వ జాతీయ రహదారిపై చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు కాగా.. వారిలో ఆరుగురు మరింత తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 35మంది ప్రయాణికులున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు_ .

అంతర్జాతీయ డ్రగ్ ముఠాను *అరెస్ట్* చేసిన రాచకొండ పోలీసులు

Image
 *రాచకొండ కమిషనరేట్*  అంతర్జాతీయ డ్రగ్ ముఠాను *అరెస్ట్*  చేసిన రాచకొండ పోలీసులు.. ఇద్దరు అరెస్ట్ , 8.5 కిలోల ఎపిడ్రీమ్ స్వాధీనపరుచుకున్న  మల్కాజిగిరి SOT పోలీసులు సుమారు *9 కోట్లు* విలువచేసే డ్రగ్స్ స్వాధీనం హైదరాబాద్ నుండి కొరియర్ ద్వారా విదేశాలకు సప్లై చేస్తున్న డ్రగ్ పెడలర్స్  నూతన సంవత్సర వేడుకలకు భారీ ప్లాన్ వేసిన *డ్రగ్స్ ముఠా*

దళితుడు పరుశురాములపై చెప్పుతో దాడి చేసిన అగ్రకుల సర్పంచ్ సరితా రెడ్డిని బర్తరఫ్ చేయాలి - కట్టెల శివకుమార్

Image
దళితుడు  పరుశురాములపై చెప్పుతో దాడి చేసిన అగ్రకుల సర్పంచ్ సరితా రెడ్డిని బర్తరఫ్ చేయాలి -   కట్టెల శివకుమార్  నల్గొండ : దళితుడు దివ్యాంగుడు వరకల పరుశురాములపై చెప్పుతో దాడి చేసిన అగ్రకుల సర్పంచ్ సరితా రెడ్డిని బర్తరఫ్ చేయాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా ఆర్ అండ్ బిగ్ గెస్ట్ హౌస్ నందు నిర్వహించిన  ప్రెస్ మీట్ ఆయన మాట్లాడుతూ నార్కట్పల్లి మండలం బాజకుంట గ్రామానికి చెందిన దళితుడు వికలాంగుడు వరకాల పరశురాములపై చెప్పుతో ఆ గ్రామ సర్పంచ్ సరితా రెడ్డి అగ్రకుల దురఅహంకారంతో చెప్పుతో దాడి చేయడం అమానుషమని దీని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.  తక్షణమే అమె ఫైవ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సర్పంచ్ పదవి నుండి భర్తరఫ్ చేయాలని  ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న ఇంకా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఈ దాడి యావత్ దళిత జాతిని అవమానపరిచే విధంగా ఉందని  అన్నారు. సరితా రెడ్డి సర్పంచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కఠిన చర్యలు తీసుకొని ఎడల అనేక ఉద్యమాలు వరకాల పరశురాముకు అండగా

నల్గొండ నుంచే పోటీ చేస్తా - ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Image
నల్గొండ నుంచే పోటీ చేస్తా - ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  నల్గొండ : నల్గొండలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్...... ఆయన మాటల్లో... సీటు వచ్చినా ఫీజు రియాంబర్స్ మెంట్ ఇవ్వడం లేదు. ఈ ఏడాది 28మంది విద్యార్థులకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఆర్ధిక సహాయం అందజేశా. 378 కోట్లతో రీటెండర్ వేపించి నాగార్జున సాగర్ హైవే పూర్తి చేయించా. నల్గొండలో వెంకటేశ్వర కాలనీలో కాపాడిన 100కోట్ల స్థలం ఆస్తిలో పార్టీ ఆఫీస్ కట్టారు. గుడి ఉన్న చోట పార్టీ ఆఫీస్ కట్టారు..ఎమ్మెల్యే అయ్యాక పార్టీ ఆఫీస్ మార్పిస్తా. నల్గొండ నుంచే పోటీ చేస్తా... అనుమానం అవసరం లేదు. వేల కోట్ల రూపాయలతో పలు ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించా. సీఎం కెసిఆర్ నాలుగేళ్ల కింద దత్తత తీసుకున్న నల్గొండ నియోజకవర్గంలో ఏడాది లోగా పట్టణంలో 5 వేలు, గ్రామాల్లో 300ఇళ్ల చొప్పున డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించాలి. దత్తత అనే మాటకు అర్ధం తేవాలంటే పేదలకు ఇళ్లు ఇవ్వాలి. రోడ్లు వెడల్పు చేసి బొమ్మలు పెట్టడం కాదు అభివృద్ధి అంటే. జనవరి నుంచి రెగ్యులర్ గా నల్గొండలో పర్యటిస్తా. రాజక

బియ్యం అప్పగించిన మిల్లర్ల కు తక్కువ? డిఫాల్టర్ మిల్లులకు ఎక్కువ?

Image
  బియ్యం అప్పగించిన  మిల్లర్ల కు తక్కువ? డిఫాల్టర్ మిల్లులకు ఎక్కువ? సూర్యాపేట కస్టమ్ మిల్లింగ్ లో డిఫాల్టర్ అయిన రైస్ మిల్లర్ల భాగోతం పై  గత నెల రోజులుగా వార్తలు  వస్తూనే ఉన్నాయి. కొన్ని మిల్లున్లు తనిఖీ చేసి అధికారులు సీజ్ చేశారని అందులో ధాన్యం నిలువలు లేవని వార్తలు గుప్పుమన్నాయి.  బియ్యం ప్రభుత్వానికి అప్పగించిన మిల్లర్ల కు తక్కువ అలాట్ మెంట్ చేసి డిఫాల్టర్లు అయిన వారికి ఎక్కువ కేటాయింపులు జగతున్నాయని మిల్లర్లు లాభోదిబోమంటూన్నారు.  ఈ విషయాన్ని గూఢచారి గతం లో డిఫాల్టర్లకే ఎక్కువ ధాన్యం  కేటాయింపు లంటూ వార్త ప్రచురించింది.  గూఢచారి వార్తను నిజం చేస్తూ  డిఫాల్టర్ల అయిన మిల్లర్లు కు ఎక్కువ కేటాయింపులకు అధికారులు పూనుకున్నారని సమాచారం. గతం లో బియ్యం ప్రభుత్వానికి ఇవ్వలేదని సూర్యాపేట జిల్లా లోని  5 మిల్లులకు కేటాయింపులు జరపలేదు.  మళ్ళీ అధికారులు ప్యాడి పర్చేసింగ్ సెంటర్ లకు ధాన్యం ఎక్కువ వస్తుందని సాకుతో  ఒక వైపు ఆ 5 మిల్లులకు కేటాయింపు లు రంగం సిద్ధం చేశారని భోగట్టా.  ఇంకో వైపు బహిరంగం మార్కెట్ లో మద్దతు ధర కన్న ఎక్కవ ఉండడం తో రైతులు  బహిరంగ మార్కెట్ లో అమ్ముకుంటున్నారని పేపర్ స్టేట్మ

నల్లగొండలో అయ్యప్ప నగరోత్సవం ను డీజేకు అనుమతి లేదని ఆపిన పోలీసులు...

Image
 నల్లగొండలో అయ్యప్ప నగరోత్సవం ను డీజేకు అనుమతి లేదని  ఆపిన  పోలీసులు... రామగిరి అయ్యప్ప దేవాలయంలో మండల పూజలలో భాగంగా ఈ రోజు మధ్యాహ్న మహా పడిపూజ నిర్వహించారు ..  అనంతరం రాత్రి నగరోత్సవం నిర్వహిస్తున్నారు .. ఊరేగింపు ప్రారంభమైన కొద్దిసేపటికే డీజే కు అనుమతి లేదంటూ  30 నిమిషాలు ఆపిన  టూ టౌన్ పోసులు...  దీంతో నిలిచి పోయిన దేవుని రథయాత్ర...  ఆ తరువాత కొంతమంది పెద్దలు కలుగ చేసుకోవడంతో డీజే కి అనుమతి ఇవ్వడంతో కొనసాగిన దేవుని రథయాత్ర..

*న‌వీన్ రెడ్డివి అన్ని అబ‌ద్దాలే.. అత‌నితో పెళ్లి కాలేదు : వైశాలి*

Image
 న‌వీన్ రెడ్డివి అన్ని అబ‌ద్దాలే.. అత‌నితో పెళ్లి కాలేదు : వైశాలి* రంగారెడ్డి జిల్లా ఆదిభ‌ట్ల పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని మ‌న్నెగూడ‌కు చెందిన ఓ యువ‌తిని కిడ్నాప్ చేసిన ఘ‌ట‌న‌ తెలంగాణ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం విదిత‌మే. అయితే ఈ కిడ్నాప్ వ్య‌వ‌హారంలో నిన్న‌టి నుంచి గంట‌కో గంట‌కో విష‌యం వెల్ల‌డైంది. బాధితురాలి త‌ల్లిదండ్రులు, కిడ్నాప్ చేసిన న‌వీన్ రెడ్డి కుటుంబ స‌భ్యులు ప‌లు ర‌కాలుగా స్పందించారు. ఎట్ట‌కేల‌కు కిడ్నాప్ అయిన డెంట‌ల్ డాక్ట‌ర్ వైశాలి శ‌నివారం రాత్రి మీడియా ముందుకు వ‌చ్చారు. *వైశాలి మాట‌ల్లోనే..* నిన్న మా ఇంటికి వ‌చ్చిన న‌వీన్ రెడ్డి గ్యాంగ్‌.. బ‌ల‌వంతంగా న‌న్ను లాక్కెళ్లారు. మా అమ్మ‌నాన్న‌తో పాటు ఇత‌రుల‌పై దాడి చేశారు. ఓ పది మంది న‌న్ను ఇంట్లో నుంచి లాక్కెళ్లి కారులో తోసేశారు. కారులో న‌వీన్ రెడ్డితో పాటు మొత్తం ఆరుగురు ఉన్నారు. హెల్ప్ హెల్ప్ అని గ‌ట్టిగా అరిచాను. అరిస్తే మీ నాన్న‌ను అక్క‌డ చంపేస్తామ‌ని బెదిరించారు. కారులో న‌న్ను న‌వీన్ రెడ్డి ఘోరంగా ట్రీట్ చేశారు. దారుణంగా ప్ర‌వ‌ర్తించాడు. *ఆ రోజు ఆర్మీ కాలేజీలో ఉన్నాను..* అయితే న‌వీన్ రెడ్డికి, త‌న‌కు పెళ్లి అయింద‌

ఫోర్జరీ డాకుమెంట్స్ తో డ్రగ్ లైసెన్స్?

Image
ఫోర్జరీ డాకుమెంట్స్ తో డ్రగ్ లైసెన్స్? నల్గొండ: నల్గొండ బస్టాండ్ దగ్గర లో ఒక మెడికల్  షాప్ యజమాని ఫోర్జరీ డాకుమెంట్ తో డ్రగ్  లైసెన్స్ పొందినట్లు సమాచారం.   సెలూన్ కొరకు షాప్ ను లీజ్ కు తీసుకుని   లీజ్  డాకుమెంట్స్ లో సెలూన్ అనే దగ్గర మెడికల్ షాప్ కొరకు అని ఫోర్జరీ చేసి డ్రగ్ లైసెన్స్ పొందినట్లు సమాచారం. ఈ మెడికల్ షాప్ సంస్థలో ఉన్న ఇద్దరు పార్టనర్స్ మధ్య విభేదాలు రావడం తో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. దీనితో  అధికారులు  డ్రగ్ లైసెన్స్ ను రద్దు చేసినట్లు మరియు లీజ్ ఇచ్చిన  ఆర్టీసీ షాప్ లీజ్ ను రద్దుచేసిందని తెలియ వచ్చింది.  ఇంత జరిగినా మళ్ళీ ఆ ఫోర్జరీ  చేసిన వారు అధికారులను  ప్రసన్నం చేసుకొని    షాప్  లీజ్ తీసుకొని మరియు డ్రగ్ లైసెన్స్ పొందెదుకు పైరవీలు చేస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఈ విషయం పై వివరణ కొరకు  డ్రగ్ ఇన్స్పెక్టర్ కు   ఫోన్  చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మేసెజ్  చేస్తే దానికి బదులు ఇవ్వలేదు.

బి ఆర్ ఎస్ అధికారిక పత్రాలపై సంతకాలు చేసిన కేసీఆర్

Image
బి ఆర్ ఎస్ అధికారిక పత్రాలపై సంతకాలు చేసిన కేసీఆర్ హైదరాబాద్ :  నేడు భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ జెండాను ఆవిష్కరించి, అధికారిక పత్రాలపై సంతకాలు చేసి,తెలంగాణ భవన్ లో సమావేశం నిర్వహించిన పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్.తెలంగాణ భవన్లో జరిగిన  ఈ కార్యక్రమాలలో ముఖ్యనేతలతో కలిసి పాల్గొన్న తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి 

ఈ హస్టల్లో విద్యార్థులే వంటమనుషులు

Image
  ఈ హస్టల్లో విద్యార్థులే వంటమనుషులు నల్గొండ: నల్గొండ పట్టణం  బోయవాడ లోని ఓ హాస్టల్లో విద్యార్థులే వంట చేస్తున్న దృశ్యాలు మా ప్రతినిధి కి కనిపించింది.  ఈ హాస్టల్లో విద్యార్థులు రోజు  వంటపాత్రాలు శుభ్రం చేయడం, చెపాతీలు చేయడం వంట మనిషికి  సహాయం చేయడం ఆనవాయితీగా మారింది. ఈ హాస్టల్ కు  ఇద్దరు వంటమానుషులు ఉన్నప్పటికీ ఒక వంట మనిషిని ఓ జిల్లా అధికారి ఇంట్లో పని చేయడానికి అధికారులు పురమాయుంచినట్లు సమాచారం. ఆ వంట మనిషిని అధికారులు హాస్టల్ కు పంపితే విద్యార్థుల కష్టాలు గట్టుఎక్కుతాయి. అధికారులకు దయ కలగాలి మరి చూద్దాం ఏమిజరుగుతుందో.

ఈ రాష్ట్రాన్ని సక్కదిద్దే సత్తా లేని కేసీఆర్ దేశాన్ని బాగు చేస్తా అంటుండు - ఈటెల

Image
  ఈ రాష్ట్రాన్ని సక్కదిద్దే సత్తా లేని కేసీఆర్  దేశాన్ని బాగు చేస్తా అంటుండు - ఈటెల నల్గొండ నియోజకవర్గం లో  *ప్రజాగోస - బీజేపీ భరోసాయాత్ర* బైక్ ర్యాలీ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా హాజరైన  బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్..ఈటెల రాజేందర్ కి ఘన స్వాగతం పలికిన బిజెపి శ్రేణులు... పానగల్లు లోని పచ్చల సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈటెల... అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో *ప్రజా గోస బీజేపీ భరోసా* యాత్రలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించే బైక్ ర్యాలీ ప్రారంభిచిన ఈటెల రాజేందర్... *ఈటెల కామెంట్స్....* ఆయన మాటల్లో కేసీఆర్ ప్రభుత్వం 2018 ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేస్తూ సమస్యల పరిష్కారాన్ని పక్క దోవ పట్టిస్తుంది  కేసీఆర్ ఎన్ని అబద్ధపు మాటలు చెప్పిన  మాటలు నమ్మే పరిస్థితి లేదు ఈ రాష్ట్రాన్ని సక్కదిద్దే సత్తా ఆయనకు లేదు గాని దేశాన్ని బాగు చేస్తా అంటుండు సురక్షితంగా సుభిక్షంగా పాలించే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని గుజరాత్ ఎన్నికలు మరోసారి నిరూపించాయి తెలంగాణలో సమస్యల