Skip to main content

బీజేఆర్ నగర్‌ ప్రభుత్వ పాఠశాలను దుస్థితిఫై ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌ ఫైర్



 బీజేఆర్ నగర్‌ ప్రభుత్వ పాఠశాలను దుస్థితిఫై ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌ ఫైర్


హైదరాబాద్, జులై 25: ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బీజేఆర్ నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గత 15 రోజులుగా వరద ముంపుకు గురైంది. వందలాది మంది విద్యార్థులు చదువుకునే ఈ పాఠశాల లో మోకాల్లోతు నీరు వచ్చి చేరిన.. ఒక్కసారి కూడా అధికారులెవరూ వచ్చిపాఠశాలలో ఉన్న నీరు బయటకు పోయేలా చర్యలు తీసుకపోవడం పట్ల ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు.


పాఠశాలలోని గదులతో సహా ఆవరణ మొత్తం మోకాల్లోతు నీటితో నిండిపోయింది. ఇంత దారుణమైన పరిస్థితి నెలకొని ఉన్నప్పటికీ దీనిని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ మరియు విద్యాశాఖ అధికారులపై పట్టించుకోకపోవడం ఫై  డాక్టర్ దాసోజు శ్రవణ్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కనీసం సొయా ఉందా అని ప్రశ్నించారు. మీ నియోజకవర్గం లో గత రెండువారాలుగా ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా నీరు ఉంటె మీరు ఏంచేస్తున్నారు..? పంపులు పెట్టించి ఈ వాటర్ ను తీసేయొచ్చు..ఒకవేళ నాలా ఔట్లెట్ లేకపోతే.. దానిని ఏర్పటు చేయొచ్చు.. GHMC అధికారులుకానీ , స్థానిక నేతలు కానీ , విద్యాశాఖ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపనపోలేదంటే..ఈ ప్రభుత్వానికి పేదవాడి చదువు ఫై ఎంత శ్రద్ద ఉందనేది అర్థమైపోతుందని శ్రావణ్ నిప్పులు చెరిగారు.


ఇది గోదావరి నది ఒడ్డున మునిగిన కాళేశ్వరం పంపుహౌస్ కాదు , హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ ఫిలిం నగర్ లో బడా వ్యక్తులు , కోటీశ్వరులు నివాసం ఉండే ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల దుస్థితి ఇది. రోజుకూలి పని చేసుకుంటూ.. తమ పిల్లలను ప్రవైట్ స్కూల్స్ లలో చదివించలేని నిరుపేద వారు..ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే..ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వారిని చులకనగా చూస్తుందని శ్రావణ్ వాపోయారు. గత 15 రోజులుగా స్కూల్ లో మోకాల్లోతు నీళ్లు ఉన్న పట్టించుకోకుండా ఉన్నారంటే ఈ ప్రభుత్వ తీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు అన్నారు.  టిఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా నాశనమైంది. సుమారు 20,000 టీచర్ పోస్టులు, 12,600 విద్యా వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటికీ నియామకాలు జరపడం లేదు.. ప్రభుత్వ పాఠశాలలకు బుక్స్ పంపిణి చేయడం లేదు..మధ్యాహ్న భోజన పథకము అమలు చేయడం లేదు. పాఠశాల విద్యార్థులకు డ్రెస్ లు పంపిణి చేయడం లేదని శ్రవణ్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు.  


ఓక్రిడ్జ్, డిపిఎస్ వంటి అంతర్జాతీయ పాఠశాలలను ప్రభుత్వం ఆదరించి ప్రోత్సహిస్తోంది.  కానీ పేద SC, ST, BCలు మరియు మైనారిటీల వర్గాల విద్యార్థులను బతికించే ప్రభుత్వ పాఠశాలలను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.  కోటేశ్వర్లు ,రాజకీయ నేతలు , బడా బాబులు ఉండే ఈ ప్రాంతంలోని ప్రభుత్వ స్కూల్ పరిస్థితి ఇలా ఉంటె.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏమిటి? ముఖ్యమంత్రి నిద్రపోతున్నారా? విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు. 15 రోజులుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతుండగా వారిని సందర్శించే సమయం లేదా.. కనీసం పాఠశాల నుండి నీరు బయటకు తీసే తీరిక లేదా..? ప్రభుత్వ పాఠశాలల పట్ల సీఎం, విద్యాశాఖ మంత్రికి ఉన్న నిబద్ధత ఇదేనా? అంటూ శ్రవణ్ నిలదీశారు. నీరు నిలిచిన ఆవరణలో తిరుగుతూ అధికార నేతలను , స్థానిక ఎమ్మెల్యే ను , కార్పొరేటర్లను ప్రశ్నించారు. ఈ పాఠశాలలో వర్షం నీరు చేరడం ఇదే మొదటిసారి కాదు.. వర్షాకాలంలో ఇది నిత్యకృత్యం.  పది నిమిషాల వర్షం పడితే పాఠశాలలో మోకాల్లోతు నీరు చేరాల్సిందే. దీనిని పరిష్కరిద్దామనే ఆలోచనే చేయడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌గానీ, డీఈవోగానీ పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం నిరాశాజనకంగా ఉంది. నీటి ఎద్దడి కారణంగా పాఠశాలను 15 రోజులుగా మూసివేయడం తో విద్యార్ధులు చదువుకు దూరమయ్యారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు రాజకీయాలపై వ్యాపారాలఫై ఉన్న శ్రద్ద.. పేద పిల్లలకు చదువు చెప్పే ప్రభుత్వ పాఠశాలల ఫై లేదన్నారు.

 

పేద పిల్లల చదువులు, సాధికారతలపై సీఎం కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలకు ఏమాత్రం పట్టింపు లేదన్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు..? 15 రోజులుగా సమస్య కొనసాగుతూ పాఠశాలలు మూతపడుతున్నా డీఈవో ఎందుకు చర్యలు తీసుకోలేదు..? విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల ఉన్నతాధికారుల అవకతవకలను ఎత్తిచూపుతూ డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌పై మండిపడ్డారు. రేపటి నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నందున, అధికారులు వెంటనే పాఠశాలలోని నీటిని తీసివేయాలి అని డాక్టర్ దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు.

 

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్