Posts

Showing posts from May, 2026

రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం.. అందరికీ వనమా వెంకటేశ్వర్ల కృతజ్ఞతలు

Image
  రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం.. అందరికీ వనమా వెంకటేశ్వర్ల కృతజ్ఞతలు నల్గొండ: రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా వనమా వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేస్తూ, తనకు ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, చిట్యాల మండల నాయకులు, కార్యకర్తలు మరియు శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన సమయంలో అందించిన సహకారం మాదిరిగానే, ఇకపై రాష్ట్ర ఉపాధ్యక్షునిగా తన బాధ్యతల నిర్వహణలో కూడా నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నాయకులు, సభ్యులు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఆర్యవైశ్య సమాజ అభ్యున్నతి, సంఘ బలోపేతం మరియు సామాజిక సేవా కార్యక్రమాల కోసం మరింత కృషి చేస్తానని వనమా వెంకటేశ్వర్లు తెలిపారు. .

సిగరెట్ మానెయ్..బిడ్డా.! *ఒక చిన్న నిర్ణయం…ఒక పెద్ద మార్పు* (మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం)

Image
  సిగరెట్ మానెయ్..బిడ్డా.! *ఒక చిన్న నిర్ణయం…ఒక పెద్ద మార్పు* (మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం) సిగరెట్ మానెయ్ బిడ్డా.. ఏమండి స్మోకింగ్ మనరా.?! ప్లీజ్  నాన్నా..స్మోకింగ్ కిల్స్ యూ.. నాన్న. ఈ మాటలు..విని,విని  ఆ అలవాటు మనలేక గోడకు ఫోటో ఐ"పోయే" బదులు.. ఒక్క క్షణం మనల్ని ప్రాణం గా.. ప్రేమించే వారి కోసం.. సిగరెట్ అలవాటు ను జీవితం లో నుంచి విసిరి అవతల పారెయ్యండి. పొగాకు, సిగరెట్ మానడం కష్టం కావచ్చు. కానీ అసాధ్యం కాదు. ఒక రోజు సిగరెట్ లేకుండా ఉండగలిగితే, ఒక వారం కూడా ఉండగలరు. ఒక వారం గడిస్తే, ఒక జీవితం గెలవగలరు. మీ పిల్లల కోసం… మీ తల్లిదండ్రుల కోసం… మీ భార్య కోసం… ముఖ్యంగా — మీ ప్రాణం కోసం. సిగరెట్ వెలిగించినప్పుడు మనం కేవలం పొగను కాదు…మన జీవిత కాలాన్ని కాలుస్తున్నాం. పొగాకు మొదట అలవాటుగా వస్తుంది… తర్వాత అవసరంగా మారుతుంది… చివరికి మనిషిని నిశ్శబ్దంగా మరణం వైపు నడిపిస్తుంది. అందుకే ఈ *World No Tobacco Day* సందర్భంగా మనమందరం ఒక మాట మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి: “పొగాకు కాదు… ప్రాణమే ముఖ్యం.” ఎందుకంటే — ఒక సిగరెట్ ఆర్పేస్తే ఒక జీవితం వెలుగుతుంది. చివరిగా ఏమంటే సరదా అంటూ సిగరె...

"ఉప్పల స్వప్న గారికి ప్రతిష్టాత్మక “ఎన్టీఆర్ సేవా రత్న అవార్డు"

Image
  "ఉప్పల స్వప్న కు ప్రతిష్టాత్మక “ఎన్టీఆర్ సేవా రత్న అవార్డు”  హైదరాబాద్: ప్రముఖ సామాజిక కార్యకర్త, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ (IVF) ప్రధమ మహిళ  శ్రీమతి ఉప్పల స్వప్న కు ప్రతిష్టాత్మకమైన “కళావేదిక ఎన్టీఆర్ సేవా రత్న అవార్డు”.  సామాజిక సేవా రంగంలో మరియు మహిళా సాధికారత కోసం ఆమె అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా నిర్వాహకులు ఈ పురస్కారాన్ని అందజేశారు. అమీర్‌పేటలోని AAA సినిమాస్‌లో అత్యంత వైభవంగా జరిగిన “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025” వేడుకలో సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సమక్షంలో ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అతిథులు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను బహూకరించారు. అవార్డుతో బాధ్యత మరింత పెరిగింది: ఉప్పల స్వప్న పురస్కారాన్ని అందుకున్న అనంతరం ఉప్పల స్వప్న గారు మాట్లాడుతూ.. మహానటుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో నెలకొల్పిన ఈ అవార్డును అందుకోవడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. "నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డుతో సమాజం పట్ల నా బాధ్యత మరి...

‘సూటు-బూటు’ మేధావులారా... మీ ‘లెఫ్ట్’ అనాలసిస్‌లు సనాతన సంస్కృతి ముందు ఎంత?

Image
 గూఢచారి స్పెషల్: ‘సూటు-బూటు’ మేధావులారా... మీ ‘లెఫ్ట్’ అనాలసిస్‌లు సనాతన సంస్కృతి ముందు ఎంత? యూట్యూబ్ కెమెరాల ముందు కూర్చోవడం, సూటు-బూటు వేసుకుని గంభీరంగా గొంతు సవరించుకోవడం, తామేదో సమాజాన్ని ఉద్ధరించే ‘మేధావులం’ అని కలరింగ్ ఇచ్చుకోవడం... ఈ మధ్య కాలంలో కొందరు సోషల్ మీడియా విశ్లేషకులకు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా లెఫ్ట్ సిద్ధాంతాల ముసుగులో, విశ్లేషణల పేరుతో సనాతన సంస్కృతిని, సంప్రదాయాలను టార్గెట్ చేయడం ఒక ట్రెండ్‌గా మార్చారు. కానీ వీరు గుర్తించని నిజం ఒక్కటే... ఈ దేశ మూలాలను కదిలించడం మీ యూట్యూబ్ థంబ్నైల్స్ మార్చినంత సులువు కాదు! 2000 ఏళ్ల చరిత్రే ఏం చేయలేకపోయింది.. మీరెంత? ఈ దేశంపై ఎందరో దండయాత్రలు చేశారు. 2000 ఏళ్లుగా ఎందరో పాలకులు ఈ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలని చూశారు. నలందా విశ్వవిద్యాలయాన్ని తగులబెట్టారు, దేవాలయాలను కూల్చారు, మతాంతర మార్పిడులకు ఒడిగట్టారు. కానీ, ఇంతటి పెనుతుఫానులను తట్టుకుని, కాల గర్భంలో కలిసిపోకుండా నేటికీ సజీవంగా, సగర్వంగా నిలబడింది మన భారతీయ సంస్కృతి. అలాంటి గొప్ప సంస్కృతిని, చరిత్రను... నాలుగు వ్యూస్ కోసం, కొన్ని లైక్స్ కోసం యూట్యూబ్ ఛ...

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

Image
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా? తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కుల బాంధవుల శ్రేయస్సు, పేద వైశ్యుల అభ్యున్నతే లక్ష్యంగా సాగాల్సిన మహాసభ.. ఇప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమైన “పక్షపాత మహాసభ”గా మారుతోందా అనే అనుమానాలు సగటు ఆర్యవైశ్యుడి మెదడును తొలిచేస్తున్నాయి. ముఖ్యంగా గత 12 ఏళ్లుగా రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉత్తర తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా సాగుతున్న చర్చ.. ఇప్పుడు మహాసభ పునాదులను కదిలిస్తోంది. మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, కేవలం తూతూమంత్రంగా జనగాం నుండి మహిళా విభాగంలో ఒకరికి స్థానం కల్పించి చేతులు దులుపుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, అసలు సిసలైన సింహభాగం పదవులన్నీ దక్షిణ తెలంగాణ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలకు, కొద్దిమంది ప్రభావశీలురకే కట్టబెడుతున్నారనేది బహిరంగ రహస్యం. కొత్త సీసాలో పాత సారా: ఒకరికే అన్ని పదవులా? ఇటీవల కొండ్రే మల్లికార్జున్ ని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై సంఘంలో అ...

ఆర్యవైశ్య మహాసభలో 'కీలక' నియామకాలు.. బైలా వివాదంపై రిజిస్ట్రార్ నజర్!

Image
ఆర్యవైశ్య మహాసభలో 'కీలక' నియామకాలు.. బైలా వివాదంపై రిజిస్ట్రార్ నజర్! హైదరాబాద్:గూఢచారి:  తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఎట్టకేలకు కీలక  సర్దుబాటు పూర్తయింది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఎన్నికల్లో కొద్దిపాటి మెజారిటీతో పీఠాన్ని దక్కించుకున్న అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, దాదాపు రెండు నెలల సుదీర్ఘ కసరత్తు తర్వాత తన కోటరీని సిద్ధం చేసుకున్నారు. మహాసభ ప్రధాన కార్యదర్శిగా కొండ్లే మల్లికార్జున్ ను నియమించారు, కోశాధికారిగా రేణుకంట్ల గణేష్ గుప్తాను ఖరారు చేసినట్లు సోషల్ మీడియా లో చర్చ జరుగుతుంది.  ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంఘంలో హాట్ టాపిక్‌గా మారింది. అసంతృప్తుల నడుమ నియామకాల జోరు! ఎన్నికలు ముగిసి రెండు నెలలు గడుస్తున్నా కార్యవర్గ విస్తరణ జరగకపోవడంతో ఇన్నాళ్లూ రకరకాల ఊహాగానాలు సాగాయి. తీరా ఇప్పుడు నియామకాలు జరిపినా, అంతర్గతంగా అందరినీ సమన్వయం చేయడం అమరవాదికి అంత తేలికైన విషయమేమీ కాదనే టాక్ వినిపిస్తోంది. ఒకవైపు ఈ పదవుల పంపకంపై హర్షం వ్యక్తమవుతుండగా, మరోవైపు ఆశావహుల అసంతృప్తి సెగలు కూడా లోపాయికారీగా పొగలుగక్కుతున్నట్లు సమాచారం. తెరపైకి 'బైలా' వివాదం.. రిజిస్ట్రార్ నోటీసుల ...

శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ పంజా: రూ.30 లక్షల డిమాండ్.. రూ.2 లక్షలు నొక్కేస్తూ డ్రైవర్, ఎమ్మార్వో రెడ్ హ్యాండెడ్!

Image
శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ పంజా: రూ.30 లక్షల డిమాండ్.. రూ.2 లక్షలు నొక్కేస్తూ డ్రైవర్, ఎమ్మార్వో రెడ్ హ్యాండెడ్! మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయం మరోసారి అవినీతి అక్రమాలకు అడ్డాగా మారింది. భూమి కన్వర్షన్ కోసం ఏకంగా రూ.30 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఉదంతంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించి గుట్టు రట్టు చేశారు. రూ.30 లక్షల డీల్.. ఎకరానికి లక్ష చొప్పున వేట! శామీర్‌పేట మండలం ఆలియాబాద్ ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమిని కన్వర్షన్ (ల్యాండ్ కన్వర్షన్) చేయడానికి సంబంధించి ఒక రైతు కన్సల్టెంట్ నుంచి ఇక్కడి అధికారులు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. ఎకరానికి రూ.1 లక్ష చొప్పున.. మొత్తం రూ.30 లక్షలు ఇస్తేనే పని జరుగుతుందని కరాఖండిగా చెప్పారు. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో వ్యూహాత్మకంగా నిఘా పెట్టారు. డ్రైవర్ ద్వారా వసూళ్లు.. రెడ్ హ్యాండెడ్‌గా! లంచం మొత్తంలో భాగంగా మొదటి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. తహసీల్దార్ (ఎమ్మార్...

మాజీ మంత్రి హరీష్ ను కలిసిన డాక్టర్ శ్రీహరి

Image
  మాజీ మంత్రి హరీష్ ను కలిసిన డాక్టర్ శ్రీహరి  సంగారెడ్డి  అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావును సంగారెడ్డికి చెందిన సీనియర్ నేత డాక్టర్ శ్రీహరి మంగళవారం ఉదయం కలిశారు. ఇటీవల హరీష్ రావు అమెరికా నుంచి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశామని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా తిరిగి కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. గతంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని  అన్నారు.నాడు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు . తిరిగి కెసిఆర్ పాలన వస్తుందని చెప్పారు . యువ నాయకుడు శ్రీకాంత్ కూడా హరీష్ రావును కలిసిన వారిలో ఉన్నారు.

అధికారుల 'మామూళ్ల' మత్తు?.. అంతమ్మగూడెంలో కాలుష్య కాటు!

Image
అధికారుల 'మామూళ్ల' మత్తు?.. అంతమ్మగూడెంలో కాలుష్య కాటు! * కమిటీల పేరుతో కలెక్టర్, పిసిబి మెంబర్ సెక్రటరీ కాలయాపన!* ఫిర్యాదుదారుల గొంతు నొక్కుతున్న TSPCB! * 11 ఏళ్లుగా సాగుతున్న పోరాటం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న యంత్రాంగం. * తనిఖీలు వాయిదా వేసి పరిశ్రమలకు 'క్లీన్ చిట్' ఇచ్చే కుట్ర?  (హైదరాబాద్‌ గూఢచారి)  ప్రజా ఆరోగ్యం కంటే పారిశ్రామికవేత్తల లాభాలే పరమావధిగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (TSPCB) ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరుపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.  కాలుష్యానికి కారణమవుతున్న కంపెనీలు M/S హెజెలో లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (అంతమ్మగూడెం) M/s బృందావన్ లాబొరేటరీస్ (ఎలగిరి) M/S శ్రీ జయ లాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ (మల్కాపూర్) M/S వినీత్ లాబొరేటరీస్ లిమిటెడ్ (మల్కాపూర్) M/S రావూస్ లాబొరేటరీస్ లిమిటెడ్ (దోతీగూడెం) M/S ఎస్ వి ఆర్ లాబొరేటరీస్ (దోతీగూడెం) M/S వి.జె. సాయి కెమ్ (దోతీగూడెం) M/S కెమిక్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (దోతీగూడెం) M/S ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (దోతీగూడెం) M/S ఆర్కిమెడిస్ లాబొరే...

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మేర కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకట రాజ్యం!

Image
  సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మేర కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకట రాజ్యం! హైదరాబాద్ (గూఢచారి ): తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మేర కులస్తుల ఆకాంక్షను నెరవేరుస్తూ, ప్రత్యేకంగా 'మేర కార్పొరేషన్' ఏర్పాటు చేసినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి కి కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకట రాజ్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బుధవారం తెలంగాణ సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మేర కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకట రాజ్యం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని మేర కులస్తుల తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు సమర్పించారు. తక్షణమే రూ. 50 కోట్ల బడ్జెట్ కేటాయింపు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేర కులస్తులను గుర్తించి, కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా.. దానికి చైర్మన్, వైస్ చైర్మన్‌లను నియమించడంపై సంఘ వెంకట రాజ్యం హర్షం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా, కార్పొరేషన్ బలోపేతానికి మరియు కులస్థుల సంక్షేమానికి వెనువెంటనే రూ. 50 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి ప...

గతంలో ధాన్యం లూటీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న మిల్లులవద్దే ప్రభుత్వ ధాన్యం?

Image
  గతంలో ధాన్యం లూటీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న మిల్లులవద్దే ప్రభుత్వ ధాన్యం? నల్లగొండ జిల్లాలో సంచలనంగా మారుతున్న ప్రభుత్వ ధాన్యం నిల్వల వ్యవహారం నల్లగొండ జిల్లాలో గతంలో ప్రభుత్వ ధాన్యం లూటీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని, కేసులు నమోదై జైలు పాలైన కొందరు రైస్ మిల్లుల వద్దకే ప్రస్తుతం ప్రభుత్వ ధాన్యాన్ని నిల్వ ఉంచుతున్నారనే సమాచారం తీవ్ర చర్చకు దారితీస్తోంది. రైతుల నుండి కొనుగోలు చేసిన వందల కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని ఇలాంటి మిల్లులకు కేటాయించడం వెనుక ఉన్న కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అక్రమ నిల్వలు, బియ్యం అక్రమ రవాణా, స్టాక్ మాయంపై ఆరోపణలు ఎదుర్కొన్న మిల్స్ కి మళ్లీ వద్ద ధాన్యం నిల్వలు ఉంచడం అధికారుల నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇప్పటికే పలువురు మిల్లర్లపై కేసులు నమోదై, కొందరు జైలుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అలాంటి మిల్లుల వద్దే ప్రభుత్వ ధాన్యం నిల్వ చేయడం వెనుక ఎవరెవరి ఆశీస్సులు ఉన్నాయన్నది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు మరియు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి...

బక్రీద్ సెలవు మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం!

Image
  బక్రీద్ సెలవు మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం! హైదరాబాద్: తెలంగాణలో బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ ప్రభుత్వ సెలవు దినాన్ని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన తేదీకి బదులుగా మరో రోజును సాధారణ సెలవుగా ప్రకటిస్తూ సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు (G.O.Rt.No.718, తేది: 22.05.2026) జారీ చేశారు. మారిన తేదీల వివరాలు: పాత సెలవు తేదీ: మే 27, 2026 (బుధవారం) - రద్దు చేయబడింది కొత్త సెలవు తేదీ: మే 28, 2026 (గురువారం) - సెలవుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు మార్పునకు గల కారణం: తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి అందిన నివేదికలు, సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ (N.I. Act), 1881 కింద ఈ మార్పులు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మరియు ఆర్థిక సంస్థలకు ఈ సవరించిన సెలవు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం మరియు తాజ...

మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఏసీబీ వలలో.. రూ. వందల కోట్ల 'ప్రభుత్వ భూముల' బాగోతం బట్టబయలు!

Image
  మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఏసీబీ వలలో.. రూ. వందల కోట్ల 'ప్రభుత్వ భూముల' బాగోతం బట్టబయలు! హైదరాబాద్ (gudachari.page): భూసేకరణ, రక్షణ బాధ్యతలు చూసుకోవాల్సిన అధికారే.. ప్రభుత్వ భూములకు ఎసరు పెట్టాడు. కంచే చేను మేసిన చందంగా.. కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను తన సొంత ఆస్తిగా మార్చేసుకున్నాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ (ఆర్డీవో) వంశీమోహన్ అవినీతి సామ్రాజ్యాన్ని యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు గురువారం బద్దలు కొట్టారు. ఏకకాలంలో జరిగిన సోదాల్లో రూ. వందల కోట్ల విలువైన అక్రమాస్తులు బయటపడటం రెవెన్యూ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగింది? (దిమ్మతిరిగే భూ కుంభకోణం) శేరిలింగంపల్లితో పాటు పలు కీలక ప్రాంతాల్లో ఆర్డీవోగా పనిచేసిన వంశీమోహన్, ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో 'సరికొత్త' స్కెచ్ వేశారు. మామగారి పేరిట రిజిస్ట్రేషన్: అబ్దుల్లాపూర్‌మెట్‌, పిగ్లీపురం ప్రాంతాల్లోని దాదాపు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని వంశీమోహన్ అత్యంత చాకచక్యంగా తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించేశారు. రియల్టర్లతో డీలింగ్: ఆ తర్వాత ఆ భూములను ప్రముఖ ర...

ఆర్యవైశ్య మహాసభ బై-లాస్‌పై జిల్లా రిజిస్ట్రార్ సీరియస్: 'సొసైటీ చట్టం' ఉల్లంఘనపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు!

Image
  ఆర్యవైశ్య మహాసభ బై-లాస్‌పై జిల్లా రిజిస్ట్రార్ సీరియస్: 'సొసైటీ చట్టం' ఉల్లంఘనపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు! హైదరాబాద్ (గూఢచారి విభాగం): తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ సొసైటీ అంతర్గత నియమావళి (Bye-laws), రాష్ట్ర సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టానికి విరుద్ధంగా ఉందంటూ దాఖలైన ఫిర్యాదుపై హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్ (సౌత్) తీవ్రంగా స్పందించారు. తెలంగాణ సొసైటీల రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 లోని సెక్షన్ 14 ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలపై మహాసభ కన్వీనర్ శ్రీ అమరవాది లక్ష్మీనారాయణకు రిజిస్ట్రార్ కార్యాలయం అధికారికంగా ‘షోకాజ్’ నోటీసులు (లేఖ నంబర్ 3144/2026, తేదీ 16-05-2026) జారీ చేసింది. నల్లగొండకు చెందిన శ్రీ బి. రాజు అనే వ్యక్తి గత నెల 23-04-2026న ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా రిజిస్ట్రార్ కార్యాలయం ఈ చర్యలు చేపట్టింది. సెక్షన్ 14 ఉల్లంఘన.. అసలు వివాదం ఏమిటి? సొసైటీల రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా కమిటీలను ఎన్నుకోవాల్సి ఉండగా, మహాసభ నియమాలు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్నది ప్రధాన ఆరోపణ. చట్టం ఏం చెబుతోంది (సెక్షన్ 14): ప్రతి రిజిస్టర్డ్ సొసైటీలో కనీసం ముగ్గురు సభ్య...

ఉప్పల దంపతుల ఆతిథ్యం: డా. ఆరతి కృష్ణకు ఘన సన్మానం

Image
  ఉప్పల దంపతుల ఆతిథ్యం: డా. ఆరతి కృష్ణకు ఘన సన్మానం హైదరాబాద్ (గూఢచారి ప్రతినిధి): ఎమ్మెల్సీ, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఆరతి కృష్ణకు హైదరాబాద్‌లో ఘన సన్మానం జరిగింది. శుక్రవారం నాడు ఆమె ఏఐసీసీ కార్యదర్శి, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ (IVF) జాతీయ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త - స్వప్న దంపతులు ఆమెకు సాదరంగా సుస్వాగతం పలికారు. అనంతరం డా. ఆరతి కృష్ణను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందించి ఘనంగా సన్మానించారు. ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానానికి.. సన్మాన కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. సమాజానికి డా. ఆరతి కృష్ణ అందిస్తున్న సేవలను కొనియాడారు. భవిష్యత్తులో ఆమె ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తనపై చూపిన ఆప్యాయతకు, అందించిన అద్భుత ఆతిథ్యానికి డా. ఆరతి కృష్ణ ఉప్పల కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్యులు పాల్గొన్నారు.

PCB అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు: TGPSC కీలక నిర్ణయం!

Image
  PCB అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు: TGPSC కీలక నిర్ణయం! హైదరాబాద్ (గూఢచారి వెబ్ డెస్క్): తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఒక తీపి కబురు అందించింది. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) లో భర్తీ చేయనున్న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్ -II) పోస్టులకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని పెంచుతూ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ నంబర్ 01/OG/PC/2026 (తేదీ: 20/04/2026) ద్వారా విడుదలైన ఈ పోస్టులకు గతంలో ఉన్న వయోపరిమితిని సవరిస్తూ ఇవాళ (మే 20, 2026) ఒక అధికారిక ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. 34 నుంచి 44 ఏళ్లకు పెంపు సాధారణ పరిపాలన శాఖ (GAD) మే 18, 2026న జారీ చేసిన G.O.Ms.No.86 ఉత్తర్వుల ప్రకారం... ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి ప్రత్యేక లేదా అడహాక్ నిబంధనల కింద గరిష్ట వయోపరిమితిని మరో 10 సంవత్సరాలు పెంచారు. దీనితో ఇప్పటివరకు 34 ఏళ్లుగా ఉన్న గరిష్ట వయోపరిమితిని ఇప్పుడు 44 ఏళ్లకు పెంచుతూ TGPSC నిర్ణయం తీసుకుంది. G.O.Ms.No.86 ప్రకారం వర్తించే అన్ని వయోసడలింపులతో కలిపి ఈ గరిష్ట వ...

ఏసీబీ వలలో జలమండలి తిమింగలం.. కుప్పలుతెప్పలుగా నోట్ల కట్టలు.. విస్తుపోయే ఆస్తులు!

Image
  ​ఏసీబీ వలలో జలమండలి 'తిమింగలం'.. కుప్పలుతెప్పలుగా నోట్ల కట్టలు, విస్తుపోయే ఆస్తులు! ​హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) మరో భారీ తిమింగలాన్ని వేటాడింది. సామాన్యుడి దాహార్తిని తీర్చాల్సిన ఓ ఉన్నతాధికారి, తన అవినీతి దాహంతో కోట్లకు పడగెత్తిన ఉదంతం ఇప్పుడు నగరంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ నివాసాలపై ఏసీబీ అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో కళ్లు బైర్లు గమ్మే నిజాలు బయటపడ్డాయి. ​టార్గెట్ 'జలమండలి GM': తెల్లవారుజామునే షాక్! ​హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) ప్రాజెక్ట్ డివిజన్-8 (రెడ్ హిల్స్) లో జనరల్ మేనేజర్ (ఇంజనీరింగ్)గా పనిచేస్తున్న ఎస్. అనంత లక్ష్మి కుమార్ లక్ష్యంగా ఏసీబీ ఈ ఆపరేషన్ చేపట్టింది. కుమార్ తన పదవిని అడ్డం పెట్టుకుని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. ​మంగళవారం (మే 19) తెల్లవారుజాము నుంచే ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో అధికారులు మెరుపు దాడులు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మల్లాపూర్, ...

ఆర్యవైశ్య హక్కుల కోసం రాజీలేని పోరాట యోధుడు T. G. Venkateshకు గూఢచారి తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు

Image
ఆర్యవైశ్య హక్కుల కోసం రాజీలేని పోరాట యోధుడు T. G. Venkateshకు గూఢచారి తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు  మే 16… ఆర్యవైశ్య సమాజానికి ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజు కేవలం ఒక నాయకుడి జన్మదినం మాత్రమే కాదు… దశాబ్దాలుగా ఆర్యవైశ్య హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిన ఒక ఉద్యమ యోధుని సేవలను స్మరించుకునే రోజు. మాజీ రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త, ప్రజానాయకుడు T. G. Venkatesh గారి జన్మదినం సందర్భంగా ఆర్యవైశ్య సమాజంలో ప్రత్యేక ఉత్సాహం నెలకొంది. ఆర్యవైశ్య సమాజానికి చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో టి.జి. వెంకటేష్ గారి పాత్ర ప్రత్యేకమైనది. రాజ్యాంగ పరంగా అనేక వర్గాలకు లభిస్తున్న రిజర్వేషన్లు, స్కాలర్‌షిప్లు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు వంటి ప్రయోజనాలు ఫార్వర్డ్ కమ్యూనిటీగా ఉన్న ఆర్యవైశ్యులకు అందకపోవడం వల్ల ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన పలుమార్లు ప్రస్తావించారు. గత ఐదు దశాబ్దాలుగా ఆర్యవైశ్యుల హక్కుల సాధన కోసం ఉద్యమాలు, ప్రతినిధి బృందాలు, ప్రభుత్వాల వద్ద వినతిపత్రాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ...

రాజకీయం కాదు: వ్యవస్థల మీద నమ్మకం ఉంచండి!

Image
  రాజకీయం కాదు: వ్యవస్థల మీద నమ్మకం ఉంచండి! ​ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, ప్రజాస్వామ్యంలో విలువలు ఎంత వేగంగా పతనమవుతున్నాయో అర్థమవుతోంది. కేవలం రాజకీయ వ్యతిరేకతను ప్రదర్శించడానికి కొందరు వామపక్ష భావజాలం ఉన్నవారు మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని అత్యంత తక్కువ స్థాయికి (చిల్లర రాజకీయాలు) దిగజార్చడం శోచనీయం. వారి చర్యలు సమస్యను పరిష్కరించకపోగా, వారి సొంత విలువలను వారే పోగొట్టుకునేలా చేస్తున్నాయి. ​ రాజకీయ కోణం.. పిల్లలకు అన్యాయం ​ఒకరిని రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే విధానపరంగా పోరాడాలి. కానీ, ఇద్దరు పిల్లల జీవితాలను, వారి స్నేహాన్ని లేదా వ్యక్తిగత విషయాలను రచ్చకీడ్చి వారి భవిష్యత్తును అంధకారం చేయడం ఏ రకమైన రాజకీయం? తల్లిదండ్రులు ఏ పరిస్థితుల్లో కేసు పెట్టారో, వారి మధ్య ఉన్న అసలు విషయం ఏమిటో విచారణలో తేలకముందే సోషల్ మీడియాలో తీర్పులు ఇవ్వడం విచారకరం. ​ ముఖ్యమంత్రి నిర్ణయం - 'సిట్' (SIT) ఏర్పాటు ​ఈ కేసులో ఉన్న సున్నితత్వాన్ని మరియు ప్రాముఖ్యతను గుర్తించిన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో ఎంతో పారదర్...

దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇంధన ధరల పెంపు: 'ఆత్మనిర్భర భారత్' దిశగా మోదీ సర్కార్ అడుగులు!

Image
 దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇంధన ధరల పెంపు: 'ఆత్మనిర్భర భారత్' దిశగా మోదీ సర్కార్ అడుగులు! న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల మరియు గ్లోబల్ సప్లై చైన్ సమస్యల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను ₹3, సిఎన్జీ ధరను ₹2 మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇది తక్షణ భారంగా అనిపించినా, విదేశీ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వయంసమృద్ధి సాధించే దిశగా మోదీ ప్రభుత్వం చేస్తున్న భారీ ప్రణాళికలో ఇది ఒక భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకు ఈ నిర్ణయం? - వాస్తవాలు ఇవే: అంతర్జాతీయ అనిశ్చితి: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చమురు సంస్థలు నష్టాల్లోకి వెళ్లకుండా కాపాడటం దేశ ఆర్థిక భద్రతకు అత్యవసరం. కోల్ గ్యాసిఫికేషన్ (Coal Gasification) - మోదీ మాస్టర్ ప్లాన్: విదేశీ చమురు మరియు సహజ వాయువు దిగుమతులను తగ్గించేందుకు ప్రధాని మోదీ 'నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్' ను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. భారతదేశంలో అపారంగా ఉన్న బొ...

ఏసీబీకి చిక్కిన ‘అవినీతి’ రాంబాబు: రూ. 10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆర్‌ఐ

Image
ఏసీబీకి చిక్కిన ‘అవినీతి’ రాంబాబు: రూ. 10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆర్‌ఐ వరంగల్ (గూఢచారి ప్రతినిధి): వరంగల్ జిల్లా దుగ్గొండి మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. పూర్వీకుల ఆస్తి మ్యుటేషన్ కోసం ఒక సామాన్యుడిని వేధించి, లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) గట్టికొప్పుల రాంబాబును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.   అసలేం జరిగిందంటే? దుగ్గొండి మండలానికి చెందిన ఒక వ్యక్తి తన పూర్వీకుల ఆస్తికి సంబంధించి మ్యుటేషన్ ప్రక్రియ కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. అయితే, ఈ ఫైల్‌ను ముందుకు కదిలించడానికి, ఫీల్డ్ ఎంక్వయిరీ నిర్వహించి సానుకూల నివేదిక సమర్పించడానికి ఆర్‌ఐ రాంబాబు రూ. 10,000 లంచం డిమాండ్ చేశారు. అధికారి వేధింపులు భరించలేక సదరు బాధితుడు వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.   మెరుపు దాడి.. పక్కా స్కెచ్ బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం పక్కా ప్రణాళికతో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిఘా పెట్టారు. బాధితుడి నుంచి రాంబాబు రూ. 10,000 లంచం తీసుకుం...

అరే పొరగాల్లా రా… జర భద్రంగా ఉండండ్రా!

Image
  అరే పొరగాల్లా రా… జర భద్రంగా ఉండండ్రా! ఇప్పటి కాలం “ఫ్రెండ్‌షిప్” అన్న మాటతో మొదలై… “కేసు” దగ్గర ముగిసే పరిస్థితులు వస్తున్నయ్‌. ఒక్క చిన్న తప్పు… ఒక్క అజాగ్రత్త… ఒక్క అర్ధం కాని రిలేషన్… జీవితాంతం మచ్చగా మారుతోంది. ముఖ్యంగా ఇప్పుడు బయట పడుతున్న కొన్ని కేసులు చూసాక తెలంగాణ పొరగాల్లు గుబులు పడుతున్నరు. ఎవరు నిజం… ఎవరు తప్పు… అది కోర్టులు తేల్చాల్సిన విషయం. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ — అవగాహన లేకుండా అడుగు వేస్తే… లైఫ్ మొత్తం జైలు గోడల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తది. “ఏజ్” అనేది చిన్న విషయం కాదు రా! “ఆమె ఒప్పుకుంది…” “మేము ప్రేమించుకున్నాం…” “ఇద్దరం కలిసి తిరిగాం…” అన్న మాటలు చట్టం ముందు చాలాసార్లు పనికిరావు. ముఖ్యంగా మైనర్ విషయంలో అయితే చట్టం చాలా కఠినంగా ఉంటది. పొరగాల్లు “ఫన్”, “లవ్”, “టైమ్‌పాస్” అనుకుని తిరిగేది… తర్వాత పెద్ద కేసులుగా మారుతున్నయ్‌. సోషల్ మీడియా ఫ్రెండ్‌షిప్‌లు – ప్రమాదకర మలుపులు ఇన్‌స్టాగ్రామ్‌లో రిక్వెస్ట్… వాట్సాప్‌లో చాట్… బైక్‌పై షికార్లు… రాత్రి వీడియో కాల్స్… ఇవి ఇప్పుడు చాలామందికి కామన్ అయిపోయినయ్‌. కానీ ఎవరి వయసెంత? ఎవరి ఉద్దేశ్యం ఏంటి? తర్వాత ఏం జరుగు...

మీడియా ట్రయల్ కంటే న్యాయ విచారణే ముఖ్యం

Image
  బండి భగీరథ్ వ్యవహారం: స్నేహం నుంచి కేసుల వరకు… అసలు నిజాలు వెలుగులోకి రావాల్సిందే మీడియా ట్రయల్ కంటే న్యాయ విచారణే ముఖ్యం హైదరాబాద్:  కేంద్ర సహాయ మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు Bandi Sai Bhagirath పై నమోదైన పోక్సో కేసు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు, మీడియా మరియు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. అయితే కేసు చుట్టూ బయటకు వస్తున్న కొన్ని విషయాలు ఇప్పుడు ప్రజల్లో అనేక సందేహాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం బయటకు వస్తున్న సమాచారం ప్రకారం, భగీరథ్ మరియు ఫిర్యాదు చేసిన యువతి మధ్య పరిచయం ఒక్కరోజులో ఏర్పడినది కాదని తెలుస్తోంది. ఇద్దరూ స్నేహితులుగా తిరిగిన సందర్భాలు ఉన్నాయని, కుటుంబ సభ్యులకు కూడా పరిచయం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా ఇరువురి కుటుంబాల మధ్య కూడా సాన్నిహిత్యం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, బండి భగీరథ్‌ను కేసు పెట్టిన యువతి ఇంటికి రానివ్వడం, కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయని సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒకవేళ ఇవన్నీ నిజమైతే, తరువాత అకస్మాత్తుగా తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు కా...

బోర్డు ఎక్కడ? అంటే... కింద ఎక్కడో ఉందో? జిహెచ్‌ఎంసి ప్లానింగ్ సెక్షన్‌లో 'సమాచార' సంకటంలో ఆర్టిఐ!

Image
  బోర్డు ఎక్కడ? అంటే... కింద ఎక్కడో ఉందో? జిహెచ్‌ఎంసి ప్లానింగ్ సెక్షన్‌లో 'సమాచార' సంకటంలో ఆర్టిఐ! హైదరాబాద్: సామాన్యుడికి ఆయుధంగా మారాల్సిన సమాచార హక్కు చట్టం (RTI), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్లానింగ్ విభాగంలో మాత్రం పక్కదారి పడుతోంది. పారదర్శకతకు నిలువుటద్దంలా ఉండాల్సిన అధికారులు, అడిగిన ప్రశ్నలకు నిర్లక్ష్యపు సమాధానాలిస్తూ కాలయాపన చేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డు ఎక్కడ? అంటే... కింద ఎక్కడో ఉందో? ప్లానింగ్ సెక్షన్‌లో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన వివరాల బోర్డు (RTI Disclosure Board) ఎక్కడ ఉందో తెలపాలని ఒక అర్జీదారుడు కోరగా, దానికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (PIO) ఇచ్చిన సమాధానం విస్తుగొలుపుతోంది. "ఎక్కడో కింద ఎక్కడో ఉంది" అంటూ ఏమాత్రం బాధ్యత లేకుండా, వెటకారంగా సమాధానం ఇచ్చారని బాధితుడు వాపోతున్నాడు. చట్ట ప్రకారం కార్యాలయంలో స్పష్టంగా కనిపించాల్సిన బోర్డుల గురించే స్పష్టత లేకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. ఫైళ్ల కదలికలో 'నత్తనడక' అర్జీదారుడి ఫిర్యాదు ప్రకారం.. ఏప్రిల్ 29న దరఖాస్తు చేయగా, అది ఏప్రిల్ 30...

చిట్యాల చెక్‌పోస్టు వద్ద 60 గోవుల అక్రమ రవాణా భగ్నం

Image
  *చిట్యాల చెక్‌పోస్టు వద్ద 60 గోవుల అక్రమ రవాణా భగ్నం*   *కబేళాకు తరలిస్తుండగా పోలీసుల మెరుపు దాడి*   *లారీ డ్రైవర్ అదుపులో: ముఠా కోణంలో దర్యాప్తు* *నల్లగొండ, గూఢచారి:* జిల్లాలోని చిట్యాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు మెరుపు దాడి చేసి భారీ గో అక్రమ రవాణాను భగ్నం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌లోని కబేళాకు తరలిస్తున్న సుమారు 60 గోవులను పోలీసులు పట్టుకున్నారు. లారీలో కిక్కిరిసిన స్థితిలో గోవులను అత్యంత అమానవీయంగా తరలిస్తుండగా, చెక్‌పోస్టు వద్ద అనుమానం వచ్చిన పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. లారీలో ఊపిరాడని స్థితిలో ఉన్న 60 గోవులను గుర్తించి డ్రైవర్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గోవుల రవాణాకు సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో పోలీసులు కీలక వివరాలపై డ్రైవర్‌ను గట్టిగా విచారిస్తున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఏదైనా ముఠా హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన గోవులను సురక్షితంగా చింతపల్లి గోశాలకు తరలించి, వాటికి పశువైద్యులతో చికిత్స అందిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని చిట...

జీవో నెం.17 రద్దు చేయాలి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల డిమాండ్

Image
 *జీవో నెం.17 రద్దు చేయాలి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల డిమాండ్*   *చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలి*   *కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా & నిరసన* *కరీంనగర్, గూఢచారి:* రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 17ను వెంటనే రద్దు చేసి, చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ముందు అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి కొంకటి శేఖర్, అక్కనపల్లి శిరీష, మేకల రవీందర్, జన్ను స్వరూప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.17ను తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని విద్యా సంస్థలలో అవకాశం లేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. *గుజరాత్ కంపెనీకి కట్టబెడుతున్నారు*   "ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందవలసిన వాటాను వాళ్లకు కేటాయించకుండా గుజరాత్ రాష్ట్రంలోని మఫ్ఫత్‌లాల్ ...

*తెలంగాణను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు.. 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు*

Image
  *తెలంగాణను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు.. 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు*   *ఈ నెల 18 నుంచి 22 వరకు తీవ్ర వడగాలులు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*   *వృద్ధులు, చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: వాతావరణ శాఖ* *హైదరాబాద్, గూఢచారి:* తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భానుడు భగభగలతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. నిన్న నిజామాబాద్ జిల్లా సాలూరలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, అది వేడి నుంచి పెద్దగా ఉపశమనాన్ని ఇవ్వకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. *47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు*   ముఖ్యంగా ఈ నెల 18 నుంచి 22వ తేదీల మధ్య ఎండలు గరిష్ట స్థాయికి చేరుతాయని, ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరక...

*"ఫస్ట్ మెమో.. నెక్స్ట్ సరెండర్" - అడ్మినిస్ట్రేషన్ ‘వండర్’* *అధికారి ఆవేదన: తప్పు చేయకున్నా శిక్షేనా?* *న్యాయం కోసం కోర్టుకెళ్తానంటున్న డిప్యూటీ తహసీల్దార్*

Image
 *"ఫస్ట్ మెమో.. నెక్స్ట్ సరెండర్" - అడ్మినిస్ట్రేషన్ ‘వండర్’*   *అధికారి ఆవేదన: తప్పు చేయకున్నా శిక్షేనా?*   *న్యాయం కోసం కోర్టుకెళ్తానంటున్న డిప్యూటీ తహసీల్దార్* గూఢచారి:* "ఫస్ట్ మెమో.. నెక్స్ట్ సరెండర్.. ఇదే అడ్మినిస్ట్రేషన్ వండర్" అంటూ ఓ ప్రభుత్వ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేయకపోయినా, వివరణ ఇచ్చినా సరెండర్ చేయడమేంటని  నల్గొండ జిల్లా పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ ప్రశ్నిస్తున్నారు. *అసలేం జరిగింది?*   డీటీగా విధులు నిర్వహిస్తున్న రఘునందన్‌కు ఒకరోజు ఉన్నతాధికారి నుంచి పిలుపు వచ్చింది. "ఏమయ్యా.. నీ ఫోన్ ఎందుకు బంద్ ఉంది? ఫోన్ లేప్తలేడు, ఫీల్డ్‌లో లేడు అని ఆ మేడం నీపై ఫిర్యాదు చేసింది. ప్యాడీ సెంటర్లకు పోవడం లేదని కంప్లైంట్ ఇచ్చింది. వెళ్లి సారీ చెప్పి, అటెండెన్స్ సర్టిఫికెట్ తెచ్చుకో. లేకపోతే ఈ నెల జీతం ఆగుతది" అని హెచ్చరించారు. దానికి రఘునందన్ "సార్.. నా ఫోన్ డ్యామేజ్ అయ్యింది. రిపేర్‌కు ఇచ్చాను. నేను నౌకరీ చేసేది ఇక్కడ. అక్కడి నుంచి అటెండెన్స్ ఎట్లా తేవాలి?" అని ప్రశ్నించగా, "ఏయ్.. ఎక్కువ మాట్లా...

*తెలంగాణ అభివృద్ధికి కేంద్రం బాసట: రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం*

Image
 *తెలంగాణ అభివృద్ధికి కేంద్రం బాసట: రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం*   *హైటెక్స్‌లో ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్*   *రాష్ట్ర ప్రగతికి డబుల్ ఇంజన్ సర్కార్ హామీ* *హైదరాబాద్, గూఢచారి:* తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. భాగ్యనగరంలోని హైటెక్స్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో సుమారు రూ.9,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం సీఎం వెండి నంది విగ్రహాన్ని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శ్రీరాముడి ప్రతిమను ప్రధానికి బహూకరించారు. *ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవే*   తెలంగాణలో మౌలిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధి, రవాణా, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేలా ప్రధాని పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. 1. రూ.3,180 కోట్లతో చేపట్టే రహదారి ప...

*అంగన్‌వాడీల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్ల సప్లైలో భారీ కుంభకోణం?*

Image
  *అంగన్‌వాడీల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్ల సప్లైలో భారీ కుంభకోణం?* *హైస్పీడ్ ఫ్యాన్ల టెండర్‌లో 10 లక్షల కుంభకోణం బట్టబయలు*  *నాసిరకం సామాను సరఫరా: సప్లయర్, అధికారులపై వేటుకు డిమాండ్* *  *20 లక్షల టెండర్‌లో 10 లక్షలు స్వాహా? *సప్లయర్, అధికారులపై విచారణకు డిమాండ్* *నల్గొండ, గూఢచారి:* చిన్నారులకు ఎండ తాపం తగలకూడదని జిల్లా కలెక్టర్ తలపెట్టిన పుణ్యకార్యంలో దోపిడీ దొంగలు పడ్డారు. డిపార్ట్‌మెంట్ నుంచి బడ్జెట్ రాకున్నా, మినరల్ ఫండ్స్ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మంచి మనసుతో నిర్ణయించానట్లు తెలిసింది.  క్రాంప్టన్ HS Plus  హై స్పీడ్ ఫ్యాన్లు, ఫిలిప్స్ 20 వాట్స్ 3 ఇన్ వన్ ఎల్ఈడీ 4 ఫీట్ల ట్యూబ్‌లైట్లకు టెండర్ పిలిచి ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే సాగింది. అసలు  కుంభకోణం జరిగింది మాత్రం సప్లైలోనే.  టెండర్‌లో పేర్కొన్న క్రాంప్టన్ HS Plus హై స్పీడ్ ఫ్యాన్లకు బదులు నాసిరకం నార్మల్ సీవిండ్ ఫ్యాన్లు, ఫిలిప్స్ 3 ఇన్ వన్ ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లకు బదులు నార్మల్ ఫిలిప్స్, కొన్నిచోట్ల క్రాంప్టన్ నార్మల్ ట్యూబ్‌లైట...

*CURE ప్రాంతానికి కొత్త ఊపిరి: హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారుస్తాం - సీఎం రేవంత్*

Image
  *CURE ప్రాంతానికి కొత్త ఊపిరి: హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారుస్తాం - సీఎం రేవంత్*   *భవిష్యత్ తరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధ అభివృద్ధి*   *పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సీఎం వెల్లడి* *హైదరాబాద్, గూఢచారి:* ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ (CURE) మొత్తంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శనివారం జరిగిన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆధునీకరణ, నగరీకరణతో సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం సవివరంగా ఆవిష్కరించారు. *ట్రాఫిక్ ఫ్రీ హైదరాబాద్ లక్ష్యం*   పెరుగుతున్న నగరీకరణ వల్ల సమీప భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉ...

*ఉప్పల ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది*

Image
*ఉప్పల ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది*   *పేదింటి ముగ్గురు ఆడపిల్లల వివాహాలకు పుస్తెమెట్టెలు, చీరెలు పంపిణీ*   *కులాలకు అతీతంగా ఉప్పల దంపతుల సేవలు* *నాగోల్, గూఢచారి:* సమాజ సేవలో తనదైన ముద్ర వేసుకుంటున్న ఉప్పల ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. నాగోల్‌లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త, ఐవీఎఫ్ ప్రథమ మహిళ ఉప్పల స్వప్న దంపతులు ముగ్గురు పేదింటి ఆడపిల్లల వివాహాలకు పుస్తెమెట్టెలు, చీర, గాజులు అందజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. కులమతాలకు అతీతంగా సాయం అందిస్తున్న ఉప్పల దంపతులు ఈసారి ముదిరాజ్, వైశ్య సామాజిక వర్గాలకు చెందిన మూడు కుటుంబాలకు అండగా నిలిచారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం సిరసముందర్‌కు చెందిన నీరడి సాత్విక, షామీర్‌పేటకు చెందిన రాపాని లలిత, ఓల్డ్ మలక్‌పేటకు చెందిన ఎడ్ల శివాని వివాహాలకు కావాల్సిన మంగళసూత్రాలు, నూతన వస్త్రాలను అందించారు. శివాని తండ్రి పక్షవాతంతో మంచాన పడగా, తల్లి కూలీ పనులతో కుటుంబాన్ని పోషిస్తున్న దీనస...

*ఐవీఎఫ్ కేంద్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు జన్మదిన శుభాకాంక్షలు* - కోటగిరి దైవాధీనం*

Image
*ఐవీఎఫ్ కేంద్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు జన్మదిన శుభాకాంక్షలు* - కోటగిరి దైవాధీనం*  *హైదరాబాద్:* ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) కేంద్ర కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ శాఖ అధ్యక్షుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదిన వేడుకలను ఐవీఎఫ్ నాయకులు ఘనంగా నిర్వహించారని ఐవీఎఫ్ తెలంగాణ మీడియా కమిటీ చైర్మన్ కోటగిరి దైవాధీనం  తెలిపారు. మే 5వ తేదీన శ్రీనివాస్ గుప్తా పుట్టినరోజు కాగా, ఆ రోజు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కామాఖ్య దేవి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొంది, గత రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారని  పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం ఐవీఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రేపాల భద్రాద్రి ఆధ్వర్యంలో జిల్లా కోశాధికారి గోవిందు బాలరాజుతో కలిసి హైదరాబాద్‌లో శ్రీనివాస్ గుప్తాను కలిసి కేక్ కటింగ్ చేసి, శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ రాష్ట్ర కోశాధికారి నారాయణ, యువజన విభాగం కోశాధికారి నరేష్, గజ్వేల్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు తూముకుంట నర్సిరెడ్డి, ఐవీఎఫ్ నాయకులు...