Posts

Showing posts from July, 2026

ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోవద్దు: వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ యెలిశాల రవి ప్రసాద్

Image
 ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోవద్దు: వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ యెలిశాల రవి ప్రసాద్ నల్గొండ: జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తమ మూలాలను, సమాజాన్ని మర్చిపోవద్దని వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ యెలిశాల రవి ప్రసాద్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తూ మంచి నడవడిక, సంస్కారం అలవర్చుకుని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని సూచించారు. ఈ ఏడాది వైఆర్పీ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 100 మందికి పైగా విద్యార్థులకు రూ.80 లక్షల స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నామని తెలిపారు. ఇందులో నల్గొండ జిల్లాకు చెందిన 41 మంది విద్యార్థులకు రూ.12 లక్షలు పంపిణీ చేసినట్లు చెప్పారు. స్కాలర్‌షిప్‌లను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, అనంతరం తమలాంటి అవసరమైన విద్యార్థులకు సహాయం చేస్తూ సమాజానికి తిరిగి సేవ చేయాలని సూచించారు. చదువుతో పాటు సంస్కారం, మంచి వ్యక్తిత్వం కూడా పెంపొందించుకోవాలని, కుల, మత, వర్గ భేదాలు లేకుండా ఐక్యంగా ఉంటూ అభివృద్ధి సాధించాల...

రూ.50 కోట్లకు పైగా వసూలు చేసి పరార్.. పోలీసులకు బాధితుల ఫిర్యాదు

Image
 రూ.50 కోట్లకు పైగా వసూలు చేసి పరార్.. పోలీసులకు బాధితుల ఫిర్యాదు మల్కాజిగిరి, కుషాయిగూడ భగవాన్ కాలనీకి చెందిన పబ్బా చంద్రశేఖర్ (50)పై సుమారు 80 మంది బాధితులు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వివిధ కారణాలు చూపిస్తూ, అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి, వ్యక్తిగత రుణాల పేరుతో మొత్తం రూ.50 కోట్లకు పైగా సేకరించి పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ప్రకారం, పబ్బా చంద్రశేఖర్ గత 30 ఏళ్లుగా శ్రీ వెంకటేశ్వర మార్కెటింగ్ పేరుతో సిమెంట్ డీలర్‌గా వ్యాపారం నిర్వహించడమే కాకుండా ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ (AIVF) ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. తన కుమార్తె వివాహం, తండ్రి వైద్యం, ఇల్లు నిర్మాణం, సిమెంట్ కంపెనీల ప్రత్యేక పథకాలు, జీఎస్టీ చెల్లిస్తే భారీ మొత్తం విడుదల అవుతుందని వంటి వివిధ కారణాలు చూపించి పలువురి నుంచి డబ్బులు తీసుకున్నట్లు బాధితులు ఆరోపించారు. జూన్ 22 నుంచి ఆయన మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉండగా, భార్యతో కలిసి కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదులో తెలిపారు. వెళ్లే ముందు ఇద్దరు కుమార్తెలను తన తమ్ముడి ఇంట్లో వదిలి వెళ్లారని, స్విట్జర్లాండ్‌కు వెళ్లారని తప్పుడు సమాచారం ఇచ్చ...

నల్లగొండ నారాయణ స్కూల్‌లో విద్యార్థిపై దాడి అమానుషం: బీజేపీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు

Image
  నల్లగొండ నారాయణ స్కూల్‌లో విద్యార్థిపై దాడి అమానుషం: బీజేపీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు నల్లగొండ: నల్లగొండలోని నారాయణ స్కూల్‌లో ఒకటో తరగతి విద్యార్థిపై జరిగిన దాడి అత్యంత అమానుషమని బీజేపీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులపై దాడులు చేయడం నారాయణ స్కూల్‌లో పరిపాటిగా మారిందని ఆరోపించారు. బ్రాండ్ పేరుతో విద్యను వ్యాపారంగా మార్చి, అర్హత లేని వ్యక్తులను అధ్యాపకులుగా నియమిస్తున్నారని, తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు పుస్తకాల కొనుగోలులోనూ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. విద్యార్థులు, తల్లిదండ్రులను బెదిరించే పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. ఒకటో తరగతి విద్యార్థిపై దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని పేర్కొన్న ఆయన, ఈ ఘటనపై సంబంధిత అధికారుల ద్వారా సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, నారాయణ స్కూల్‌కు సంబంధించిన అనుమతులను తక్షణమే సమీక్షించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే పర్మిషన్లు రద్దు చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘ...

కొణిజేటి రోశయ్య ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త

Image
 కొణిజేటి రోశయ్య ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త * ఘనంగా మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 93వ జయంతి వేడుకలు * రవీంద్రభారతిలో చిత్రపటానికి నివాళులర్పించిన ప్రముఖులు * ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు హైదరాబాద్ (గూఢచారి న్యూస్): రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరతకు ప్రతీకగా నిలిచిన దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీపీసీసీ (TPCC) ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త పిలుపునిచ్చారు. కొణిజేటి రోశయ్య గారి 93వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం మరియు కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన జయంతి సభకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, టీపీసీసీ అధ్య...

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. DSP ఎస్. భీమ్ రెడ్డి ఆస్తులపై ఏసీబీ సోదాలు

Image
  ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. DSP ఎస్. భీమ్ రెడ్డి ఆస్తులపై ఏసీబీ సోదాలు హైదరాబాద్, జూలై 2: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గురువారం డీఎస్పీ ఎస్. భీమ్ రెడ్డికి చెందిన నివాసాలు, ఇతర ఆస్తులపై ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్లు తెలిసింది. హైదరాబాద్‌తో పాటు మొత్తం 20 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సోదాల సందర్భంగా ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు, ఇతర రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. సుమారు రూ.8 కోట్ల విలువైన విల్లాలు కూడా పరిశీలనలో ఉన్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపినప్పటికీ, అక్రమాస్తుల విలువ లేదా స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. సోదాలు కొనసాగుతున్నందున పూర్తి వివరాలను అనంతరం వెల్లడించే అవకాశం ఉంది.