Posts

Showing posts from June, 2026

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన

Image
IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన హైదరాబాద్, జూన్ 27: ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ (IVF) తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ జనరల్ సెక్రటరీగా ఉన్న పబ్బా చంద్రశేఖర్, మహిళా విభాగం అడ్వైజర్‌గా ఉన్న ఆయన సతీమణి పబ్బా స్వప్నలను వారి పదవుల నుంచి తొలగించినట్లు అధికారికంగా ప్రకటించింది. శనివారం (జూన్ 27, 2026) నుంచి అమల్లోకి వచ్చేలా వారిని సంస్థ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగించినట్లు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయం రాష్ట్ర గవర్నింగ్ బాడీ తీర్మానం మేరకు "కొన్ని అనివార్య కారణాల వల్ల" తీసుకున్నట్లు వెల్లడించింది.  అంతేకాకుండా, పబ్బా చంద్రశేఖర్‌ను IVF బెనారస్ ఆనంద నిలయం–వారణాసి మేనేజింగ్ ట్రస్టీ, అలాగే వాసవి ఆనంద నిలయం–తిరుపతి ఆర్గనైజింగ్ సెక్రటరీ బాధ్యతల నుంచి కూడా తొలగించినట్లు తెలిపింది. ఈ ప్రకటనపై సెంట్రల్ కమిటీ ఛైర్మన్ అడ్వైజరీ బోర్డ్ గంజి రాజమౌళి గుప్తా, IVF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా సంతకాలు చేశారు.

జూలై 9న వర్కింగ్ జర్నలిస్టుల మహాసభ - జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి, విష్ణు

Image
  జూలై 9న వర్కింగ్ జర్నలిస్టుల మహాసభ  - జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి, విష్ణు సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టియుడబ్ల్యూజేఐజేయు) మహాసభ వచ్చే నెల 9వ తేదీన సంగారెడ్డి లోని టీఎన్జీవో భవన్ లో జరుగుతుందని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా అర్హులైన వారికి ఇంటి స్థలం తో పాటు హెల్త్ కార్డును ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో కోరుతున్నామని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పటికీ, జర్నలిస్టులకు న్యాయం జరగడం లేదని తెలిపారు. అంతేకాకుండా మిగిలిన వారందరికీ కూడా అక్రిడేషన్ కార్డులను జారీ చేయాల్సిందిగా తమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నామని వివరించారు. ఈ సమస్యలన్నింటిపై చర్చించడానికి జిల్లా మహాసభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని అన్నారు. జూలై 9న ఉదయం 11 గంటలకు మహాసభ ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఏ కే పైసల్ తో పాటు సంఘం రాష...

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశంలో అన్ని ఎజెండా అంశాలకు ఆమోదం - సీనియర్ ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్

Image
  తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశంలో అన్ని ఎజెండా అంశాలకు ఆమోదం - సీనియర్ ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్ హైదరాబాద్, జూన్ 27: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశం శనివారం హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో అధ్యక్షుడు అమరావాది లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ముందుగా గత సమావేశాల తీర్మానాలను ధృవీకరించడంతో పాటు సంస్థ పరిపాలన, సభ్యత్వ విస్తరణ, జిల్లా కమిటీల ఏర్పాటు, మహాసభ భవిష్యత్ కార్యాచరణ, ఆర్థిక వ్యవహారాలు, సేవా కార్యక్రమాలు, సంస్థ బలోపేతానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సమావేశ ఎజెండాలో పొందుపరిచిన మొత్తం 15 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సీనియర్ ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్ తెలిపారు. అలాగే జూలై 4న నిర్వహించనున్న మహాసభ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల ఏర్పాట్లు, సభ్యత్వ నమోదు, జిల్లా కమిటీల బలోపేతం, వివిధ సేవా కార్యక్రమాల అమలుకు సంబంధించిన నిర్ణయాలను కూడా కార్యవర్గం ఆమోదించినట్లు ఆయన వెల్లడించారు. సంస్థ అభివృద్ధి, ఆర్యవైశ్య సమాజ సంక్షేమం, రాష్ట్రవ్యాప్తంగా మహాసభ కార్యకలాపాల విస్తరణకు ఈ సమ...

*డ్రగ్స్‌పై యుద్ధానికి నల్గొండ పరుగులు..!* *2కే రన్‌లో యువతతో కలిసి పరుగెత్తిన కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్*

Image
 *డ్రగ్స్‌పై యుద్ధానికి నల్గొండ పరుగులు..!*   *2కే రన్‌లో యువతతో కలిసి పరుగెత్తిన కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్* *నల్గొండ:* "డ్రగ్ ఫ్రీ నల్గొండ – డ్రగ్ ఫ్రీ తెలంగాణ" లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో  శనివారం నల్గొండలో భారీ 2కే రన్ నిర్వహించారు. ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు జరిగిన ఈ రన్‌లో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ యువతతో కలిసి పరుగెత్తారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు "నో", ఆరోగ్యవంతమైన జీవితానికి "యెస్" అంటూ యువతకు పిలుపునిచ్చారు. డ్రగ్స్ విక్రయాలు, అక్రమ రవాణాపై సమాచారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, సమాజానికి చేటు తెస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తన జీవిత లక్ష్యాలపై దృష్టి సారించాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, మాదకద్రవ్యాల నిర్మూ...

గూఢచారి - జూన్ 2026

Image
  ఈ క్రింది లింక్ టచ్ చేసి గూఢచారి జూన్ 2026 చదవండి https://heyzine.com/flip-book/56c79eec77.html https://heyzine.com/flip-book/56c79eec77.html

*ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం: ఏబీవీపీ*

Image
 *ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం: ఏబీవీపీ*   *ఎంజీయూలో కాగడాల ర్యాలీ నిర్వహించిన ఏబీవీపీ శ్రేణులు*   *నల్గొండ:* పది తొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదవ తేదీన దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయిందని ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీస్ కో కన్వీనర్ మౌనేశ్వర్ చారి పేర్కొన్నారు.  ఎమర్జెన్సీకి నిరసనగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో గురువారం కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మౌనేశ్వర్ చారి మాట్లాడుతూ అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించి రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాసిందని విమర్శించారు. పత్రికా స్వేచ్ఛను అణచివేసి, రాజకీయ ప్రత్యర్థులను అక్రమంగా అరెస్టు చేసి జైళ్లలో నిర్బంధించిందని తెలిపారు.  ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, సమావేశాలు నిర్వహించే హక్కు, ప్రజాస్వామ్య విలువలు ఆ కాలంలో తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన గుర్తు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో వేలాది మంది ప్రజాస్వామ్య పరిరక్షకులు, విద్యార్థి నాయకులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ ...

మత్తు ను చిత్తు చేయండి యువత కు "మాచన" పిలుపు

Image
 మత్తు ను చిత్తు చేయండి యువత కు "మాచన" పిలుపు గంజాయి,డ్రగ్స్ ..ఇలా వివిధ రూపాల్లో లభించే మత్తు పదార్గాలకు అలవాటు కాకుండా యువత తమ బలహీనత ను చిత్తు చేయాలని టుబాకో కంట్రోల్ హీరో అవార్డు గ్రహీత,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్. పిలుపునిచ్చారు. డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. గాంజా చాక్లేట్ ల ను విద్యార్ధుల కు విక్రయించే ముఠా ను పోలీసులు పట్టుకున్న ఉదంతం దరిమిలా..రఘునందన్ మానవీయ కోణంలో స్పందిస్తూ..గాంజా.. మాత్రమే గాక మాదక ద్రవ్యాల నుంచి కూడా రాష్ట్రాన్ని విముక్తి చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారని, ఇది ఓ రకంగా యువత ను ఓ గొప్ప "ఆయుధం"గా.. తమ ను తాము మలచుకునేలా చేస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు.విద్యార్థులు,యువత మత్తు కు లోనై ను నిర్వీర్యం కావటం అవాంఛనీయమన్నారు. ముఖ్యంగా కార్పొరేట్ పాఠాశాల ల్లో చదివే విద్యార్థుల కు అవసరానికి మించి పాకెట్ మనిని వారి తల్లి దండ్రులు ఇవ్వటం కూడా పిల్లలు చెడు అలవాట్ల కు దగ్గర కావడం దోహదపడేలా ఉంటుంది. టీనేజర్స్ సాధారణం గా మత్తు కు బానిస అవుతుంటారు.అందుకే యుక్త వయస్సు...

*ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండేటి రాముపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు*

Image
 *ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండేటి రాముపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు*   *రూ. ఎనభై ఏడు లక్షలకు పైగా అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ* *హైదరాబాద్:* కరీంనగర్ అర్బన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న గుండేటి రాముపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినట్లు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వెల్లడించింది. గురువారం, జూన్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఆరున ఏసీబీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. గుండేటి రాము, వయస్సు నలభై రెండు సంవత్సరాలు, శంకర్ కుమారుడు. ప్రస్తుతం కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. గతంలో వేములవాడ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, ఎస్హెచ్ఓగా పనిచేశారు. అధికారిక పదవిని దుర్వినియోగం చేసి, అక్రమ మార్గాల ద్వారా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై జూన్ ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఆరున ఈ కేసు నమోదు చేశారు. *సోదాల్లో బయటపడ్డ ఆస్తుల వివరాలు:*   అంతకు ముందు మార్చి పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఆరున నిందితుడిపై క్రిమినల్ మిస్‌కండక్ట్ కేసు నమోదైంది. జగిత్యాల భవానీ నగర్‌లోని హౌస్ నంబర్ నాలుగు-రెండు/ఏడు/తొమ్మిది వద్ద ఉన్న నిందితుడి అద్దె ఇంట్లో సోదాలు ...

*సస్పెండ్ అయిన తహసీల్దార్ టి. సుచరితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు*

Image
  *సస్పెండ్ అయిన తహసీల్దార్ టి. సుచరితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు*   *హైదరాబాద్:* లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెండ్ అయిన నెల రోజులకే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సీనియర్ రెవెన్యూ అధికారిణి టి. సుచరితపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ గురువారం, జూన్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఆరున ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, జాయింట్ సబ్-రిజిస్ట్రార్‌గా పనిచేసిన టి. సుచరిత, ముప్పై ఎకరాల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే నాలా కన్వర్షన్ దరఖాస్తును ప్రాసెస్ చేసి ఆమోదించేందుకు ఎకరానికి రూ. లక్ష చొప్పున లంచం డిమాండ్ చేశారు. ఈ కేసులో ఆమెతో పాటు ఆమె డ్రైవర్ వి. నాగేష్ కూడా పట్టుబడ్డారు. గురువారం ఏసీబీ అధికారులు సుచరితపై మోసం, చీటింగ్ అభియోగాలతో పాటు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని కేసు నమోదు చేశారు. ఆమె నివాసం, మరో మూడు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. *సోదాల్లో బయటపడ్డ ఆస్తులు:*   ఆ సోదాల్లో రూ. పన్నెండు లక్షల నగదు, రూ. కోటి ఇరవై లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు, బ్యాంకు ఖాతాల్లో రూ. ముప్పై ఎనిమిది లక్షలు, ఒక ఫో...

చెత్తబుట్టలో ఉండాల్సినవి డైనింగ్ టేబుల్‌పై..! హైదరాబాద్ రెస్టారెంట్ల అసలు రూపం బహిర్గతం

Image
  చెత్తబుట్టలో ఉండాల్సినవి డైనింగ్ టేబుల్‌పై..! హైదరాబాద్ రెస్టారెంట్ల అసలు రూపం బహిర్గతం హైదరాబాద్, జూన్ 23: నగరంలో బయట భోజనం చేసే వారిని కలవరపెట్టే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు జూన్ నెలలో నిర్వహించిన తనిఖీల్లో పరిశీలించిన రెస్టారెంట్లలో అత్యధిక శాతం సంస్థలు ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. తనిఖీ చేసిన ప్రతి 10 రెస్టారెంట్లలో దాదాపు 9 రెస్టారెంట్లలో అపరిశుభ్రత, కుళ్లిన ఆహార పదార్థాల వినియోగం, కీటకాల సమస్యలు, లైసెన్సింగ్ లోపాలు వంటి తీవ్ర అవకతవకలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. మదీనాగూడలోని అంతేరా రెస్టారెంట్‌లో బూజు పట్టిన కూరగాయలు, పదేపదే ఉపయోగిస్తున్న వంటనూనె, లేబుల్స్ లేని ఆహార పదార్థాలు గుర్తించారు. లులు హైపర్‌మార్కెట్‌లో అపరిశుభ్రత కారణంగా సుమారు 150 కిలోల ఆహారాన్ని అధికారులు నిర్వీర్యం చేశారు. అక్కడ డ్రైనేజీలు బ్లాక్ కావడం, కీటకాలు తిరగడం, గడువు ముగిసిన ఉత్పత్తులు నిల్వ ఉంచడం వంటి లోపాలు కనిపించాయి. మూసాపేటలోని ఉడిపి ఉపహార్‌లో డ్రైనేజీ సమస్యలు, మూతలేని చెత్తబుట్టలు, కీటకాల ఉనికి, గడువు ముగిసిన లైసెన్స్‌తో కార్యకలాపాలు కొనసాగిస్తున...

నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌పై అక్రమాస్తుల కేసు నమోదు

Image
 నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌పై అక్రమాస్తుల కేసు నమోదు ఏసీబీ దాడుల్లో రూ.3 కోట్లకు పైగా ఆస్తులు వెలుగులోకి హైదరాబాద్, జూన్ 23: నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి (ఎక్సైజ్ సూపరింటెండెంట్) కొమ్మూరి మల్లారెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసింది. ఏసీబీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కొమ్మూరి మల్లారెడ్డి తన తెలిసిన ఆదాయ వనరులకు మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో కేసు నమోదు చేశారు. అవినీతి నిరోధక చట్టం-1988 (2018 సవరణ)లోని సెక్షన్ 13(1)(బి) మరియు 13(2) కింద కేసు నమోదు చేసి మంగళవారం ఆయన నివాసంతో పాటు బంధువులు, బినామీలు, అనుబంధ వ్యక్తులకు చెందిన మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో నాలుగు నివాస గృహాలు, ఒక వాణిజ్య భవనం, ఎనిమిది ఓపెన్ ప్లాట్లు, 10.23 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. అదనంగా రూ.3.31 లక్షల నగదు, రూ.50 లక్షల బ్యాంకు నిల్వలు, ఆయన భార్య మరియు కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న మూడు బ్యాంకు లాకర్లు గుర్తించారు. ఈ లాకర్లను దర్యాప్తు సందర్భంగా తెరవనున...

ఆర్టీఐ షాక్: పంచాయతీ కార్యదర్శికి రూ. 20 వేల జరిమానా విధించిన తెలంగాణ సమాచార కమిషన్!

Image
  ఆర్టీఐ షాక్: పంచాయతీ కార్యదర్శికి రూ. 20 వేల జరిమానా విధించిన తెలంగాణ సమాచార కమిషన్! హైదరాబాద్: సమాచార హక్కు చట్టం (RTI) అమలులో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి అధికారైనా మూల్యం చెల్లించుకోక తప్పదని తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ (SIC) మరోసారి స్పష్టం చేసింది. భవన నిర్మాణ అనుమతులపై సకాలంలో సమాచారం అందించని నల్గొండ జిల్లాకు చెందిన ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (PIO) కమ్ పంచాయతీ కార్యదర్శికి కమిషన్ రూ. 20,000 భారీ జరిమానా విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని బాధితుడైన దరఖాస్తుదారునికి నష్టపరిహారంగా చెల్లించాలని, అలాగే కోరిన రికార్డులను తక్షణమే అందజేయాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే..? (పేలుడు పదార్థాల నిల్వ ఆరోపణలు) నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం, ఇర్కిగూడెం గ్రామానికి చెందిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ఓ ప్రైవేట్ కంపెనీ నిర్మించిన భవనాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా 'పేలుడు పదార్థాలను' నిల్వ ఉంచారని, ఇది స్థానిక ప్రజల భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించిందని కె. కృష్ణ అనే వ్యక్తి ఆరోపించారు. ఈ నేపథ్యంలో, సదరు నిర్మాణానికి గ్రామ పంచాయతీ నుండి చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయో...

*జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక డ్రైవ్* *ఒకే రోజు 283 ఆక్రమణలు తొలగింపు*

Image
 *జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక డ్రైవ్*   *ఒకే రోజు 283 ఆక్రమణలు తొలగింపు* *హైదరాబాద్:* పాదచారుల సౌకర్యం, ట్రాఫిక్ సాఫీగా సాగడం మరియు పట్టణ రవాణా మెరుగుదలలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో శనివారం ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ట్రాఫిక్ మరియు లా & ఆర్డర్ పోలీసులతో సమన్వయం చేసుకుని పాదచారుల మార్గాలు, రహదారి అంచులపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. ప్రతి జోన్‌లో ఒక ప్రధాన రహదారిని ఎంపిక చేసి, సంబంధిత సర్కిళ్ల సిబ్బందిని సమీకరించి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్, చీఫ్ సిటీ ప్లానర్ మరియు సంబంధిత జోనల్ కమిషనర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ విభాగం మరియు ఇతర విభాగాల సిబ్బంది ఈ డ్రైవ్‌లో పాల్గొన్నారు. *ఐదు ప్రధాన ప్రాంతాల్లో తొలగింపు* శంషాబాద్ సర్కిల్-18లో ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ నుంచి మిషన్ కంపౌండ్ వరకు 15 శాశ్వత, 56 తాత్కాలిక ఆక్రమణలు తొలగించారు. చార్మినార్ సర్కిల్-29లో ఎస్‌బీఐ బ్యాంక్ నుంచి రిలయన్స్ ట్రెండ్స్ వరకు ఫుట్‌పాత్,...

TGPCBలో పరిశ్రమల భద్రతపై కీలక సమావేశం

Image
  TGPCBలో పరిశ్రమల భద్రతపై కీలక సమావేశం అగ్ని ప్రమాదాల నివారణకు LDAR అధ్యయనంపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్, జూన్ 20 (గూఢచారి): పరిశ్రమల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలను తగ్గించడం, రసాయన లీకేజీలను నియంత్రించడం, వాతావరణ కాలుష్యాన్ని నివారించడం లక్ష్యంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) శనివారం కీలక సమావేశాన్ని నిర్వహించింది. TGPCB సభ్య కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీర్స్ (IIChE) నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ (MoEF) గుర్తింపు పొందిన ప్రయోగశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో Leak Detection and Repair (LDAR) అధ్యయనం ప్రాముఖ్యత, పరిశ్రమల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాల కారణాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. IIChE నిపుణులు మాట్లాడుతూ ప్రతి పరిశ్రమలో అర్హత కలిగిన సాంకేతిక సిబ్బంది ఉండాలని, రసాయనాల నిర్వహణ, లీకేజీల గుర్తింపు, నియంత్రణ, అలాగే Volatile Organic Compounds (VOCs) వాతావరణంలోకి విడుదల కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉద్యోగులకు నిరంతర శిక్షణ ఇవ్వాలని సూచించారు. అలాగే...

చార్మినార్‌లో అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం; కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం*

*చార్మినార్‌లో అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం; కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం* హైదరాబాద్, జూన్ 19, 2026: ఆహార కల్తీ మరియు అసురక్షిత ఆహార పద్ధతులపై నిరంతర నిఘాలో భాగంగా, హెచ్-ఫాస్ట్ (హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్) బృందం, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO)తో కలిసి చార్మినార్‌లోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక ఫాస్ట్ ఫుడ్ గోదాముపై ఆకస్మిక దాడి నిర్వహించింది. నమ్మకమైన సమాచారం మేరకు, ఈ బృందం చార్మినార్‌లోని పంచ్ మొహల్లా, న్యూ లాడ్ బజార్‌లో ఉన్న ‘మెసర్స్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’ ప్రాంగణాన్ని తనిఖీ చేసింది. ఈ తనిఖీలో, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే విధంగా అత్యంత అపరిశుభ్రమైన మరియు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆహార పదార్థాలను తయారు చేయడం మరియు నిల్వ చేయడం జరుగుతున్నట్లు గుర్తించారు. • నిర్బంధ FSSAI లైసెన్స్ లేకుండా నిర్వహించడం. • నిషేధించబడిన/కృత్రిమ ఆహార రంగులను (MSK లయన్ గ్రీన్ మరియు రాస్ప్‌బెర్రీ రెడ్) ఉపయోగించడం. • పాడైపోయిన మరియు ప్రమాదకరమైన వంట నూనెను పదే పదే ఉపయోగించడం. • నీటి విశ్లేషణ ధృవీకరణ (Wat...

మేడిపల్లి లేఅవుట్ ప్రీ-బిడ్ సమావేశానికి భారీ స్పందన

Image
 *మేడిపల్లి లేఅవుట్ ప్రీ-బిడ్ సమావేశానికి భారీ స్పందన*   *200 మందికి పైగా భావి బిడ్డర్ల హాజరు* *హైదరాబాద్:* హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో ప్రతిపాదిత మేడిపల్లి లేఅవుట్‌కు సంబంధించి 16.6.2026న ప్రాజెక్టు స్థలంలో ప్రీ-బిడ్ సమావేశం విజయవంతంగా నిర్వహించబడింది.  ఈ సమావేశానికి 200 మందికి పైగా భావి బిడ్డర్లు ఉత్సాహంగా హాజరై, 24.6.2026న జరిగే ఈ-వేలంపై విశేష ఆసక్తిని వ్యక్తం చేశారు. సమావేశంలో హెచ్‌ఎండీఏ అధికారులు, నిపుణులు బిడ్డర్ల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. డిప్యూటీ కలెక్టర్ వై. సుదర్శన్ మేడిపల్లి లేఅవుట్ ముఖ్యాంశాలను వివరించగా, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఎ. రవీందర్ రెడ్డి లేఅవుట్ ప్రణాళికా అంశాలు, అభివృద్ధి ప్రతిపాదనలపై స్పష్టత ఇచ్చారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. సత్యప్రసాద్ స్థలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించి, సాంకేతిక సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఈ-వేలం ప్రక్రియ, నమోదు విధానం, బిడ్డర్ల భాగస్వామ్య మార్గదర్శకాల గురించి ఎంఎస్‌టీసీ ప్రతినిధి సిద్ధార్థ్ వివరించారు.  కేపీఎంజీ ప్రతినిధి కళ్యాణ్ మేడిపల్లి లేఅవుట్ ప్రత్యేకతలు,...

ఘనంగా రావికంటి రామయ్య జయంతి

Image
 ఘనంగా రావికంటి రామయ్య జయంతి ... మంథని : మంత్రకూట వేమన, ప్రజాకవి,  రావికంటి రామయ్య గుప్త 90వ జయంతి  వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి.‌ మంథనిలోని వారి కాంస్య విగ్రహానికి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మంథని మున్సిపల్ ఛైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు శశి భూషణ్ కాచే, ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి కొమురవెల్లి విజయ్ కుమార్, ఆర్య వైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు ఎల్లంకి వంశీధర్ , రావికంటి రామయ్య తనయుడు, సీనియర్ జర్నలిస్ట్ రావికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.‌ అనంతరం మంథని విద్యార్థి యువత వ్యవస్థాపకుడు కొండేల మారుతి ఆధ్వర్యంలో రావికంటి రామయ్య గుప్త సంస్మరణ సభ జరిగింది. ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల నియమితులైన కొమురవెల్లి విజయ్ కుమార్ ను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.‌  ... రామయ్య కీర్తి అజరామరం : మున్సిపల్ ఛైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్  ... కవిత్వం, సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్య పరిచిన రావికంటి రామయ్య కీర్తి అజరామరంగా నిలిచిపోతుందని మంథని మున్సిపల్ ఛైర్మన్ ఒడ్నాల శ్రీ...

“వీరి వీరి గుమ్మడి పండు... వీరి పేరు ఏమి?” – TGPCBలో ‘ఎక్కడి వాళ్లు అక్కడే గప్ చుప్' డిప్యుటేషన్‌ల ఆట మళ్లీ మొదలా?

Image
“వీరి వీరి గుమ్మడి పండు... వీరి పేరు ఏమి?” – TGPCBలో ‘ఎక్కడి వాళ్లు అక్కడే గప్ చుప్'  డిప్యుటేషన్‌ల ఆట మళ్లీ మొదలా? ట్రాన్స్‌ఫర్లు ఒక వైపు... డిప్యుటేషన్లు మరో వైపు! తెలంగాణ పీసీబీలో అక్రమ డిప్యుటేషన్‌లకు సర్వం సిద్ధమనే ప్రచారం! హైదరాబాద్: “వీరి వీరి గుమ్మడి పండు... వీరి పేరు ఏమి?” అనే పాటలో చివరి చరణం “ఎక్కడి వాళ్లు అక్కడ గప్ చుప్"  అన్నట్లుగా, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB)లో బదిలీలు జరిగినా కొందరు ఉద్యోగులు, అధికారులు మళ్లీ తమకు అనుకూల ప్రాంతాలకే డిప్యుటేషన్‌ల ద్వారా చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా డిప్యుటేషన్ అనేది శాఖ అవసరాల కోసం, ప్రత్యేక నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరమైనప్పుడు మాత్రమే ఇవ్వాల్సిన పరిపాలనా విధానం. కానీ TGPCBలో మాత్రం కొందరి వ్యక్తిగత అవసరాలు, పలుకుబడులు, పరిచయాల ఆధారంగా డిప్యుటేషన్‌లు జరుగుతున్నాయనే విమర్శలు ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతంలో GHMC పరిధిని ఒకే యూనిట్‌గా పరిగణిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పలువురిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. అయితే ఆ తర్వాత కొందరు ప్రభావశీలులు అడ్మినిస్ట్రేషన్...

ఆర్&బి ఈఈ సంధ్య అక్రమాస్తులపై ఏసీబీ విచారణ జరపాలి: సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ డిమాండ్

Image
 ఆర్&బి ఈఈ సంధ్య అక్రమాస్తులపై ఏసీబీ విచారణ జరపాలి: సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ డిమాండ్ ఈఎన్‌సీ మోహన్ నాయక్ నివాసాలపై ఏసీబీ దాడులను స్వాగతిస్తున్నాం ఒకే జిల్లాలో 20 ఏళ్లుగా తిష్టవేసిన సంధ్య అవినీతిపై పోరాడుతాం మహబూబ్‌నగర్ కలెక్టరేట్, కళాభారతి పనులపై విజిలెన్స్ విచారణ జరపాలి మహబూబ్‌నగర్ (జిల్లా కేంద్రం): తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ (R&B) ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ) మోహన్ నాయక్ ఆస్తులపై ఏసీబీ అధికారులు నిర్వహించిన మెరుపు దాడులను స్వాగతిస్తున్నామని 'నేనుసైతం' స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మియాపూర్‌లోని ఈఎన్‌సీ మోహన్ నాయక్ నివాసంతో పాటు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టడం హర్షణీయమన్నారు. ఇదే తరుణంలో, మహబూబ్‌నగర్ జిల్లా ఆర్&బి శాఖలో గత 20 సంవత్సరాలుగా ఇక్కడే తిష్టవేసి పనిచేస్తున్న ఈఈ (EE) సంధ్య ఆస్తులపై కూడా సమగ్ర ఏసీబీ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. నిబంధనలకు విర...

తెలంగాణ: రోడ్లు భవనాల శాఖ ఈఎన్‌సీ జే. బాలు నివాసాలపై ఏసీబీ మెరుపు దాడులు!

Image
  తెలంగాణ: రోడ్లు భవనాల శాఖ ఈఎన్‌సీ జే. బాలు నివాసాలపై ఏసీబీ మెరుపు దాడులు! ​ హైదరాబాద్: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ (R&B) చీఫ్ ఇంజనీర్ (ఇంజినీర్ ఇన్ చీఫ్) జే. బాలు ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోదాలు నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో అధికారులు ఈ తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. ​11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు ​మాదాపూర్‌లోని జే. బాలు ప్రధాన నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు సంబంధించిన మొత్తం 11 ప్రాంతాలలో ఏసీబీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. బాలు అక్రమ ఆస్తుల సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ​భారీగా లభ్యమైన నగదు, బంగారం, విదేశీ మద్యం ​సోదాల సందర్భంగా బాలు నివాసంలో అధికారులు షాకింగ్ విషయాలను గుర్తించారు. ఇప్పటివరకు జరిపిన తనిఖీలలో కళ్ళు చెదిరేలా ఆస్తులు బయటపడ్డాయి: ​ నగదు: కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు. ​ బంగారం: భారీగా బంగారు బిస్కెట్లు, ఆభరణాలు. ​ వెండి: పెద్ద మొత్తంలో వెండి వస్తువులు. ​ లిక్కర్: నిబంధనలకు విరుద్...

"హీరో"అవార్డు ఓ అద్భుతం..అతిశయం

Image
 "హీరో"అవార్డు  ఓ అద్భుతం..అతిశయం నేషనల్ టుబాకో కంట్రోల్ "హీరో" అవార్డ్ గ్రహీత. మాచన రఘునందన్ మాతృమూర్తి "విజయ" ప్రత్యేక ఇంటర్వ్యూ  "అమ్మా..! డిల్లీ నుంచి ఓ పార్సెల్ వస్తుంది.తీసుకో..మళ్లీ అది వాపస్ పోతే రావడం కష్టం. అని మా అబ్బాయి చెప్తే.. ఏదో.. కవర్,చిన్న పార్సిల్ వస్తుందేమో అనుకున్నా..కాని  ఓ నగల పెట్టే లా..బరువు ఉన్న బాక్స్ వస్తుంది అని అనుకోలేదు. అత్యంత భద్రంగా.. ఏదో విలువైనది ఇందులో ఉన్నది అనుకునేలా.. బందబస్త్ పార్సెల్ వచ్చింది. "రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తరం అందుకోవడం అంత సామాన్య విషయమా?!" నా..బిడ్డ దేశం కోసం ఆలోచించడం.దేశం కోసం ఏదైనా మేలు చేయాలి అని క్షణ క్షణం ఆలోచిస్తేనే కదా..అసాధారణ విజయం సొంతం అయ్యేది. అని.. తన తనయుడు చేసిన  అలుపెరుగని కృషి గురించి ఎంతో ఆర్ద్రంగా వివరించారు మాచన విజయ. ఇన్నాళ్ళకు జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో  అద్భుత ఫలితం రావడం మాకు పద్మ పురస్కారమే అన్నారు "మాచన" మాతృమూర్తి. మరిన్ని వివరాలు..ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో.. మాచన విజయ మాటల్లోనే.. "ఎంత సంపాదించాము. ఎంత కూడబెట్టుకున్నాం అని ఆలోచించే కొందర...

*"పర్యావరణ దినోత్సవం రోజే పర్యావరణ విధ్వంసంపై వినతి": మంత్రి కొండా సురేఖకు అంతమ్మ గూడెం బాధితుల ఆగ్రహ పత్రం - TGPCB నిర్లక్ష్యంపై నిప్పులు*

Image
  *"పర్యావరణ దినోత్సవం రోజే పర్యావరణ విధ్వంసంపై వినతి": మంత్రి కొండా సురేఖకు అంతమ్మ గూడెం బాధితుల ఆగ్రహ పత్రం - TGPCB నిర్లక్ష్యంపై నిప్పులు* *గుడాచారి.పేజ్ | ప్రత్యేక కథనం*  *హైదరాబాద్, అక్టోబర్ 18, 2026:* ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలు జరుగుతున్న PCB కార్యాలయం గేటు దగ్గర పర్యావరణ విధ్వంసంపై వినతి పత్రం అందుకున్నారు మంత్రి కొండా సురేఖ.  "మొదటి ప్రపంచ యుద్ధంలో శత్రువులను చంపడానికి వాడిన పాస్జీన్ వాయువును ఇప్పుడు మా ఊరి గాల్లో వదులుతున్నారు" అంటూ యాదాద్రి జిల్లా అంతమ్మ గూడెం గ్రామస్తులు మంత్రికి నేరుగా మొరపెట్టుకున్నారు. *పర్యావరణ దినోత్సవం నాడే నిరసన గళం* జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా TGPCB సనత్‌నగర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకు, అంతమ్మ గూడెం గ్రామస్తులు నేరుగా వినతి పత్రం అందజేశారు. "పర్యావరణాన్ని కాపాడతాం అని వేదికలపై ప్రసంగాలు చేస్తున్న రోజే, మా ఊరిని విషపు గ్యాస్ ఛాంబర్‌గా మార్చిన వైనాన్ని మీ దృష్టికి తెస్తున్నాం" అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. *గాల్లో విషం, నేలలో...

ఆన్‌లైన్ ఫార్మసీలపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కొరడా

Image
  ఆన్‌లైన్ ఫార్మసీలపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కొరడా రాష్ట్రవ్యాప్తంగా 166 మెడికల్ షాపుల తనిఖీలు.. 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు గూఢచారి.పేజీ కోసం వార్తా కథనం: హైదరాబాద్, జూన్ 7: తెలంగాణలో ఆన్‌లైన్ ఫార్మసీలతో అనుబంధంగా పనిచేస్తున్న మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. జూన్ 6న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 166 మెడికల్ షాపులను అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా ఆన్‌లైన్ మందుల డెలివరీ సేవలకు సంబంధించిన లైసెన్స్ కలిగిన కేంద్రాలు, భాగస్వామ్య ఫార్మసీలు కలిపి 159 దుకాణాలు, అలాగే ఆన్‌లైన్ బీ2బీ ప్లాట్‌ఫారమ్‌లతో అనుబంధంగా ఉన్న 7 మెడికల్ షాపులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో పలు నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. మందుల విక్రయ బిల్లులను నిర్వహించకపోవడం, ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ మరియు షెడ్యూల్-H1 మందుల రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకపోవడం, కొనుగోలు ఇన్‌వాయిస్‌లను చూపించకపోవడం, వైద్యుల చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు విక్రయించడం, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ పర్యవేక్షణ లేకుండా మందు...

*PCB RC పురం ROలో 'సొంత' దందా: ప్రభుత్వ వాహనంతో ఇంటికెళ్తున్న AE... 'పరిశ్రమలతో డైరెక్ట్ డీల్' కోసమే డిప్యుటేషన్ డ్రామా?*

Image
*PCB RC పురం ROలో 'సొంత' దందా: ప్రభుత్వ వాహనంతో ఇంటికెళ్తున్న AE... 'పరిశ్రమలతో డైరెక్ట్ డీల్' కోసమే డిప్యుటేషన్ డ్రామా?* *గుడాచారి.పేజ్ | ఎక్స్‌క్లూజివ్*  *"హైదరాబాద్ ZOలో కుర్చీ వదిలి, పటాన్చెరుకు పరుగు - కారణం అపరిశ్రమలతో కనెక్షన్' కోసమేనా?" - గుసగుసలు* *పటాన్చెరు, జూన్, 6, 2026:* తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి RC పురం రీజనల్ ఆఫీసులో నిబంధనలకు పాతరేసి 'సొంత' పాలన నడుస్తోందన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న ఓ AE-2 స్థాయి అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. *ప్రభుత్వ వాహనం = సొంత కారు? ఆఫీసు పనులకు వాడాల్సిన ప్రభుత్వ వాహనాన్ని సదరు AE సొంత అవసరాలకు వాడేస్తున్నారని, రాత్రి పూట ఏకంగా ఇంటికే తీసుకెళ్తున్నారని సిబ్బంది గుసగుసలాడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దిష్ట కేడర్ అధికారులకు మాత్రమే వాహనాన్ని నివాసానికి తీసుకెళ్లే అనుమతి ఉంటుంది. ఈ AEకి ఆ అర్హత లేదని సమాచారం. మరి RO గారు ఏం చేస్తున్నట్లు? నిబంధనలు అందరికీ సమానంగా వర్తించవా? RO వెంటనే సరిచూసుకుని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. *'డిప్యుటేషన్...

*“పర్యావరణ పరిరక్షణ నైతిక బాధ్యత” – సనత్నగర్లో మంత్రి కొండా సురేఖ పిలుపు*

Image
*“పర్యావరణ పరిరక్షణ నైతిక బాధ్యత” – సనత్నగర్లో మంత్రి కొండా సురేఖ పిలుపు* *హైదరాబాద్:* “పర్యావరణ పరిరక్షణ ఒక నైతిక బాధ్యత. ప్రతి ఒక్కరూ సుస్థిర పద్ధతులను అవలంబించాలి. మనం మన ప్రకృతి మాతను కాపాడుకోవాలి. అడవుల నరికివేత, వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి, ధాన్యం దిగుబడి తగ్గడం వల్ల ఆకలి పెరగడం వంటివన్నీ గ్లోబల్ వార్మింగ్ కారణంగానే జరుగుతున్నాయి. చికిత్స కన్నా నివారణే మేలు”   ఇదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సనత్నగర్లోని TGPCB ప్రధాన కార్యాలయంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రి *శ్రీమతి కొండా సురేఖ* చేసిన వ్యాఖ్యలు. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది ఇతివృత్తంగా ప్రకటించిన *“వాతావరణ చర్య”*పై ఆమె ప్రజల భాగస్వామ్యం, స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని నొక్కి చెప్పారు. కార్యక్రమానికి EFS&T ముఖ్య కార్యదర్శి *శ్రీ అహ్మద్ నదీమ్*, TGPCB బోర్డు సభ్యులు *సి. సత్యనారాయణ రెడ్డి*, ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్సార్టియం అధ్యక్షురాలు *టి. విజయలక్ష్మి*, JNTU-హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ తదితరులు హాజరయ్యారు. *2047 నాటికి 250 కోట్ల మొక్కలు*   EFS&T ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్ మాట్ల...

రసాయన కాలుష్యంపై అంతమ్మగూడెం వాసుల పోరాటం - స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కు వినతి

Image
  రసాయన కాలుష్యంపై అంతమ్మగూడెం వాసుల పోరాటం  - స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కు వినతి కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని స్పీకర్ హామీ మద్దతుగా నిలిచిన ప్రముఖ పర్యావరణవేత్తలు పురుషోత్తం రెడ్డి, దొంతి నరసింహారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ పరిధిలోని రసాయన పరిశ్రమల వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర కాలుష్య సమస్యలపై "అంతమ్మగూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి" సమరశంఖం పూరించింది. హజేలో తదితర పరిశ్రమల నుండి వెలువడుతున్న రసాయన వ్యర్థాల వల్ల పీల్చే గాలి, త్రాగే నీరు, తినే పంటలు, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయి గ్రామంలో జీవనం అస్తవ్యస్తంగా మారిందని, ఆరోగ్యం క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ సమితి సభ్యులు బుధవారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ గ్రామాన్ని కాలుష్యం బారి నుండి కాపాడాలని వేడుకున్నారు. ప్రముఖ పర్యావరణవేత్తలు కుంభం పురుషోత్తం రెడ్డి, దొంతి నరసింహారెడ్డి ల సహకారంతో స్పీకర్‌కు ఓ సమగ్ర వినతిపత్...

# అంబర్‌పేటలో ఘోరం: మహిళ మెడలోంచి 2.5 తులాల బంగారు గొలుసు అపహరణ!

Image
  ## అంబర్‌పేటలో ఘోరం: మహిళ మెడలోంచి 2.5 తులాల బంగారు గొలుసు అపహరణ! **హైదరాబాద్, జూన్ 2 (గూఢచారి ప్రతినిధి):** రాజధాని నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. పట్టపగలే నివాస గృహాల వద్దే మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం ఓ మహిళ మెడలోంచి దుండగుడు బంగారు గొలుసును లాక్కెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ### అసలేం జరిగిందంటే..? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలనీలోని 'వేదశ్రీ అపార్ట్‌మెంట్‌'లో నివసించే శ్రీమతి రత్నమాల అనే మహిళ మంగళవారం మధ్యాహ్నం బయటకు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేసుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఆమె అపార్ట్‌మెంట్‌ లోపలికి ప్రవేశిస్తున్న సమయంలో, అప్పటికే అక్కడ పొంచి ఉన్న ఒక గుర్తు తెలియని వ్యక్తి కాలినడకన ఆమె వద్దకు వచ్చాడు. సదరు వ్యక్తి రత్నమాలతో మాటలు కలుపుతూ నమ్మించడమే కాకుండా, ఆమె ఏమరపాటుగా ఉన్న సమయాన్ని చూసి ఒక్కసారిగా మెడలోని బంగారు గొలుసును తెంచుకుని వేగంగా పారిపోయాడు. అపహరణకు గురైన గొలుసు బరువు సుమారు **2.5 తులాలు** ఉంటుందని బాధితురాల...

*అమెరికాలో ఘనంగా టీసీఏ వనభోజనాలు, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు*

Image
*అమెరికాలో ఘనంగా టీసీఏ వనభోజనాలు, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు* *కుపర్టినో, కాలిఫోర్నియా, మే 31, 2026:* శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని కుపర్టినోలో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో వార్షిక వనభోజనాలు సమ్మర్ పిక్నిక్, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వందలాది కుటుంబాలు, కమ్యూనిటీ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు. *తెలంగాణ రుచులు అమెరికాలో:*   ఈ వనభోజనాల్లో ఇంటి వంటకాల పాట్‌లక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ నుండి ప్రత్యేకంగా విమానంలో తెప్పించిన సకినాలు అందరినీ అలరించాయి. అక్కడికక్కడే వేడివేడిగా తయారుచేసిన సర్వపిండి, దానితో పాటు నిలోఫర్ స్టైల్ ఇరానీ చాయ్ కాంబినేషన్ పాల్గొన్నవారిని ఎంతగానో ఆకట్టుకుంది. హైదరాబాదీ వంటకాలు, సమోసాలు, ఇతర చిరుతిళ్లతో వేడుకకు తెలంగాణ శోభ సంతరించుకుంది. *వాలంటీర్ల సేవలకు ప్రశంసలు:*   TCA సౌత్ బే నాయకత్వ బృందం అంజనేయులు పి, గోపీకృష్ణ జి, శ్రీధర్ జి లతో పాటు అనంత్ ఎ, అశోక్ సి, భాస్కర్ ఎం, సుధీర్ జి, మాధవ్ కె, రాజ్‌కుమార్ ఎం, సతీష్ ఎ, ఉదయ్ జె, యా...